నష్టాలతో కుదేలైన కొరియన్ ఆటోమొబైల్ సంస్థ.. విక్రయానికి మహీంద్రా రెడీ..
గత వారం శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎం అండ్ ఎమ్ ఎండి పవన్ గోయెంకా మాట్లాడుతూ, సాంగ్‌యాంగ్ కంపెనీలో పెట్టుబడిదారుల మెజారిటీ వాటాను కొనుగోలు చేసే కొనుగోలుదారుల కోసం కంపెనీ చురుకుగా చూస్తున్నట్లు తెలిపింది.
న్యూ ఢీల్లీ: దేశీయ ఆటో రంగ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) తన దక్షిణ కొరియా అనుబంధ సంస్థ సాంగ్‌యాంగ్ మోటార్ కంపెనీ (ఎస్‌వైఎంసి) లో మెజారిటీ వాటాను విక్రయించేందుకు సన్నాహాలు చేస్తోంది. నష్టాలతో కుదేలైన దక్షిణ కొరియా అనుబంధ కంపెనీ ఇటీవలే దివాళా పిటిషన్‌తో పునరుద్ధరణకు దరఖాస్తును చేసుకుంది.
గత వారం శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎం అండ్ ఎమ్ ఎండి పవన్ గోయెంకా మాట్లాడుతూ, సాంగ్‌యాంగ్ కంపెనీలో పెట్టుబడిదారుల మెజారిటీ వాటాను కొనుగోలు చేసే కొనుగోలుదారుల కోసం కంపెనీ చురుకుగా చూస్తున్నట్లు తెలిపింది.
ఎస్‌వైఎంసీలో మెజారిటీ వాటాను విక్రయించేందుకు ఇప్పటికే కొన్ని సంస్థలతో చర్చలు చేపట్టినట్లు ఎంఅండ్‌ఎం వెల్లడించింది. వచ్చే వారంలో సాంగ్‌యాంగ్ వాటా అమ్మకంపై తప్పనిసరికాని(నాన్‌బైండింగ్) ఒప్పందాన్ని కుదుర్చుకునే వీలున్నట్లు వెల్లడించింది.
శాంగ్‌యాంగ్ మోటార్‌లో దేశీయ దిగ్గజం ఎంఅండ్‌ఎం ప్రస్తుతం 75 శాతం వాటాను కలిగి ఉంది. వాటా విక్రయ ఒప్పందం ఫిబ్రవరి చివరికల్లా పూర్తికావచ్చని అంచనా వేస్తోంది. గత నెలలో అంటే 2019 డిసెంబర్ 21న సాంగ్‌యాంగ్ మోటార్ దివాళా పిటిషన్ వేసిన విషయం విదితమే.
also read బజాజ్ ఆటో సరికొత్త రికార్డ్.. ద్విచక్ర వాహన తయారీలో మూడో అతిపెద్ద గ్లోబల్ కంపెనీగా.. ..
సాంగ్‌యాంగ్ కంపెనీలో వాటాల కొనుగోలుతో కొత్త పెట్టుబడిదారులకి మెజారిటీ వాటా ఉంటుంది. అలాగే ఎం అండ్ ఎంకి 30 శాతం లేదా అంతకంటే తక్కువ వాటా ఉంటుంది.
సాంగ్‌యాంగ్ లో కొత్త పెట్టుబడిదారులతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇంకా రెండు నెలల సమయం ఉందని గోయెంకా తెలిపారు.
గత నెలలో సాంగ్ యోంగ్ మోటార్ దివాళా పిటిషన్ కోర్టుకు దాఖలు చేసిన విషయం తెలిసిందే. 2017 నుంచి నష్టాలు నమోదు చేస్తున్న సాంగ్‌యాంగ్ మోటార్‌ను 2010లో ఎంఅండ్‌ఎం కొనుగోలు చేసింది.
ప్రస్తుతం కంపెనీ ఎస్‌యూవీ సెగ్మెంట్ పై అధిక దృష్టితో ఉందని ఎం అండ్ ఎం ఆటో అండ్ ఫార్మ్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ జెజురికర్ అన్నారు, ఈ ఏడాది అన్ని కొత్త ప్లాట్‌ఫామ్‌లపై రెండు కార్లను లాంచ్ చేయాలని కంపెనీ యోచిస్తున్నట్లు తెలిపారు.