లూసిడ్ మోటార్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న లూసిడ్ ఎయిర్ ఎలక్ట్రిక్ సెడాన్ వెర్షన్‌ను విడుదల చేసింది. ఈ కొత్త ప్యూర్-ఎలక్ట్రిక్ లగ్జరీ సెడాన్ కార్ డెలివరీలు 2021లో ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. డ్యూయల్ మోటారు, ఆల్-వీల్-డ్రైవ్ ఆర్కిటెక్చర్‌లో 1,080 వరకు హార్స్‌పవర్ దీని ప్రత్యేకత.  

లూసిడ్ మోటార్స్ ఎయిర్ సెడాన్ క్వార్టర్-మైలు 9.9 సెకన్లలో, 10 సెకన్లలోపు పావు-మైలు చేరుకోగల ఏకైక ఎలక్ట్రిక్ సెడాన్ కార్ అని సంస్థ తెలిపింది. 320 కి.మీ. కంటే అధిక వేగంతో లూసిడ్ ఎయిర్ 3 సెకన్లలోపు సున్నా నుండి 100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. మరో ప్రత్యేకత ఏంటంటే ఒకే ఛార్జీపై 832 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.

డి‌సి ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్‌కు అనుసంధానించినప్పుడు నిమిషానికి 20 మైళ్ల వేగంతో ఛార్జ్ చేయగల సామర్ధ్యంతో లూసిడ్ ఎయిర్ ఇప్పటివరకు ఉన్న వేగవంతమైన ఎలక్ట్రిక్ వాహనం అని కూడా ఈ‌వి స్టార్టప్ పేర్కొంది. ఇది కేవలం 20 నిమిషాల ఛార్జింగ్‌తో 300 మైళ్ల పరిధి వరకు ప్రయాణించొచ్చు.

లూసిడ్ ఎయిర్ సెడాన్ హెడ్‌ల్యాంప్స్‌లో మైక్రో లెన్స్ అర్రే సిస్టం “లైట్ ఛానెల్స్” కలిగి ఉంది. ఈ టెక్నాలజి ఎప్పటికప్పుడు ప్రకాశవంతమైన, అత్యంత ఖచ్చితమైన, అధునాతన లైటింగ్ సిస్టం అందిస్తుంది.  

also read మహీంద్ర కార్లపై ఫెస్టివల్ సీజన్ ఆఫర్.. ఏకంగా 3 లక్షల వరకు తగ్గింపు..

లూసిడ్ ఎయిర్ లో లగ్జరీ-క్లాస్ ఇంటీరియర్‌ను కూడా అందిస్తుంది. డ్రైవర్ ముందు 34-అంగుళాల గ్లాస్ కాక్‌పిట్ 5కె డిస్ ప్లే డాష్‌బోర్డ్, డిజిటల్ డిస్ ప్లే, స్టీరింగ్ వీల్ ఫంక్షన్ల కోసం రిబ్బెడ్ టర్బైన్లు, వాల్యూమ్ కంట్రోల్ రోలర్, క్లైమేట్ సెట్టింగులను ట్యూన్ చేయడానికి అల్లాయ్ టోగుల్ స్విచ్‌లతో సహా చాలా సున్నితమైన ఫిజికల్ టచ్  కంట్రోల్స్ ఉన్నాయి.

లేటెస్ట్ అలెక్సా  ఇంటర్నల్ వాయిస్ ఆసిస్టంట్  లూసిడ్ ఎయిర్‌లోకి తీసుకురావడానికి లూసిడ్ అమెజాన్‌తో కలిసి పనిచేసింది. నావిగేషన్, కాలింగ్, స్ట్రీమింగ్ మీడియా, స్మార్ట్ హోమ్ కంట్రోల్, షాపింగ్ కార్ట్ వంటివి ప్రయాణించేటప్పుడు అలెక్సా అనుభవాన్ని ఆస్వాదించడానికి డ్రైవర్ ఇంకా ప్రయాణీకులను సహకరిస్తుంది.

లూసిడ్‌ ఎయిర్ అని పిలువబడే వేరియంట్‌ ధర 80,000 డాలర్ల (సుమారు రూ. 59 లక్షలు) ధరతో వస్తుంది, టాప్-ఎండ్ వేరియంట్ ఎయిర్ డ్రీమ్ ఎడిషన్ 169,000 డాలర్లు (సుమారు 1.25 కోట్లు).