వోల్వో కార్స్ అమ్మకాలలో వృద్ధి.. ఆంక్షల సడలింపుతో పెరిగిన సేల్స్..
ఈ నెలలో కంపెనీ 62,291 కార్లను విక్రయించింది. యూరప్, యు.ఎస్, చైనా దేశాలలో గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే అమ్మకాల వృద్ధిని నమోదు చేశాయి. కోవిడ్ -19 మహమ్మారి, ఆంక్షలను ఎత్తివేసినందున ఐరోపాలో అమ్మకాలు జూలైలో తిరిగి వృద్ధిలోకి వచ్చింది.
లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోల్వో కార్స్ ప్రపంచ అమ్మకాలలో 14.2% వృద్ధిని నమోదు చేసింది. వోల్వో కార్స్ జూలైలో మంచి అమ్మకాలను కనబరిచింది, గత ఏడాదితో పోలిస్తే సేల్స్ 14.2% పెరిగాయి, జనవరి నుండి జూలై కాలంలో సేల్స్ 16% క్షీణత నమోదైంది.
ఈ నెలలో కంపెనీ 62,291 కార్లను విక్రయించింది. యూరప్, యు.ఎస్, చైనా దేశాలలో గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే అమ్మకాల వృద్ధిని నమోదు చేశాయి. కోవిడ్ -19 మహమ్మారి, ఆంక్షలను ఎత్తివేసినందున ఐరోపాలో అమ్మకాలు జూలైలో తిరిగి వృద్ధిలోకి వచ్చింది.
వోల్వో కార్స్ అవార్డు విన్నింగ్ ఎస్‌యూవీ రేంజ్ కార్ డిమాండ్ కారణంగా ఈ నెలలో బలమైన వృద్ధికి కారణమైంది. వి60 ఎస్టేట్ కారు, యు.ఎస్ లో నిర్మించిన ఎస్60 సెడాన్ కార్ల పనితీరు వృద్దికి దోహదపడ్డాయని కంపెనీ తెలిపింది.
also read ఫెరారీ అత్యంత వేగమైన సూపర్ కారు.. కేవలం 2.9 సెకండ్లలోనే 100 కి.మీ స్పీడ్ ...
జనవరి నుండి జూలై మొదటి ఏడు నెలల్లో వోల్వో కార్స్ 3,32,253 కార్లను విక్రయించింది, గత ఏడాదితో పోలిస్తే 16% తగ్గింది. ఐరోపాలో వోల్వో కార్స్ అమ్మకాలు జూలైలో 28,700 కార్లను విక్రయించింది, గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 12.5% పెరిగింది.
ఈ సంవత్సరంలో మొదటి ఏడు నెలల్లో అమ్మకాలు 24.1% తగ్గాయి. చైనాలో వోల్వో సంస్థ 14,410 కార్లను విక్రయించింది, గత ఏడాది జూలైతో పోలిస్తే 14.0% పెరిగింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే సంవత్సరంలోని మొదటి ఏడు నెలల్లో అమ్మకాలు 0.3% తగ్గాయి.
సంవత్సరంలో మొదటి ఏడు నెలల్లో వోల్వో ఎక్స్‌సి 60 కారు అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా 96,622 కార్లు (2019లో 1,11,943 కార్లు), తరువాత వోల్వో ఎక్స్‌సి 40 87,085 కార్లు (2019లో 74,062 కార్లు), ఎక్స్‌సి 90 46,669 కార్లు (2019లో 55,443 కార్లు) అమ్ముడుపోయాయి.