Asianet News TeluguAsianet News Telugu

మారుతి సుజుకి నుండి లేటెస్ట్ మోడల్ స్విఫ్ట్ కార్...

మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ 2020  మోడల్ ఫేస్‌లిఫ్ట్‌లో కొత్త సింగిల్ ఫ్రేమ్ హెక్సా గోనల్ గ్రిల్‌ హారిజంటల్ స్లాట్‌లతో పాటు రీడిజైన్  చేసిన బంపర్‌తో వస్తుంది.
 

Maruti Suzuki has launched the new Dzire Facelift in India
Author
Hyderabad, First Published Mar 20, 2020, 5:20 PM IST

ప్రముఖ కార్ల తయారీ మారుతి సుజుకి భారతదేశంలో కొత్త స్విఫ్ట్ డిజైర్ ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేసింది. దీని ధర బేస్ మోడల్ ఎల్‌ఎక్స్ఐ మాన్యువల్ వేరియంట్‌కు 5.89 లక్షల నుండి ప్రారంభమవుతుంది.  ZXi + ఆటోమేటిక్ వేరియంట్ టాప్ రేంజ్  8.80 లక్షల(ఢిల్లీ ఎక్స్-షోరూమ్)   నుండి ప్రారంభమవుతుంది.  

2020  మోడల్ మారుతి సుజుకి స్విఫ్ట్  డిజైర్ ఫేస్‌లిఫ్ట్‌లో కొన్ని  మార్పులు చేసింది. ఫ్రంట్ ఎండ్‌ లిమిటెడ్ చేస్తూ, కొత్త సింగిల్ ఫ్రేమ్ హెక్సా గోనల్ గ్రిల్‌ హారిజంటల్ స్లాట్‌లతో పాటు రీడిజైన్  చేసిన బంపర్‌తో వస్తుంది.కొత్త మారుతి సుజుకి డిజైర్ ఫేస్‌లిఫ్ట్ క్యాబిన్ డిజైన్, లేఅవుట్ ఫీచర్స్ పరంగా ఎలాంటి మార్పులు ఉండవు.

also read నిస్సాన్ ఎస్‌యూవీ కార్ పై అద్భుతమైన ఆఫర్... కొద్దిరోజులు మాత్రమే...

అన్ని అప్‌డేట్ చేసిన మారుతి సుజుకి కార్ల లాగానే స్విఫ్ట్ డిజైర్ లో కూడా 7.0-అంగుళాల స్మార్ట్‌ ప్లే స్టూడియో 2.0 ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, క్లియర్ ఇంటర్‌ఫేస్‌, ఇన్-కార్ నావిగేషన్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, బ్లూటూత్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఆటో క్లైమేట్ కంట్రోల్, ఆటో హెడ్‌ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఇతర ఫీచర్స్ కూడా ఉన్నాయి.

మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ అండ్ మార్కెటింగ్ అండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ  20 లక్షల మంది వినియోగదారులకు ఇష్టపడే స్విఫ్ట్  డిజైర్ సెడాన్ కార్ ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కె-సిరీస్ ఇంజన్‌, ఫస్ట్ ఐడిల్ స్టార్ట్-స్టాప్ టెక్నాలజీ (ISS), అప్‌గ్రేడ్ చేసిన ప్రీమియం ఎక్స్‌టర్రియర్ డిజైన్, రిఫ్రెష్ ఇంటీరియర్స్,  లేటెస్ట్ ఫీచర్లను అందిస్తుంది. వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చే టెక్నాలజి  తీసుకురావాలని మేము నమ్ముతున్నాము.

also read నిస్సాన్ ఎస్‌యూవీ కార్ పై అద్భుతమైన ఆఫర్... కొద్దిరోజులు మాత్రమే...

మా కస్టమర్లకు కొత్త డిజైన్ & లేటెస్ట్  టెక్నాలజి ఉత్పత్తులను అందిస్తామని మా బ్రాండ్ నమ్మకాన్ని కొనసాగించడానికి 2020 స్విఫ్ట్ డిజైర్ మాకు సహాయపడుతుంది అని అన్నారు.

దీనిలో అప్ డేట్ చేసిన కె-సిరీస్ బిఎస్ 6 కంప్లైంట్ 1.2-లీటర్, నాలుగు సిలిండర్ల ఇంజన్, 82 బిహెచ్‌పి, 113 ఎన్ఎమ్ పీక్ టార్క్ , ఐదు-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. 2020 మారుతి సుజుకి డిజైర్ ఫేస్‌లిఫ్ట్‌ను ఎల్‌ఎక్స్‌ఐ, విఎక్సి, జెడ్‌ఎక్స్‌ఐ, జెడ్‌సి + అనే నాలుగు వేరియంట్లలో అందిస్తున్నారు. ఎల్‌ఎక్స్‌ఐ వేరియంట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే అందిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios