Asianet News TeluguAsianet News Telugu

విపణిలోకి కొత్త మారుతి వ్యాగనార్.. వచ్చేనెలలో హ్యుండాయ్ న్యూ మోడల్ కారు...

దేశీయ ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తాజాగా బీఎస్-6 ప్రమాణాలతో కూడిన సీఎన్జీ వ్యాగనార్ కారును విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ.5.32 లక్షలతో మొదలవుతుంది. ఇక దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ వచ్చేనెల 17వ తేదీన నూతన తరం క్రెటా మోడల్ కారును ఆవిష్కరించనున్నది.

maruti suzuki wagonr bs6 2020 launched in india
Author
Hyderabad, First Published Feb 15, 2020, 10:38 AM IST

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఆటోమొబైల్ సంస్థలు బీఎస్-6 ప్రమాణాలతో కూడిన కార్లు, మోటారు సైకిళ్లు, స్కూటర్లను ఆవిష్కరించడంలో బిజీబిజీగా ఉన్నాయి. తాజాగా దేశీయ కార్ల ఉత్పత్తి దిగ్గజం మారుతి సుజుకీ ఇండియా.. మారుతి బీఎస్‌-6 ప్రమాణాలతో కూడిన సీఎన్జీ వేరియంట్ వ్యాగన్‌ఆర్‌ కారును విపణిలోకి ఆవిష్కరించింది. 

వాగనార్ కారు ప్రారంభ ధర రూ.5.25 లక్షలు
ఈ కారు ప్రారంభ ధర రూ.5.25 లక్షలుగా మారుతి సుజుకి నిర్ణయించింది. రానున్న కొద్ది సంవత్సరాల్లో 10 లక్షల పర్యావరణ హిత వాహనాలను విక్రయించాలన్న లక్ష్యానికి అనుగుణంగా ఈ సీఎన్‌జీ కారును తీసుకువచ్చినట్లు తెలిపింది.

also read స్కోడా మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కార్

బీఎస్-6 ప్రమాణాలతో కూడిన సీఎన్జీ కార్లలో వాగన్ఆర్ మూడోది
బీఎస్‌-6 ప్రమాణాలు కల వాహనాల్లో మూడో ఎస్‌-సీఎన్‌జీ వాహనం వ్యాగన్ ఆర్ అని పేర్కొంది. ఎల్‌ఎక్స్‌ఐ, ఎల్‌ఎక్స్‌ఐ (ఒ) వేరియంట్లలో వ్యాగన్‌ఆర్‌ అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ వేరియంట్ల ధరలు వరుసగా రూ.5.25 లక్షలు, రూ.5.32 లక్షలుగా ఉన్నాయి. 

maruti suzuki wagonr bs6 2020 launched in india

వచ్చేనెల 17న విపణిలోకి హ్యుండాయ్ క్రెటా
దక్షిణ కొరియా దిగ్గజం హ్యుండాయ్ నూతన క్రెటా మోడల్ కారును వచ్చేనెల 17వ తేదీన విపణిలో ఆవిష్కరించనున్నది. దీని ధర రూ.17 లక్షలుగా ఉంటుందని తెలిపింది. అయితే సదరు కారును హ్యుండాయ్ ఆవిష్కరించే వరకు వెర్షన్ల వారీ ధరల విషయమై వేచి చూడాల్సిందే. 

also read 6 సెకన్లలో 100 కి.మీ స్పీడ్.. బీఎండబ్ల్యూ 530ఐ స్పోర్ట్స్ స్పెషాలిటీ

ఈ కార్లతో సరిపోలనున్న హ్యుండాయ్ క్రెటా
ఈ నెల ఆరో తేదీన గ్రేటర్ నోయిడాలో జరిగిన ఆటో ఎక్స్ పోలో హ్యుండాయ్ ఈ నూతన క్రెటా కారును ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ క్రెటా కారు హ్యుండాయ్ ప్రధాన సంస్థ కియా మోటార్స్ ఆధ్వర్యంలోని సెల్టోస్, ఎంజీ మోటార్స్ వారి హెక్టార్, టాటా మోటార్స్ కు చెందిన హారియర్, జీప్ కంపాస్, మహీంద్రా ఎక్స్ యూవీ 500 మోడల్ కార్లతో సరిపోలి ఉంటుంది. 

ఇవీ హ్యుండాయ్ క్రెటా ఫీచర్లు
రెండో తరం హ్యుండాయ్ క్రెటా కారు 3డీ కాస్కేడింగ్ గ్రిల్లె, ట్రిపుల్ ఎల్ఈడీ హెడ్ లైట్స్, బూమరాంగ్ షేప్డ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్స్, ఎల్ఈడీ మౌంట్ స్టాప్ ల్యాంప్, ఫ్రంట్ అండ్ రేర్ స్కిడ్ ప్లేట్లు, రూఫ్ రెయిల్స్, సైడ్ సిల్ గార్నిష్, 17 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ కలిగి ఉన్నది.

దీనిలో 10 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, టెలిస్కోపింగ్ స్టీరింగ్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్లు, ఎయిర్ ఫ్యూరిఫయర్స్, అంబియెంట్ లైటింగ్, ఆటోమేటిక్ ఏసీ, పనోరమిక్ సన్ రూప్, బ్లూ లింక్ కనెక్టివిటీ టెక్నాలజీ తదితర ఫీచర్లు క్రెటా సొంతం కానున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios