న్యూఢిల్లీ: జర్మనీ విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ  మెర్సిడెస్ బెంజ్‌.. లాంగ్‌ వీల్‌ బేస్‌ (ఎల్‌డబ్ల్యూబీ) కల సరికొత్త జీఎల్‌ఈ ఎస్‌యూవీ మోడల్ కారును బుధవారం భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో ఎల్‌డబ్ల్యూబీ జీఎల్‌ఈ 300 డీ ధర రూ.73.70 లక్షలు పలుకుతోంది. ఎల్‌డబ్ల్యూబీ జీఎల్‌ఈ 400 డీ (హిప్‌-హాప్‌ వేరియంట్‌) ధర రూ.1.25 కోట్లుగా నిర్ణయించారు.

వినియోగదారుల నాడి తమకు తెలుసని, అందుకే వారి కోసం అత్యుత్తమ కార్లను అందుబాటులోకి తెస్తున్నామని మెర్సిడెస్ బెంజ్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ మార్టిన్‌ స్కూవెంక్‌ తెలిపారు. తాము విడుదల చేసిన ఈ నాలుగోతరం జీఎల్‌ఈ పొడవాటి వీల్‌బేస్ కలిగి ఉంటుందని మెర్సిడెస్ బెంజ్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ మార్టిన్‌ స్కూవెంక్‌ చెప్పారు.

also read లాంబోర్గిని కొత్త మోడల్ కారు....కేవలం 3 సెకన్లలో టాప్ స్పీడ్...

లగ్జరీ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఇది కొత్త బెంచ్‌మార్క్‌గా నిలుస్తుందన్నారు. ఇప్పటి వరకు దేశంలో 13 వేలకు పైగా జీఎల్‌ఈ కార్లను విక్రయించామని చెప్పారు. ఈ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న లగ్జరీ ఎస్‌యూవీ ఇదేనని మెర్సిడెస్ బెంజ్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ మార్టిన్‌ స్కూవెంక్‌ తెలిపారు. గత ఏడాదిలో రెండు ఎస్‌యూవీలు (జీ350డీ, జీఎల్‌సీ) విడుదల చేశామని, వచ్చే కొన్ని నెలల్లో కొత్త జీఎల్‌ఎస్‌, జీఎల్‌ఏలను తెస్తామని ఆయన చెప్పారు. 

ఈ ఏడాదిలో అమ్మకాల్లో రెండంకెల వృద్ధిని ఆశిస్తున్నామని మెర్సిడెస్ బెంజ్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ మార్టిన్‌ స్కూవెంక్‌ పేర్కొన్నారు. గత ఏడాది ద్వితీయార్ధం మార్కెట్‌ సెంటిమెంట్‌ మెరుగుపడిందని చెప్పారు.మెర్సిడెస్ బెంజ్ తన ఎంట్రీ లెవెల్‌ మోడల్‌లో 2.0 లీటర్ల 4–సిలిండర్‌ డీజిల్‌ ఇంజిన్‌ను.. హిప్‌–హాప్‌లో 3.0 లీటర్ల 6–సిలిండర్‌ డీజిల్‌ ఇంజిన్‌ అమర్చింది.

జీఎల్‌ఈ మోడల్‌ 7.2 సెకన్లలోనే 100 కిలో మీటర్ల వేగాన్ని అందుకోగలదు. గరిష్టంగా గంటకు 225 కి.మీ వేగంతో ప్రయాణిస్తుందని మెర్సిడెస్ బెంజ్ వెల్లడించింది. లగ్జరీ ఎస్‌యూవీ విభాగంలో జీఎల్‌ఈ మోడల్‌ అత్యధిక అమ్మకాలను నమోదుచే సిందని సంస్థ సీఈఓ మార్టిన్‌ స్కూవెంక్‌ అన్నారు. 

బీఎస్-6 ప్రమాణాలతో రూపుదిద్దుకున్న ఓఎం 654 4-సిలిండర్ల డీజిల్ ఇంజిన్ గల జీఎల్ఈ 300 డీ మోడల్ కారు 245 హెచ్పీ, 500 ఎన్ఎం టార్చిని విడుదల చేస్తుంది. ఓఎం 656 6-సిలిండర్ల డీజిల్ ఇంజిన్ 330 హెచ్పీ, 700 ఎన్ఎం టార్చీని విడుదల చేస్తుంది. రెండు కార్లు 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆఫర్ కలిగి ఉన్నాయి. 

also read హోండా అమేజ్‌ బిఎస్‌ 6 కార్ లాంచ్

మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ కార్లలో ఎల్ఈడీ హై పెర్పార్మెన్స్ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ రేర్ లైట్స్, పనోరమిక్ స్లైడింగ్ సన్ రూఫ్, ఇల్యూమినేటెడ్ అల్యూమినియం ఫినిష్ రన్నింగ్ బోర్డ్స్ అండ్ అండర్ గార్డ్స్ కలిగి ఉంటాయి. జీఎల్ఈ 300 డీ మోడల్ కారు 19 అంగుళాల 10 స్పోక్ లైట్ అల్లాయ్ వీల్స్, జీఎల్ఈ 400 డీ మోడల్ కారు 20 అంగుళాల 5-ట్విన్ స్పోక్ లైట్ అల్లాయ్ వీల్స్ కలిగి ఉంటాయి.

జీఎల్ఈ మోడల్ కార్లలో క్యాబిన్ మల్టీ ఫంక్షన్ స్పోర్ట్స్ స్టీరింగ్ వీల్, 4-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ రేర్ సీట్స్, వైడ్ స్క్రీన్ కాక్ పిట్ విత్ ఇన్ స్ట్రుమెంట్ డిస్ ప్లే అండ్ మీడియా డిస్ ప్లే, వైర్ లెస్ చార్జింగ్ ఫ్రంట్ అండ్ హెడ్ అప్ డిస్ ప్లే సౌకర్యం ఉంటుంది.

తాజా జీఎల్ఈ మోడల్ ఎస్ యూవీ కార్లలో ఇంటరాక్టింగ్ విత్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, టచ్ కంట్రోల్ ఆన్ ది మల్టీ మీడియా డిస్ ప్లే, మల్టీ ఫంక్షన్ టచ్ ప్యాడ్ ఆన్ ది సెంటర్ కన్సోల్, వాయిస్ కంట్రోల్ తదితర ఫీచర్లు కలిగి ఉంటుంది. యాక్టీవ్ బ్రేక్ అసిస్ట్, డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్స్ తోపాటు బ్లైండ్ స్పాట్ అసిస్ట్ ఫీచర్ అదనపు ఫీచర్లు. ఇక జీఎల్ఈ 300 డీలో ఏడు ఎయిర్ బ్యాగ్స్, జీఎల్ఈ 400 డీ మోడల్ కారులో 9 ఎయిర్ బ్యాగులు ఉంటాయి.