ఆకట్టుకుంటున్న సరికొత్త హోండా జాజ్ వెరీఎంట్.. ప్రీ-బుకింగ్స్ కూడా ప్రారంభం..
న్యూ జాజ్‌ను దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హెచ్‌సిఐఎల్ డీలర్‌షిప్‌ల వద్ద రూ.21 వేలతో ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు. కారును ఆన్‌లైన్‌లో 5,000 మొత్తం చెల్లించి కూడా బుక్ చేసుకోవచ్చు.
దేశంలోని ప్రముఖ కార్ల తయారీదారుల్లోని హోండా కార్స్ ఇండియా రాబోయే న్యూ జాజ్ ప్రీ-లాంచ్ బుకింగ్లను ప్రారంభించింది. న్యూ జాజ్‌ను దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హెచ్‌సిఐఎల్ డీలర్‌షిప్‌ల వద్ద రూ.21 వేలతో ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు. కారును ఆన్‌లైన్‌లో 5,000 మొత్తం చెల్లించి కూడా బుక్ చేసుకోవచ్చు.
ఈ నెలలోనే కంపెనీ ఈ కారును విడుదల చేయనుంది. దేశంలో లాంచ్ చేయడానికి ముందే హోండా ఈ కారు టిసర్ విడుదల చేసింది. స్టైలిష్, స్పోర్టి లుక్ ఉంటుందని టిజర్ ద్వారా తెలుస్తుంది. అయితే కారు సైజులో ఎలాంటి మార్పు ఉండదు.
అయితే, ఇది చాలా వినూత్నమైన, సరికొత్త అప్ డేట్ తో వస్తుందని హోండా హామీ ఇచ్చింది. జాజ్ 1.2-లీటర్ ఐ-వీటెక్ పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే లభిస్తుంది. ఇందులో మాన్యువల్, సివిటి ట్రాన్స్‌మిషన్ రెండింటిలోనూ లభిస్తుంది. కానీ డీజిల్ ఆప్షన్ మాత్రం ఉండదు.
also read వోల్వో కార్స్ అమ్మకాలలో వృద్ధి.. ఆంక్షల సడలింపుతో పెరిగిన సేల్స్.. ...
2020 జాజ్ కారు స్టైల్‌ని కూడా ఎక్స్‌డ్యూస్ చేస్తుంది. కొత్త బ్లాక్ గ్రిల్ అప్‌గ్రేడ్ తో, డిఆర్‌ఎల్‌తో ఎల్‌ఇడి హెడ్‌లైట్లు, ఎల్‌ఇడి ఫాగ్ లాంప్స్, రియర్ ఎల్‌ఇడి వింగ్ లైట్, న్యూ ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్ ఉన్నాయి. జాజ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో కూడా వస్తుంది. ఇది ఖచ్చితంగా అందరి చూపులను ఆకట్టుకుంటుందని మేము అనుకుంటున్నాము.
మాన్యువల్, సివిటి రెండింటిలోనూ క్రూయిజ్ కంట్రోల్, స్మార్ట్ ఎంట్రీ, పుష్ బటన్ స్టార్ట్ / స్టాప్ సిస్టమ్ వంటి మరెన్నో ఫీచర్లతో హోండా జాజ్ వస్తోంది. సివిటి వేరియంట్లో హోండా కారుపై పాడిల్ షిఫ్టర్లను కూడా అందిస్తోంది.
హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, మార్కెటింగ్ & సేల్స్ డైరెక్టర్ రాజేష్ గోయెల్ మాట్లాడుతూ, "గత సంవత్సరాలుగా జాజ్ కస్టమర్లు పెట్రోల్ పవర్‌ట్రైన్ వెరీఎంట్ పట్ల ఉన్న బలమైన డిమాండ్ ని మేము గమనించాము.
దీనికి ప్రతిస్పందిస్తూ, మేము ప్రత్యేకంగా న్యూ జాజ్‌ను వారికి అందించాలని నిర్ణయించుకున్నాము మాన్యువల్, సివిటి వేరియంట్లలో పెట్రోల్ ఇంజిన్ జాజ్ తీసుకొచ్చాము. ఈ సరికొత్త వెరీఎంట్ పండుగ సీజన్, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో తాజా ఉత్సాహాన్ని నింపుతుంది. "అని అన్నారు.