కియా మోటర్స్.. ముందు హ్యుండాయ్.. విలవిల... ధర పెంచినా ఫుల్ డిమాండ్
యూవీవో కనెక్ట్‌తోకూడిన సేఫ్టీ ఫీచర్లతో వినియోగదారుల ముంగిట్లోకి వచ్చిన కియా మోటార్స్ సెల్టోస్ కారు వారిని కట్టి పడేస్తోంది. దాని అనుబంధ హ్యుండాయ్ మోటార్స్ క్రెట్టా మోడల్ స్టయిల్‌నే దాటేసింది. గత నెలలో 4645 కార్లు అమ్ముడు పోవడంతో తానేమిటో రుజువు చేసుకున్నది కియా సెల్టోస్ కారు.
న్యూఢిల్లీ: గత ఏడాది కాలంగా ఆటోమొబైల్ దిగ్గజాలు తమ వాహనాల విక్రయాలు రోజురోజుకు పడిపోతుండటంతో దిగాలు పడ్డాయి. ప్రతి కూల వాతావరణం నుంచి క్రమంగా ఆటోమొబైల్ రంగం కోలుకుంటున్నది. తొలుత గతేడాది అక్టోబర్ నెలలో పండుగల సీజన్ సందర్భంగా విక్రయాలు కాసింత పెరిగాయి.
also read ఆటోమొబైల్ పరిశ్రమకు బడ్జెట్‌లో ప్రోత్సాహకాలివ్వండి...కేంద్ర మంత్రికి వినతి....
తిరిగి డిసెంబర్ నెలలో దక్షిణ కొరియా ఆటో దిగ్గజం కియా మోటార్స్ తన అనుబంధ హ్యుండాయ్ మోటార్స్ సంస్థనే మించి రికార్డులు నెలకొల్పింది. హ్యుండాయ్ క్రెట్టా మోడల్ కార్లను దాటి కియా మోటార్స్ గత నెలలో 4,645 సెల్టోస్ మోడల్ కార్లను విక్రయించింది.
కియా మోటార్స్ సెల్టోస్, హ్యుండాయ్ క్రెట్టా మోడల్ కార్ల విక్రయాల పెరుగుదలతో భారతీయ కార్ల వినియోగదారులు స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్‌యూవీ) పట్ల ఆప్యాయత, అనురాగాలను పెంచుకుంటున్నారని మరోసారి రుజువైంది. గతేడాది డిసెంబర్ నెలలోనే దేశీయ విపణిలో అడుగు పెట్టిన కియా మోటార్స్ సెల్టోస్ మోడల్ కారుకు వినియోగదారుల నుంచి ఫుష్కలమైన డిమాండ్ వచ్చిందంటే అతిశయోక్తి కాదు.
తొలుత దీని ధర రూ.9.69 లక్షలుగా నిర్ణయించిన కియా మోటార్స్ ఈ నెల ప్రారంభం నుంచి రూ.20 వేలు పెంచేసింది. ఇంప్రెస్సివ్‌గా భారత విపణిలో అడుగు పెట్టిన కియా మోటార్స్ బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా తన ఉత్పత్తులను తీర్చి దిద్దుతూ ముందుకు సాగుతోంది.
యూవీవో కనెక్ట్‌తో అనుసంధానమైన ఈ కారులో సేఫ్టీ ఫీచర్లతో కూడిన టెక్నాలజీని వినియోగించారు. యూవీవోలో 37 స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. ప్రత్యేకించి ఐదు డిస్టింక్ట్ క్యాటగిరీలు.. నేవీగేషన్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, వెహికల్ మేనేజ్మెంట్, రిమోట్ కంట్రోల్ అండ్ కన్వినియెన్స్ ఫీచర్లు కలిగి ఉంది సెల్టోస్ మోడల్ కారు.
also read ఆటోమొబైల్ ఎక్స్ పోలో రిలయన్స్ జియో, ఫేస్ బుక్ సందడి....
క్రుత్రిమ మేథస్సు టెక్నాలజీతో రూపొందించిన వాయిస్ కమాండ్.. కారు దొంగిలిస్తే దాన్ని ట్రాక్ చేసేందుకు, ఆటో కొల్లీషన్ నోటిఫికేషన్, ఎమర్జెన్సీ అసిస్టెన్స్, రిమోట్ ఇంజిన్ స్టార్ట్ అండ్ స్టాప్, రిమోటెల్లీ ఆపరేటెడ్ ఎయిర్ ఫ్యూరిఫయ్యర్ అండ్ ఇన్ కారు ఎయిర్ క్వాలిటీ మానిటర్, సేఫ్టీ అలర్ట్ (జియో ఫెన్స్, టైమ్ ఫెన్స్, స్పీడ్, వాలెట్, ఐడిల్) ఉన్నాయి.
కియా మోటార్స్ టూ ట్రిమ్స్ లో లభిస్తుంది. ఆసక్తి గల వారికోసం జీటీ లైన్, కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసకుని రూపుదిద్దుకున్న టెక్ లైన్ మోడళ్లలో ఈ కారు లభిస్తుంది. బీఎస్-6 ప్రమాణాలతో మూడో తరం స్మార్ట్ స్ట్రీమ్ ఇంజిన్‌తో మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 1.5 లీటర్ల పెట్రోల్, 1.5 లీటర్ల డీజిల్, 1.4 టర్బో పెట్రోల్ వేరియంట్లలో సెల్టోస్ కారు లభిస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్‌తో 7డీసీటీ, ఐవీటీ, 6 ఏటీ అనే పేర్లతో కూడిన మూడు ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లలో లభిస్తుంది.