Asianet News TeluguAsianet News Telugu

మెర్సిడెస్ బెంజ్ కొత్త మోడల్ కారు విడుదల...6 సెకన్లలో 100కి.మీ వేగంతో....

మెర్సిడెస్ బెంజ్ కంపెనీ పేర్కొన్నట్లుగా ఈ కారు భారతదేశంలో స్థానికంగా తయారు చేయబడింది. దీనితో వాహన తయారీదారి ప్రస్తుతం భారతదేశంలో లగ్జరీ విభాగంలో 8 ఎస్‌యూవీలను అందిస్తున్నామని ఇది దేశంలోనే అతిపెద్దదని కంపెనీ పేర్కొంది.

mercedes benz launches new glc coupe priced from rs 62 lakh
Author
Hyderabad, First Published Mar 4, 2020, 1:27 PM IST

న్యూ ఢిల్లీ: జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్  మెర్సిడెస్ బెంజ్ మంగళవారం  కొత్త మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి కూపేను లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ .62.70 లక్షల (ఎక్స్‌షోరూమ్, ఇండియా)తో  విడుదల చేసింది.

జిఎల్‌సి 300 మోడల్ కారు 4మాటిక్ పెట్రోల్, జిఎల్‌సి 300 డి4 మాటిక్ డీజిల్ ఇంజన్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఈ కారు ధర రూ .63.70 లక్షల వరకు ఉంటుంది (ఎక్స్-షోరూమ్, ఇండియా).

also read  హైదరాబాద్‌ మార్కెట్లోకి కొత్త బైక్...గంటకు 85 కిలోమీటర్ల వేగంతో...

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ పేర్కొన్నట్లుగా ఈ కారు భారతదేశంలో స్థానికంగా తయారు చేశారు. దీనితో వాహన తయారీదారు ప్రస్తుతం భారతదేశంలో లగ్జరీ విభాగంలో 8 ఎస్‌యూవీలను అందిస్తున్నామని ఇది దేశంలోనే అతిపెద్దదని కంపెనీ పేర్కొంది.

జిఎల్‌సి కూపే మెర్సిడెస్ మి కనెక్ట్‌తో వస్తుంది. ఇది రిమోట్ లాక్, అన్‌లాక్, కార్ లొకేటర్, స్పీడ్ మానిటర్, ఎమర్జెన్సీ ఇ-కాల్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫీచర్లన్ని  కస్టమర్ స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్ నుండి యాక్సెస్ చేయవచ్చు. కూపే ఎస్‌యూవీ ఓవర్ ది ఎయిర్ (ఒటిఎ) అప్‌డేట్ ఫంక్షన్‌తో వస్తుంది.

మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి 300డి కూపే అనేది బిఎస్-VI కంప్లైంట్ తో వస్తుంది.  ఇందులో ఇన్-లైన్ ఫోర్-సిలిండర్ డీజిల్ ఇంజిన్ అమర్చారు. ఇది 248 పిఎస్ శక్తిని, 500 ఎన్ఎమ్ టార్క్ను ఇస్తుంది. ఇది కేవలం 6.6 సెకన్లలో 0-100 కిలోమీటర్ల స్పీడ్ అందుకోగలదు.

మరోవైపు, జిఎల్‌సి 300 బిఎస్-6 కంప్లైంట్ ఇంజన్ తో, ఇన్-లైన్ పెట్రోల్ మోటారుతో 261 పిఎస్ శక్తి, 370 ఎన్ఎమ్ టార్క్ కలిగి ఉంది. ఇది 6.3 సెకన్లలో 0-100 కి.మీ వేగంతో దూసుకెళ్లగలాదు. పెట్రోల్, డీజిల్ ఇంజన్ రెండూ కూడా  9జి-ట్రానిక్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తాయి.

also read చౌక ధరకే కొత్త వెహికల్స్.. సంస్థలు.. డీలర్ల ఆఫర్ల వర్షం.. బట్?

ఈ కారు  లాంచ్ గురించి మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ & సిఇఒ మార్టిన్ ష్వెంక్ మాట్లాడుతూ, “జిఎల్‌సి కూపేతో, మా పోర్ట్‌ఫోలియోలో మరో స్టైలిష్, డైనమిక్ ఎస్‌యూవీని జోడించడానికి అలాగే లగ్జరీలో సాటిలేని ఉత్పత్తిని కొనసాగించడానికి మేము సంతోషిస్తున్నాము. ఇప్పుడు దాని సిరీస్ వెర్షన్‌లో స్థానికంగా ఉత్పత్తి చేయబడిన జిఎల్‌సి కూపే ఎస్‌యువి కూపే ప్రజాదరణను మరింత పెంచుతుంది. "


మెర్సిడెస్ మి కనెక్ట్ ద్వారా 'ఓవర్ ది ఎయిర్' అప్ డేట్ కలిగి, అత్యంత స్పష్టమైన, ఆకర్షణీయమైన ఎం‌బి‌యూ‌ఎక్స్ కు జి‌ఎల్‌సి కూపే దాని సాంకేతికత ద్వారా ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ ఎస్‌యూ‌విలో ఇంటెలిజెంట్ వర్చువల్ ఇన్-కార్ అసిస్టెంట్ ఉంది. 'హే మెర్సిడెస్' గా ఇంకా మెర్సిడెస్ మి కనెక్ట్ నుండి క్లాస్-లీడింగ్ 24 ఎక్స్ 7 కనెక్ట్ ఫీచర్స్, సర్వీసులతో ఎన్‌టిజి 6.0 తో వస్తుంది. ” అని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios