మహీంద్ర అండ్ మహీంద్ర.. బోల్డ్ న్యూ టీయూవీ 300 ఫేస్‌లిఫ్ట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ లాంచ్ చేస్తున్నట్లు గతంలో ప్రకటించింది. 2015లో లాంచ్ అయిన కాంపాక్ట్ ఎస్‌యూవీకి ఇప్పుడు అదనపు ఫీచర్లు జోడించి మహీంద్ర టీయూవీ 300ను భారత్‌లో విడుదల చేసింది. కొత్త టీయూవీ 300 ప్రారంభ ధరను రూ. 8.38లక్షలు(ఎక్స్ షోరూం, ఇండియా)గా మహీంద్ర నిర్ణయించింది.

న్యూ 2019 టీయూవీ అథెంటిక్ ఎస్‌యూవీ డిజైన్, కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో వచ్చిన ఒకే ఒక్క ప్రొడక్ట్ అని మహీంద్ర వెల్లడించింది. అగ్రెసివ్ పియానో బ్లాక్, క్రోమ్ ఇన్‌సర్ట్స్‌తో ఫ్రంట్ గ్రిల్, మస్కూలర్ సైడ్ క్లాడింగ్, ఎక్స్ ఆకారంలో మెటాలిక్ గ్రే స్పేర్ వీల్ కవర్, డేలైట్ రన్నింగ్ లైట్స్‌తో కొత్త హెడ్ ల్యాంప్ డిజైన్ కలిగివుంది. 

మంచి ప్రీమియర్ లుక్ వచ్చేందుకు సిల్వర్ అక్సెంట్స్ డిజైన్‌తో  పినినిఫేరీనా ఆకట్టుకునేలా రూపొందించింది. న్యూ 2019 మహీంద్ర టీయూవీ 300 న్యూ రివర్స్ పార్కింగ్ కెమెరా, 7.0అంగుళాల ఇన్ఫోటేన్మెంట్ సిస్టమ్ విత్ జీపీఎస్ ఇంటిగ్రేషన్, స్టాటిక్ బెండింగ్ హెడ్‌ల్యాంప్స్, మైక్రో హైబ్రిడ్ టెక్నాలజీ ఫీచర్లను కలిగివుంది. 

మహీంద్ర అండ్ మహీంద్ర లిమిటెడ్ సేల్స్ అండ్ మార్కెటింగ్, ఆటోమోటివ్ డివిజన్ చీఫ్ వీజయ్ రామ్ నోక్రా మాట్లాడుతూ.. బోల్డ్ న్యూ టీయూవీ 300 ఫేస్‌లిఫ్ట్ వర్షన్ మార్కెట్లోకి తీసుకురావడం ఆనందంగా ఉందన్నారు. 7 సీట్లు కలిగిన ఈ వాహనంలో హాయిగా ప్రయాణించవచ్చని, హైటెక్ ఫీచర్లు ఉన్నాయని తెలిపారు. కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇప్పటికే 1లక్ష సంతృప్తి చెందిన కస్టమర్లను కలిగివుందని, తాజా వర్షన్ కూడా వినియోగారులను ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

న్యూ 2019 మహీంద్ర టీయూవీ 300.. ఎంహాక్ 100, 1.5లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్.. 100బీహెచ్‌పీ శక్తిని, 240ఎన్ఎం టర్క్‌ను విడుదల చేస్తుంది. కూషాన్ సస్పెన్షన్ టెక్నాలజీ, ఆప్టిమైజ్డ్ రైడ్ హైట్ టెక్నాలజీ కంఫర్టబుల్ డ్రైవింగ్ అనుభవాన్ని కలిగిస్తాయి. 

బలమైన స్టీల్‌తో ఈ వాహనం బాడీని తయారు చేశారు. మహీంద్ర స్కార్పియోలాగే దీని నిర్మాణం ఉంటుంది. హైవే రెడ్, మిస్టిక్ కాపర్ రంగులలో బోల్డ్ న్యూ టీయూవీ 300 అందుబాటులో ఉన్నాయి. రెడ్, బ్లాక్, సిల్వర్, బ్లాక్, బోల్డ్ బ్లాక్, మిజిస్టిక్ సిల్వర్, పీర్ల్ వైట్ లాంటి రంగుల్లో కూడా వస్తున్నాయి.