Asianet News TeluguAsianet News Telugu

ఉద్యోగులకు జీతాలే కాదు ఏకంగా 60 లక్షల షేర్లనే ఇచ్చేశాడు..

 తాజాగా  నికోలా కార్పొరేషన్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ ట్రెవర్ మిల్టన్ ఎలక్ట్రిక్-ట్రక్ స్టార్టప్ లో మొదట చేరిన 50 మంది ఉద్యోగులకు తన సొంత షేర్లలో 6 మిలియన్ల షేర్లు వారికి అందజేశాడు. నేను మొదట ఈ సంస్థను ప్రారంభించినప్పుడు నేను ప్రపంచంలోనే ఉత్తమమైన ఉద్యోగులను తీసుకోవాలనుకున్నాను. 

Nikola Founder Giving  His Own Stock Worth $233 Million to his First 50 Employees
Author
Hyderabad, First Published Aug 27, 2020, 4:30 PM IST

సంస్థలో పనిచేసే ఉద్యోగులకు ప్రతినెలా జీతాలు ఇవ్వటామే కానీ వారి బాగోగులను పట్టించుకునే యజమానులు చాలా తక్కువగా ఉంటారు. తాజాగా నికోలా కార్పొరేషన్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ ట్రెవర్ మిల్టన్ ఎలక్ట్రిక్-ట్రక్ స్టార్టప్ లో మొదట చేరిన 50 మంది ఉద్యోగులకు తన సొంత షేర్లలో 6 మిలియన్ల షేర్లు వారికి అందజేశాడు.

నేను మొదట ఈ సంస్థను ప్రారంభించినప్పుడు నేను ప్రపంచంలోనే ఉత్తమమైన ఉద్యోగులను తీసుకోవాలనుకున్నాను. ఇది నాకు చాలా పెద్ద సవాలుగా మారింది అని  ట్రెవర్ మిల్టన్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసిన వీడియోలో అన్నారు.

"అదృష్టవశాత్తూ నాకు మొదట్లోనే  అసాధారణమైన ఉద్యోగుల బృందాన్ని కనుగొన్నాను." అని చెప్పారు. ఫీనిక్స్ ఆధారిత సంస్థలో ఉద్యోగులకు మిల్టన్‌ ఇస్తున్న షేర్ల విలువ ప్రస్తుతం 233 మిలియన్‌ డాలర్లు. జూన్ ఆరంభంలో నికోలా నాస్డాక్‌లో రివర్స్ విలీనం ద్వారా ట్రేడింగ్ ప్రారంభించినప్పటి నుండి  షేర్‌ విలువ భారీగా పెరిగింది.

also read  ఇండియాలో ఉబర్‌ కొత్త సర్వీస్.. ఇక నచ్చినట్లు బుక్ చేసుకోవచ్చు.. ...

కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్-వాహనాన్ని ఇంకా ఉత్పత్తి చేయలేదు. మిల్టన్ హైస్కూల్ నుండి తప్పుకుని, ఆపై జనరల్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ టెస్ట్ లో ఉత్తీర్ణుడయ్యాడు, సంస్థను ప్రోత్సహించడానికి సోషల్ మీడియాను ఎంతో ఉపయోగించాడు, ప్రపంచంలోని నాల్గవ ధనవంతుడైన ఎలోన్ మస్క్ కు సమానంగా ఉన్నాడు.

బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలోని 500 మంది ధనవంతుల ర్యాంకింగ్లో 37 ఏళ్ల మిల్టన్ 4.6 బిలియన్ డాలర్లతో చోటు దక్కించుకున్నారు. ఉద్యోగులకు ఇచ్చిన షేర్ల బదిలీ పూర్తయిన తర్వాత  తనన్ ర్యాంకింగ్ పడిపోవచ్చు. తన సొంత స్టాక్‌ను విక్రయించే ఆలోచన తనకు లేదని, వాటిని ఉద్యోగులకు ఇస్తున్నానని తెలిపారు.

వారు ఉద్యోగంలో చేరే సమయంలో ఇచ్చిన హామీ మేరకు నా వ్యక్తిగత షేర్ల నుంచి 6,00,000 షేర్లను వారికి అందిస్తున్నానని వెల్లడించారు. హైడ్రోజన్ ఫ్యుయెల్ సెల్-శక్తితో పనిచేసే సెమీ ట్రక్కులను అభివృద్ధి చేస్తున్న సంస్థ మిల్టన్ అదృష్టాన్ని పెంచింది, దాని ప్రారంభ పెట్టుబడిదారులలో కొందరు ప్రయోజనాలను కూడా పొందుతున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios