కార్ల తయారీ నిస్సాన్  బిఎస్ 4 కంప్లైంట్  కిక్స్ ఎస్‌యూవీ పై 1.63 లక్షల వరకు ప్రయోజనాలను అందిస్తుంది. కాష్  బెనిఫిట్స్,   ఎక్స్ఛేంజి అఫర్లు, కార్పొరేట్ డిస్కౌంట్లు ఇంకా మరిన్ని ఉన్నాయి. బిఎస్ 4 వాహనాల సేల్స్ గడువు మార్చి 31, 2020 తో ముగుస్తుండడంతో వాహన తయారీదారులు కోసం ప్రత్యేక తగ్గింపులు,  మరెన్నో బెనెఫిట్స్ అందిస్తున్నారు.

  బిఎస్ 4 కంప్లైంట్ గల నిస్సాన్ కిక్స్ ఎస్‌యూవీపై 1.63 లక్షల వరకు తాగింపును ప్రకటించింది.కాష్  బెనిఫిట్స్,  ఎక్స్ఛేంజి అఫర్లు, కార్పొరేట్ డిస్కౌంట్లు మరిన్ని ఉన్నాయి. ప్రస్తుతం నిస్సాన్ కిక్స్ ధర ₹ 9.55 లక్షల నుండి 13.69 లక్షలు వరకు ఉంది (ఎక్స్-షోరూమ్, ఢీల్లీ).

also read డుకాటీ బైకుల పై కళ్ళు చెదిరే భారీ డిస్కౌంట్...

బిఎస్ 6 ఉద్గార నిబంధనలకు మార్చడంతో కంపెనీ డీజిల్ వేరియంట్ నిలిపివేయడంతో, భారీ ఆఫర్లు డీజిల్‌తో నడిచే మోడళ్లపై ఉన్నాయి. డీజిల్ వేరియంట్లలో ప్రస్తుతం  45వేల వరకు తగ్గింపు, 40వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, 10వేల వరకు కార్పొరేట్ డిస్కౌంట్, 13,100 విలువైన ఫ్రీ అసెసోరిస్, 2 సంవత్సరాలు + ఫ్రీ 3 సంవత్సరాల ఎక్స్ టెండ్ వారంటీ బెనెఫిట్స్ 20,500 వరకు ఉన్నాయి.

ఇంకా నిస్సాన్ 36 నెలలకు 6.99 శాతం వడ్డీ రేటుతో కార్లను అందిస్తోంది. నిస్సాన్ కిక్స్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఫీచర్స్  కూలింగ్ గ్లోవ్ బాక్స్, బ్రేక్ అసిస్ట్‌ ఎబిఎస్ + ఇబిడి, ఎలక్ట్రికల్ అడ్జస్ట్ చేయగల ఓఆర్‌విఎం, డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, ఆటో ఎసి + రియర్ ఎసి వెంట్స్, 6-వే మాన్యువల్ సీట్ అడ్జస్ట్, బ్యాక్ పార్కింగ్ సెన్సార్లు, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ అన్‌లాక్, షార్క్ ఫిన్ యాంటెన్నా, ఎస్‌యూవీకి 360 డిగ్రీల కెమెరా కూడా లభిస్తుంది.

నిస్సాన్ కిక్స్ 1.5-లీటర్ పెట్రోల్, 1.5-లీటర్ కె9కె డీజిల్ ఇంజన్ తో వస్తుంది. పెట్రోల్ ఇంజన్ 104 బిహెచ్‌పి, 142 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను అందిస్తుంది. డీజిల్ ఇంజన్ 108 బిహెచ్‌పి, 240 ఎన్‌ఎమ్ పీక్ టార్క్ చేస్తుంది. పెట్రోల్ ఇంజిన్‌కు 5-స్పీడ్ గేర్‌బాక్స్, డీజిల్‌కు 6-స్పీడ్ యూనిట్ గేర్‌బాక్స్ అందిస్తుంది. ఇందులో ఆటోమేటిక్ ఆప్షన్ లేదు.