‘మినీ జాన్ కూపర్ వర్క్స్’: 6.1 సెకన్లలో 100 కిమీ స్పీడ్, ధరెంతంటే..?
లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘బీఎండబ్ల్యూ’ మార్కెట్లోకి మినీ జాన్ కూపర్ వర్క్స్’ను విపణిలోకి విడుదల చేసింది. ఈ కారు 6.1 సెకన్లలో 100 కి.మీ స్పీడందుకోవడం ఈ కారు స్పెషాలిటీ.
లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ 2019 మినీ జాన్ కూపర్‌వర్క్స్‌ను భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ.43.5లక్షలుగా నిర్ణయించింది.
2017లో మినీ కూపర్ జేసీడబ్ల్యూ ప్రో ఎడిషన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. అప్పట్లో 20 కార్లను మాత్రమే విక్రయించారు. 6.1 సెకన్లలో 100 కి.మీ వేగం మినీ జాన్ కూపర్ వర్క్స్ స్పెషాలిటీ.
సరికొత్త మినీ కూపర్‌లో 2.0లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 228 బీహెచ్‌పీ శక్తి, 320 ఎన్‌ఎం టార్క్ విడుదల చేస్తుంది. 6.1 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకొంటుంది.
సరికొత్త చాసీస్, స్పోర్ట్స్ బ్రేక్స్, దీనిలో యాంటీ రోల్‌బార్స్, స్పోర్ట్స్, కంఫర్ట్, ఎఫీషియన్నీ మోడ్‌లలో డ్రైవ్ చేసే అవకాశం ఉంది.