న్యూఢిల్లీ: జపాన్ విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ టయోటా అనుబంధ లెక్సెస్‌ భారత్‌లో ఎల్‌సీ 500హెచ్‌ మోడల్ కారును విడుదల చేసింది. ఈ కారు ధర రూ.1.96 కోట్లుగా నిర్ణయించింది. ఈ కారును తొలిసారి 2012 డెట్రాయిట్‌ మోటార్‌ షోలో ప్రదర్శించిన లెక్సెస్ 2017లో దీనిని ఉత్పత్తి దశకు చేర్చింది. 

also read ఇండియాలో లాంచ్ అయిన రేంజ్ రోవర్ కొత్త మోడల్ కార్

నాటి నుంచి మొత్తం 68 దేశాల్లో ఈ కారు ఉత్పత్తిని లెక్సెస్ ప్రారంభించింది. తాజాగా ఈ కారును విక్రయించే 69వ దేశంగా భారత్‌ నిలిచింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 12వేల కార్లను విక్రయించారు.భారత్‌లో కేవలం హైబ్రీడ్‌ ఇంజిన్‌ వేరియంట్‌ మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ కారులో 3.5లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ ఉంటుంది.

ఇది 295 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. దీంతోపాటు ఒక్కొక్కటి 177హెచ్‌పీ శక్తి ఉన్న రెండు విద్యుత్ మోటార్లు కూడా ఉంటాయి. వీటి కోసం లిథియం అయాన్‌ బ్యాటరీ ఉంటుంది.ఈ మొత్తం ఔట్‌పుట్‌ 354 బీహెచ్‌పీగా నిలుస్తుంది. కేవలం ఐదు క్షణాల్లో 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం అందుకుంటుంది. ఇంటిరీయర్‌, ఫీచర్స్‌ విషయంలో లెక్సెస్‌ ఏమాత్రం రాజీపడలేదు. ఈ కారు జాగ్వర్‌ ఎఫ్‌టైప్‌, ఆడీ ఆర్‌ఎస్‌5 కూపేలకు పోటీ ఇస్తుంది.

లెక్సెస్‌ ఇండియా భారత్‌లో మరో కారును కూడా విడుదల చేసింది. ఈఎస్‌300హెచ్‌ పేరుతో విడుదల చేసిన ఈ కారు ధర రూ.51.90 లక్షలుగా నిర్ణయించింది. తొలుత ఈ కారు ధర రూ.59 లక్షల వరకు ఉండేది. కానీ, స్థానికంగా ప్రొడక్షన్ ప్లాంట్‌ ఏర్పాటు చేయడంతో ధర తగ్గింది. 

also read అద్భుతమైన ఫీచర్లతో మెర్సిడెస్ బెంజ్‌ కొత్త ఎస్‌యూవీ కార్...

ఈ కారు ఎక్స్‌క్యూసైట్‌, లగ్జరీ వేరియంట్లలో లభిస్తుంది. లగ్జరీ వేరియంట్‌ ధర రూ.56.95 లక్షలుగా ఉంది. ఈ హైబ్రీడ్‌ కారులో 2.5లీటర్‌ 4 సిలిండర్‌ ఇంజిన్‌ను అమర్చారు. ఇది సంయుక్తంగా 215 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. 8-స్పీడ్‌ గేర్‌బాక్స్‌ను దీనికి అమర్చారు. ఈ కారు లీటర్‌ పెట్రోల్‌కు 22.37 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. దీనికి 10 ఎయిర్‌ బ్యాగ్‌లను అమర్చారు. ఎలక్ట్రిక్‌ పాసివ్‌ డ్రైవర్‌ అసిస్టెంట్‌ టెక్నాలజీ దీనిలో ఉంది.