మహీంద్రా రూటులో మారుతి సుజుకి..వినియోగదారులకు బంపర్‌ ఆఫర్‌

మహీంద్రా అండ్ మహీంద్రా తరహాలోనే మారుతి సుజుకి వినియోగ దారులకు అద్భుతమైన ఆఫర్ ముందుకు తీసుకొచ్చింది. ఎంపిక చేసిన మోడల్ కార్లపై ‘బై నౌ.. పే లేటర్’ ఆఫర్ అందిస్తోంది. ఇందుకు చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్ & ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నది. 

mahindra and mahindra, Maruti Suzuki introduces Buy Now PayLater Offer

న్యూఢిల్లీ: కరోనా సంక్షోభ వేళలో దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ  మారుతి సుజుకి కూడా తన వినియోగదారులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. మహీంద్రా అండ్‌ మహీంద్రా తరహాలో 'బై నౌ- పే లేటర్ ఆఫర్' ని తీసుకు వచ్చింది.

కరోనా సంక్షోభం సమయంలో ఇబ్బందులు పడుతున్న వారు కూడా కారును సులభంగా కొనుగోలు చేసేందుకు సులభమైన ఫైనాన్సింగ్ ఆప్షన్లను అందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని తీసుకొచ్చామని మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్‌ఐ) ఒక ప్రకటనలో తెలిపింది. ఇందుకు చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఫైనాన్స్‌ కంపెనీ లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకున్నట్టు వెల్లడించింది. 

కరోనాను నియంత్రించడానికి దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ సమయంలో నగదు కొరత ఎదుర్కొంటున్న కొనుగోలుదారులే లక్ష్యంగా తీసుకొచ్చామని ఎంఎస్ఐ మార్కెటింగ్ అండ్‌ సేల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు. వెంటనే అదనపు ఒత్తిడిలేకుండా వినియోగదారులను కారు కొనుగోలు వైపు ప్రోత్సహిస్తుందన్నారు.

also read విపణిలోకి బీఎండబ్ల్యూ బైక్స్: ఆన్‌లైన్ సేల్స్‌లోకి మరికొన్ని... ...

వినియోగదారులకు ప్రయోజనాలను చేకూర్చే లక్ష్యంతోనే మారుతి సుజుకి సంస్థతో ఈ భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్ అండ్‌ ఫైనాన్స్ కో లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవీంద్ర కుండు చెప్పారు. బై నౌ, పే లేటర్‌ పేరిట ఆ ఆఫర్‌ను మారుతీ సుజుకీ ప్రవేశపెట్టిన ఈ పథకంలో వినియోగదారులు కారును కొన్న రెండు నెలల తరువాతే ఈఎంఐ కట్టడం ప్రారంభించవచ్చు.

దేశవ్యాప్తంగా 1964 నగరాలు, పట్టణాల్లో ఉన్న 3086 మారుతి సుజుకి ఔట్‌లెట్లలో ఈ ఆఫర్‌ అందుబాటులో ఉందని మారుతి తెలిపింది. కేవలం ఎంపిక చేసిన మారుతి సుజుకి కారు మోడల్స్‌పైనే ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. జూన్‌ 30వ తేదీతో ఈ ఆఫర్‌కు గడువు ముగియనుంది.

ఇంతకుముందు మహీంద్రా అండ్ మహీంద్రా మహిళలకు ప్రత్యేకించి కరోనాపై పోరాడుతున్న వైద్య సిబ్బందికి, పోలీసులకు ఫైనాన్సింగ్ వసతులు కల్పించింది. ముందుగా కొనుగోలు చేసి తర్వాత చెల్లింపులకు అనుమతినిచ్చేలా చర్యలు చేపట్టింది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios