Asianet News TeluguAsianet News Telugu

హోండా అమేజ్‌ బిఎస్‌ 6 కార్ లాంచ్

 భారతదేశంలో హోండా కంపెనీ మొట్ట మొదటి బిఎస్‌ 6 సెడాన్  డీజిల్ కారును లాంచ్ చేసింది.అమేజ్  బి‌ఎస్ 6 మోడల్  కారు 1.2 లీటర్ పెట్రోల్ వేరియంట్ ధర రూ .6.09 లక్షల నుండి రూ .8.75 లక్షల మధ్య ఉండగా, 1.5 లీటర్ డీజిల్ వేరియంట్ ధర రూ.7.55 లక్షల నుంచి రూ.9.95 లక్షల మధ్య ఉంటుంది (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ).
 

 

honda launches new bs 6 complaint amaze car in india
Author
Hyderabad, First Published Jan 29, 2020, 5:12 PM IST

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌సిఐఎల్) ఎంట్రీ లెవల్ కాంపాక్ట్ సెడాన్ అమేజ్ కారు బిఎస్‌6  కంప్లైంట్ వెర్షన్‌ను లాంచ్ చేసింది. దీని ధర రూ.6.09 లక్షల నుంచి రూ.9.55 లక్షల (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) వరకు ఉంటుంది.అమేజ్  బి‌ఎస్ 6 మోడల్  కారు 1.2 లీటర్ పెట్రోల్ వేరియంట్ ధర రూ .6.09 లక్షల నుండి రూ .8.75 లక్షల మధ్య ఉండగా, 1.5 లీటర్ డీజిల్ వేరియంట్ ధర రూ.7.55 లక్షల నుంచి రూ.9.95 లక్షల మధ్య ఉంటుంది (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ).

also read లాంబోర్గిని కొత్త మోడల్ కారు....కేవలం 3 సెకన్లలో టాప్ స్పీడ్...

"హోండా సరికొత్త,  అధునాతన ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ టెక్నాలజిని భారతీయ మార్కెట్లోకి తీసుకురావడానికి కట్టుబడి ఉంది. మా అతిపెద్ద సేల్స్ మోడల్ హోండా అమేజ్  బిఎస్6 వెర్షన్‌ కారు ప్రవేశపెట్టాము" అని హెచ్‌సిఐఎల్ వైస్ ప్రెసిడెంట్ మరియు మార్కెటింగ్ అండ్ సేల్స్ డైరెక్టర్ రాజేష్ గోయెల్ ఒక ప్రకటనలో తెలిపారు.

honda launches new bs 6 complaint amaze car in india

ఈ సెడాన్ కారు భారతదేశంలో హోండా కంపెనీ మొదటి బిఎస్6 డీజిల్ మోడల్ కారు అవుతుంది.పెట్రోల్ వేరియంట్ మాన్యువల్  ట్రాన్స్మిషన్ కారు లీటరుకు 18.6 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది, సివిటి వేరియంట్లు లీటరుకు 18.3 కిలోమీటర్ల  మైలేజ్ ఇస్తుందని హెచ్‌సిఐఎల్ తెలిపింది.

also read మార్కెట్లోకి ఏథేర్ 450ఎక్స్ కొత్త స్కూటర్..ధర ఎంతంటే ?

మాన్యువల్ ట్రాన్స్మిషన్  డీజిల్ కారు లీటరుకు 24.7 కిలోమీటర్ల ఇంధన మైలేజ్ ఇస్తుంది, సివిటి వేరియంట్లు లీటరుకు 21 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది."ఇప్పటి నుండి, ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మేము మా  అన్నీ మోడల్ కార్లు క్రమంగా బిఎస్6కి  మారుతాయి" అని గోయల్ చెప్పారు. 

కంపెనీ ఇప్పటికే డిసెంబర్ చివరి నాటికి బిఎస్ 4 మోడళ్ల కార్లను అమ్మేసిందని. స్టాక్‌లో ఉన్న అన్నీ కార్లు ఈ నెలాఖరులోగా విక్రయిస్తామని ఆయన అన్నారు.గత ఏడాది సెప్టెంబర్‌లో బిఎస్‌4 మోడళ్ కార్ల ఉత్పత్తిని తగ్గించాలని కంపెనీ నిర్ణయించినట్లు గోయెల్ తెలిపింది.


బి‌ఎస్6 కార్ల ఉత్పత్తిని పెంచడానికి సంస్థ మరో రెండు నెలల సమయం పడుతుందని గోయెల్ చెప్పారు."వచ్చే ఆర్థిక సంవత్సరంలో, ఈ సంవత్సర అభివృద్ది పనులతో పోలిస్తే  మరింత వృద్ధి చెందడమే మా ఉద్దేశం" అని ఆయన పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios