స్కోడా ఆటోమొబైల్ తన తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని త్వరలో లాంచ్ చేయనున్నట్లు వెల్లడించింది. స్కోడా ఎస్‌యూవీ కార్లకు సాంప్రదాయకంగా క్యూ అనే అక్షరంతో ముగిసే పేర్లను కలిగి ఉంది. అదే  విధంగా కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కార్ ఎన్యాక్ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తుంది. కమిక్, కోడియాక్, కరోక్ లాగా ఈ కారు పేరును కూడా ఉంటుంది.

స్కోడా ఈ కొత్త మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారుని ఎన్యాక్ అని పేరు పెట్టింది. ఆ పేరు ఎక్కడ నుండి వచ్చిందో తెలుసుకోవాలనుకుంటున్నారా..  సంస్థ ప్రకారం ఎన్యాక్ అనే పేరు ఐరిష్ భాషలో ఉంది.

also read 6 సెకన్లలో 100 కి.మీ స్పీడ్.. బీఎండబ్ల్యూ 530ఐ స్పోర్ట్స్ స్పెషాలిటీ

స్కోడా బ్రాండ్ తన  125 సంవత్సరాల చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రభించనుంది. ఇది స్కోడా కంపెనీ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు కాగా ఇది ఎం‌ఈ‌బి ప్లాట్‌ఫామ్‌లో నిర్మించనున్నారు. ఈ మోడల్ పేర్లతో కూడిన కొత్త సిరీస్ కూడా విడుదల చేస్తుంది.

 స్కోడాలో ఇప్పటికే సిటిగో ఐవి అనే పేరు గల ఎలక్ట్రిక్ కారు కూడా ఉంది. స్కోడా ఎస్‌యూవీలు ట్రెడిషనల్ క్యూ అక్షరంతో ముగిసే పేర్లను కలిగి ఉన్నాయి. స్కోడా కమిక్, కోడియాక్, కరోక్ లాగానే కొత్త ఎన్యాక్ ఈ ట్రెడిషనల్ పేర్లను అనుసరిస్తుంది.

also read అశోక్‌ లేలాండ్‌ లాభాల్లో క్షీణత...87% తగ్గిన...

కానీ కొత్త మోడల్ కారు పేరులోని మొదటి అక్షరం ఈ అనేది ఇమొబిలిటీ యుగంలో విలీనం అవుతున్నట్లు చూపిస్తుంది.

ఎన్యాక్ అనే పేరు ఐరిష్ పేరు ఎన్య నుండి వచ్చింది, దీని అర్థం 'జీవన ఆధారం'.ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ గురించి త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.  ఎన్యాక్  కారును ఏ దేశ మార్కెట్లలో మొదటిగా లాంచ్ చేస్తారు అనే దానిపై సమాచారం లేదు.