ఎం‌జి మోటర్స్ కొత్త బిజినెస్ ; ఇప్పుడు తక్కువ ధరకే కార్లను కొనోచ్చు..

దేశంలో సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ నిరంతరం పెరుగుతోంది. ఎంజీ మోటార్ ఇండియా కార్ల అమ్మకాలను పెంచడానికి సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారం మొదలు పెట్టింది. తమ డీలర్‌షిప్‌లో  మంచి ధరకు కార్లను విక్రయించవచ్చని కంపెనీ తెలిపింది. 

MG Motor enters into second-hand cars business

బ్రిటిష్ స్పొర్ట్స్ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటర్స్ ఇండియా సర్టిఫైడ్ సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారంలోకి అడుగు పెట్టింది. రీ-ఆష్యూర్ పేరుతో ఎంజీ మోటర్స్ సంస్థ ఈ వ్యాపారాన్ని ప్రారంభించింది. విశేషమేమిటంటే, దేశంలో సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ నిరంతరం పెరుగుతోంది.

ఎంజీ మోటార్ ఇండియా కార్ల అమ్మకాలను పెంచడానికి సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారం మొదలు పెట్టింది. తమ డీలర్‌షిప్‌లో  మంచి ధరకు కార్లను విక్రయించవచ్చని కంపెనీ తెలిపింది. 160 నాణ్యమైన టెస్ట్ ఆధారంగా కంపెనీ సెకండ్ హ్యాండ్ కార్ల ధరను అంచనా వేస్తుంది. తిరిగి విక్రయించడానికి ఈ కార్లను రిపేర్ చేయడంతో పాటు అవసరమైన అన్ని మెరుగులు చేస్తుంది. 

పాత కారును కొత్త కారుతో భర్తీ
ఎంజి కంపెనీ పాత కార్లను ఇక్కడ సులభంగా అమ్మవచ్చు అని చెప్పింది. అంతేకాదు పాత కారుకు బదులుగా సంస్థ నుండి కొత్త మోడల్ కారును ఖచ్చితంగా  తీసుకోవలసిన అవసరం కూడా ఉండదు. ఎంజి మోటార్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ గౌరవ్ గుప్తా మాట్లాడుతూ ఎంజి రీ-ఆష్యూర్ ప్రోగ్రాం ద్వారా ఎంజి కార్ల యజమానులకు తమ వాహన అమ్మకంపై ఉత్తమమైన ధర ఇస్తామని చెప్పారు. సంస్థ ప్రకారం ఈ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది. ఎంజీ మోటార్ ప్రస్తుతం భారత మార్కెట్లో హెక్టర్, హెక్టర్ ప్లస్, జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది. 

also read  ఉద్యోగులకు జీతాలే కాదు ఏకంగా 60 లక్షల షేర్లనే ఇచ్చేశాడు.. ...


గత నెలలో విడుదల చేసిన ఎస్‌యూవీ
ఎంజీ మోటార్ 6 సీట్ల  హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీని గత నెలలో విడుదల చేసింది. దీని ధర రూ.13.48 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఎం‌జి హెక్టర్, జెడ్ఎస్ ఎలక్ట్రిక్ తర్వాత భారతదేశంలో కంపెనీకి ఇది మూడవ కారు. ఆగస్టు 13 తర్వాత దాని ధరను సుమారు 50 వేల రూపాయలకు పెంచుతామని కంపెనీ ప్రారంభించిన సమయంలో తెలిపింది.


హెక్టర్ ప్లస్ లో మార్పులు
హెక్టర్ ప్లస్ కు కొన్ని కాస్మెటిక్ మార్పులు చేసింది. దాని లుక్ అంతకుముందు కంటే ఇప్పుడు మెరుగ్గా మారింది. వీటితో పాటు మూడు వరుసలో 6 సీట్లును అందిస్తుంది. హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీలో 6 సీట్ల సెటప్ తో మిడిల్ లైన్‌లో కెప్టెన్ సీట్లతో వస్తుంది.

ఇంజిన్
1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్, 1.5 లీటర్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజన్, 2 లీటర్ డీజిల్ ఇంజన్ ఉన్నాయి. రెండు పెట్రోల్ ఇంజన్లు 143 పిఎస్ శక్తిని, 250 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తాయి. డీజిల్ ఇంజన్ 170 పిఎస్ శక్తిని, 350 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.

మూడు ఇంజన్లలో 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ స్టాండర్డ్ గా వస్తుంది. హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్‌లో డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ కూడా ఉంది. రాబోయే పండుగ సీజన్‌లో గ్లోస్టర్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios