అమ్మకాలలో హ్యుండాయ్​ మోటార్స్ టాప్...ప్యాసింజర్ కార్లు కాస్త బెటర్...

ఈ ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్-డిసెంబర్)లో ప్యాసింజర్ వాహనాల ఎగుమతులు 6 శాతం వృద్ధిని సాధించాయి. ఈ విభాగంలో హ్యుండాయ్​ మోటార్ 1.45 లక్షల కార్ల అమ్మకాలతో అగ్రస్థానంలో నిలిచింది. తరువాత ఫోర్డ్ ఇండియా, మారుతీ సుజుకీ నిలిచాయి.

Passenger vehicle exports rise 6 per cent in April-Dec; Hyundai, Ford lead the pack

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో ప్యాసింజర్ వాహనాల (పీవీ) ఎగుమతులు 5.89 శాతం పెరిగాయి. సియామ్ తాజా​ డేటా ప్రకారం, ఈ విభాగంలో దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం ‘హ్యుండాయ్​ మోటార్స్’​ 1.45 లక్షల యూనిట్ల అమ్మకాలతో ముందు నిలిచింది. 2018 ఏప్రిల్-డిసెంబర్ మధ్య 5,10,305 ప్రయాణికుల వాహనాలు ఎగుమతయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయంలో 5,40,384 యూనిట్లు ఎగుమతి అయ్యాయి.

also read గిన్నిస్ వరల్డ్ రికార్డులోకి హ్యుందాయ్ కారు...

సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్స్ మాన్యుఫాక్చురర్స్​ నాయకుడు రాజేశ్ మాథ్యూస్ మాట్లాడుతూ ‘ఈ ఏడాది ఏప్రిల్-డిసెంబర్​ మధ్య కార్ల ఎగుమతులు 4,04,552 యూనిట్ల వద్ద 4.44 శాతం వృద్ధిని సాధించాయి. యుటిలిటీ వాహనాల ఎగుమతులు 1,33,511 యూనిట్ల వద్ద 11.14 శాతం వృద్ధిని సాధించాయి. గతేడాది ఇదే కాలంలో వ్యాన్లు 2,810 యూనిట్లు ఎగుమతికాగా.. ఈ ఏడాది 2,321 యూనిట్లు మాత్రమే అమ్ముడై 17.4 క్షీణతను నమోదు చేశాయి’ అని తెలిపారు.  

ముందంజలో హ్యుండాయ్ మోటార్స్
ప్రయాణికుల వాహనాల విభాగంలో హ్యుండాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్​ (హెచ్​ఎంఐఎల్​) ముందంజలో ఉంది. ఫోర్డ్​ ఇండియా, మారుతీ సుజుకీ ఇండియా(ఎంఎస్​ఐ) వరుసగా రెండవ, మూడవ స్థానాల్లో ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్​-డిసెంబర్​ మధ్య దక్షిణ కొరియా దిగ్గజం హ్యుందయ్​ 1,44,982 యూనిట్లు ఎగుమతులు చేసింది.

Passenger vehicle exports rise 6 per cent in April-Dec; Hyundai, Ford lead the pack

గతేడాదితో పోల్చితే ఇది 15.17 శాతం అధికం. 2020లోనూ ఇదే జోరు కొనసాగిస్తామని ఆ కంపెనీ చెబుతోంది.హ్యుండాయ్ మోటార్స్  ఆఫ్రికా, పశ్చిమాసియా, లాటిన్ అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా పసిఫిక్​ ఖండాల్లోని 90కి పైగా దేశాలకు తమ వాహనాలను ఎగుమతి చేస్తోంది.

జోరు తగ్గిన మారుతి సుజుకి
ఫోర్డ్​ ఇండియా ఈ ఏడాది ఏప్రిల్​-డిసెంబర్​ మధ్య 1,06,084 కార్లను ఎగుమతి చేసింది. గతేడాదితో పోల్చితే ఇది 12.57 శాతం తక్కువ. మరోవైపు దేశీయ కార్​ మార్కెట్ దిగ్గజం మారుతి సుజుకి ఇండియా 75,948 యూనిట్లు మాత్రమే ఎగుమతి చేసింది. గతేడాదితో పోల్చితే ఇది 1.7 శాతం తక్కువ.

also read యూత్ కోసం కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్... హై స్పీడ్, లేటెస్ట్ ఫీచర్లతో...

నిస్సాన్ మోటార్ ఇండియా ఇదే సమయంలో 60,739 యూనిట్లు ఎగుమతి చేసింది. గతేడాదితో పోల్చితే 39.97 శాతం తన ఎగుమతులు పెంచుకుంది. దేశీయ మార్కెట్​లో వాహన అమ్మకాలు నిలిపివేసిన జనరల్ మోటార్స్ ఇండియా మాత్రం 54,863 కార్లను విదేశాలకు ఎగుమతి చేసింది.

వోక్స్​వాగన్​ అండ్ కియా మోటార్స్​ తదితర సంస్థల ఎగుమతులు ఇలా
ఈ ఏప్రిల్-డిసెంబర్ నెల​ల మధ్య వోక్స్​వాగన్ ఇండియా 47,021 కార్లు ఎగుమతి చేశాయి, కియా మోటార్స్ ఇండియా 12,496 యూనిట్లు, రెనాల్ట్ ఇండియా 12,496 యూనిట్లు ఎగుమతి చేశాయి. మహీంద్రా అండ్​ మహీంద్రా 10,017 కార్లు, టయోటా కిర్లోస్కర్ మోటార్ 8,422 కార్లు, హోండా కార్స్ ఇండియా 3,316 కార్లు ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేశాయి. ఎఫ్​సీఏ ఇండియా 2,391, టాటా మోటార్స్ 1,842 కార్లు విదేశాలకు ఎగుమతి చేశాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios