15న విపణిలోకి ఎంజీ మోటార్స్ హెక్టర్: జూన్ నుంచి ప్రీ బుకింగ్స్

చైనా ఆటోమొబైల్ దిగ్గసం ఎస్‌ఏఐసీ మోటార్‌ కార్ప్‌ కంపెనీ అనుబంధ ఎంజీ మోటార్స్ ఇండియా సోమవారం తన ఎస్ యూవీ కారు ‘హెక్టర్’ను ఆవిష్కరించింది. ఈ నెల 15న విపణిలోకి ప్రవేశఫెట్టనున్నది. జూన్ నుంచి ప్రీ బుకింగ్స్ నమోదవుతాయి.

MG Motor rolls out first SUV Hector from Halol in Gujarat

ముంబై: భారత ఆటోమొబైల్‌ మార్కెట్లో తన సత్తా చాటేందుకు చైనా ఆటోమొబైల్ దిగ్గసం ఎస్‌ఏఐసీ మోటార్‌ కార్ప్‌ కంపెనీ సిద్ధమవుతోంది. ఎస్‌ఏఐసీ మోటార్‌ కార్ప్‌ భారత అనుబంధ కంపెనీ ఎంజీ మోటార్స్‌ ఇండియా ఇందుకోసం సోమవారం తన లేటెస్ట్‌ ఎస్‌యూవీ ‘హెక్టర్‌’ను ఆవిష్కరించింది. 

ఈ ఎస్‌యూవీని ఎంజీ మోటార్స్‌ మే 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతోంది. ఎస్‌ఏఐసీ మోటార్‌ కార్ప్‌ కంపెనీ బ్రిటన్‌కు చెందిన ఎంజీ మోటార్స్‌ను కొనుగోలు చేసి, ఈ కొత్త ఎస్‌యూవీని అభివృద్ధి చేసింది. 

భారత వినియోగదారులు, రహాదారుల పరిస్థితికి అనుగుణంగా హెక్టర్‌ ఎస్‌యూవీలో 300 ప్రత్యేక ఫీచర్లను జోడించినట్టు ఎంజీ మోటార్స్‌ ఇండియా ప్రెసిడెంట్‌, ఎండీ రాజీవ్‌ చాబా చెప్పారు.

జూన్ నెల నుంచి ‘హెక్టర్’ కార్ల కోసం ప్రీ బుకింగ్స్ నమోదు చేసుకోవచ్చు. గుజరాత్ లోని హలోల్ యూనిట్ నుంచి వీటిని ఉత్పత్తి చేస్తోంది. దేశవ్యాప్తంగా తమకు 50 నగరాల్లో గల 65 షోరూమ్‌ల నెట్‌వర్క్‌కు కొన్ని వారాల్లో హెక్టర్ మోడల్ కార్లు చేరతాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios