ద్విచక్ర వాహన తయారీ సంస్థ  బజాజ్ ఆటో ప్రపంచవ్యాప్తంగా 1 ట్రిలియన్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ను దాటిన మొదటి ద్విచక్ర వాహన సంస్థగా అవతరించింది. తద్వారా ప్రపంచంలోనే లక్ష కోట్ల మార్కెట్ విలువను సాధించిన తొలి ద్విచక్ర వాహన కంపెనీగా రికార్డు సాధించింది.  

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజిలో శుక్రవారం బజాజ్ ఆటో షేర్లు 1 శాతం బలపడి రూ .3,479 వద్ద ముగిశాయి. అలాగే కంపెనీ మార్కెట్‌ విలువ రూ. 1,00,670 కోట్లను అధిగమించింది.

దీని స్టాక్ మార్చిలో 79 శాతం ర్యాలీతో ఈ సంవత్సరంలో 11 శాతం లాభపడింది. ఇది ఈ కొత్త మైలురాయిని చేరుకోవడానికి సహాయపడింది. బజాజ్ ఆటో ప్రస్తుత ఎం-క్యాప్ హీరో మోటోకార్ప్ కంటే 63 శాతం,  ఐషర్ మోటార్స్ కంటే 43 శాతం ఎక్కువ.

"మోటారు సైకిళ్లపై ప్రత్యేక దృష్టి, అంతర్జాతీయ మార్కెట్లలో విస్తరించడం వంటి అంశాలు, బజాజ్‌ను ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన ద్విచక్ర వాహన సంస్థగా మార్చింది" అని కంపెనీ ఎండి రాజీవ్ బజాజ్ ఒక ప్రకటనలో తెలిపారు.

also read వాహనదారులకు న్యూ ఇయర్ గుడ్ న్యూస్.. ఫాస్ట్‌టాగ్‌ గడువు పొడిగింపు.. ...

కొంతకాలంగా దేశీయ మార్కెట్ మందగించినప్పటికీ,  ఎగుమతులు పుంజుకోవడం ద్వారా కంపెనీ వృద్ధి బాటలో సాగినట్లు తెలియజేశారు. గత నవంబరులో 5 శాతం వృద్ధిని కంపెనీ నివేదించింది.

పల్సర్, బాక్సర్, ప్లాటినా, ఆర్‌ఇ వంటి బ్రాండ్‌లను 70కి పైగా దేశాల్లో విక్రయించిన తరువాత, బజాజ్ ఆటో ఈ ఏడాది థాయ్‌లాండ్‌లోకి ప్రవేశించాలని యోచిస్తోంది.

 ప్రస్తుతం ప్రపంచ ద్విచక్ర వాహన రంగంలో మూడో పెద్ద కంపెనీగా బజాజ్‌ ఆటో ఆవిర్భవించింది. మూడు చక్రాల వాహన తయారీలో టాప్‌ ర్యాంకులో నిలుస్తోంది.

తాజాగా చకన్‌లో నాలుగో ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇందుకు రూ. 650 కోట్లను వెచ్చించనుంది. ఈ ప్లాంటులో ప్రీమియం బైకులు, ఎలక్ట్రిక్‌ వాహనాలను రూపొందించనున్నట్లు తెలియజేసింది.