టాటా అనుబంధ విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) నుంచి దేశీయంగా తయారైన రేంజ్ రోవార్ వెలార్ కారు మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ కారు ప్రారంభ ధర రూ. 72.47లక్షలు(ఢిల్లీ ఎక్స్ షోరూం)గా నిర్ణయించారు.

దేశీయంగా తయారైన ఈ కారులో సింగిల్ ట్రిమ్, ఆర్ డైనమిక్-ఎస్ రకం, పెట్రోల్, డీజిల్ పవర్ ట్రెయిన్‌లలో లభించననుంది. మనదేశంలోనే తయారు చేయడం వల్ల ఈ కారు 15-20శాతం వరకు తక్కువ ధరకే లభిస్తోంది. 

లగ్జరీ కార్ల విభాగంలో మెరుగైన వృద్ధిని సాధించే అవకాశం ఉందని జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా లిమిటెడ్ అధ్యక్షుడు, ఎండీ రోహిత్ సూరి అన్నారు. రేంజ్ రోవర్ వేలార్‌కు మనదేశంలో మంచి డిమాండ్ ఉందని తెలిపారు.

ఈ వాహనంలో ఎల్ఈడీ లైట్లు, డీప్లైబుల్ ప్లష్ హ్యాండిల్స్, బయటివైపు బ్యాక్ స్పాయిలర్ వంటి ఫీచర్లతో విలక్షణమైన రూపకల్పన చేశారు. లోపలి భాగాలలో విప్లవాత్మక టచ్ ప్రో డుయో టెక్నాలజీని కలిగివుంది. 

ఇంకా ఈ వాహనంలో రెండు ఇంటిగ్రేటెడ్ 10 అంగుళాల టచ్ స్క్రీన్లు ఉన్నాయి. విస్తారమైన డ్రైవింగ్ సమాచారం, యాక్టివ్ సెక్యూరిటీ డేటాను అందించే ఇంటరాక్టివ్ డ్రైవర్ డిస్‌ప్లే కలిగివుంది. 

సింగిల్ ఆర్- డైనమిక్ ఎస్ ట్రిమ్‌తో కూడిన ఎస్‌యూవీ మోడల్ ప్రీమియం కారు 179 హెచ్పీ, 430 ఎన్ఎం ఆఫ్ టార్చ్ సామర్థ్యం గల రెండు లీటర్ల డీజిల్ మోటార్ ఇంజిన్‌తోపాటు 250 హెచ్పీ, 365 ఎన్ఎం ఆఫ్ టార్చ్ సామర్థ్యం గల 2.0 పెట్రోల్ వర్షన్ ఇంజిన్ కలిగి ఉన్నది. రెండు మోడల్ ఇంజిన్లు గల కార్లు 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ కలిగి ఉన్నాయి. 

న్యూ రేంజ్ రోవర్ వెలార్ కారు బోల్డ్ ఫ్రంట్, ఎల్ఈడీ లైట్లు, డిప్లాయబుల్ ఫ్లస్ డోర్ హ్యాండిల్స్, ఇంటిగ్రేటెడ్ రేర్ స్పాయిలర్, గ్రెయిన్డ్ లెథర్ సీట్లు, బ్రైట్ మెటల్ పెడల్స్, లెథర్ స్టీరింగ్ వీల్, అట్లాస్ బెజెల్, 40:20:40 స్ప్లిట్ ఫోల్డ్ రేర్ సీట్‌తోపాటు  25.4 సెం.మీ టచ్ స్క్రీన్స్ తదితర ఫీచర్లు ఉన్నాయి.

ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఎయిర్ క్వాలిటీ సెన్సార్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ స్టీరింగ్ కాలం, స్లైడింగ్ పనోరమిక్ రూఫ్, మెరిడీయన్ సౌండ్ సిస్టమ్ (380 వాట్స్) తోపాటు 11 స్పీకర్లు, నేవిగేషన్ ప్రో అండ్ ఇంటరాక్టివ్ డ్రైవర్ డిస్ ప్లే కలిగి ఉన్నాయి. 

ఇంకా పెరిమెట్రిక్, వాలుమెట్రిక్ ప్రొడెక్షన్, పవర్ ఆపరేటెడ్ చైల్డ్ లాక్స్, రేర్ ఐసోఫిక్స్, 6 ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రిక్ పార్కిగ్ బ్రేక్, డ్రైవర్ కండీషన్ మానిటర్, ఎమర్జెన్సీ బ్రేక్ అసిస్ట్, ఆంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, లేన్ కేపీ్ అసిస్ట్, ఎలక్ట్రిక్ బ్రేక్- ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, రోల్ స్టెబిలిటీ అండ్ కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. 

అలాగే ఆల్ టెర్రెన్ ప్రోగ్రెస్ కంట్రోల్ (ఏటీపీసీ) సిస్టమ్, మడ్, వెట్ గ్రాస్, డర్ట్ రోడ్స్ వంటి ప్రాంతాల్లోనూ స్టెడీ స్పీడ్ ఆన్ స్లిప్పరీ సర్ పేసేస్ (ఒకే స్పీడ్) దీని ప్రత్యేకతలు.

కాగా, ఈ వాహనాలు 26 అధికారిక డీలర్ల ద్వారా మనదేశంలో అందుబాటులో ఉన్నాయి. ల్యాండ్ రోవర్ శ్రేణిలో రేంజర్ రోవర్ వెలార్ తోపాటు డిస్కవరీ స్పోర్ట్, రేంజ్ రోవర్ ఎమోక్, రేంజ్ రోవర్ డిస్కవరీ, రేంజ్ రోవర్ స్పోర్ట్, రేంజ్ రోవర్ ఉన్నాయి.