మహీంద్ర కార్లపై ఫెస్టివల్ సీజన్ ఆఫర్.. ఏకంగా 3 లక్షల వరకు తగ్గింపు..
దేశంలో పండుగ సీజన్ ఇప్పటికే ప్రారంభమైనట్లు కనిపిస్తుంది. కరోనా వైరస్ మహమ్మారి, లాక్ డౌన్ కారణంగా కార్ల తయారీ సంస్థలకు సేల్స్ తగ్గిపోవడంతో ఈ పండుగ సీజన్ లో సేల్స్ తిరిగి పెంచుకునేందుకు కస్టమర్లను ఆకర్షించడానికి కార్ల పై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ఇందులో భాగంగా వాహనాల తయారీ సంస్థ మహీంద్రా ఈ పండుగ సీజన్ కోసం కార్లపై అద్భుతమైన డీల్స్, ఆఫర్లను కూడా తెచ్చింది.
మహీంద్రా ఎక్స్‌యూవీ 300 నుంచి అల్టురాస్ జి4 ఎస్‌యూవీ కార్ల వరకు మొత్తం 3 లక్షల వరకు తగ్గింపు పొందవచ్చు. అంతేకాదు క్యాష్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. కార్ల తయారీ సంస్థలు ఈ ఆఫర్‌లో భాగంగా ఉచితంగా అక్సెసోరిఎస్ కూడా అందిస్తున్నాయి.
మహీంద్రా అల్టురాస్ జి4 ఎస్‌యూవీపై భారీ డిస్కౌంట్లను ప్రవేశపెట్టింది, దీని ధర పై రూ.2.4 లక్షల తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ ఆఫర్ కింద రూ.50వేల నుండి రూ. 15వేలు పొందవచ్చు. ఈ ఆఫర్ సెప్టెంబర్ 30 వరకు ఉంటుంది.
మహీంద్రా ఎక్స్‌యువి 500 కారును తగ్గింపు ధర రూ.12,760కు కొనుగోలు చేయవచ్చు. అలాగే 30వేల వరకు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్ కూడా ఇస్తున్నారు. ఈ ఆఫర్లతో పాటు, కార్ల తయారీ కంపెనీలు రూ.5వేల విలువైన అక్సెసోరిఎస్ తో పాటు రూ.9వేల వరకు కార్పొరేట్ తగ్గింపును కూడా అందిస్తున్నారు.
మహీంద్రా ఎక్స్‌యూవీ 300 కార్ల డిస్కౌంట్లలో ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ మాత్రమే ఉన్నాయి. కార్ కొనుగోలుదారులు రూ.25వేల వరకు ఎక్స్ఛేంజ్ ప్రయోజనంతో పాటు రూ.4,500 కార్పొరేట్ ఆఫర్ పొందవచ్చు.
మరాజ్జో కార్ పై కార్పొరేట్ డిస్కౌంట్ రూ.6వేలు, రూ.5వేల ఉచిత అక్సెసోరిఎస్ అందిస్తున్నారు.
మహీంద్రా స్కార్పియో పై ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.25వేలు, కార్పొరేట్ ఆఫర్ రూ.5వేలు పొందవచ్చు. అంతేకాకుండా రూ.10వేల విలువైన అక్సెసోరిస్ కూడా ఫ్రీగా ఇస్తుంది.
మరోవైపు మహీంద్రా బొలెరో పై 10వేల ఎక్స్ చేంజ్ బోనస్‌తో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి.