న్యూ ఢిల్లీ:  ఏ‌పిలో ప్రస్తుతానికి కియా మోటార్స్  ప్లాంట్ విషయం ఇష్యూ చాలా హాట్ టాపిక్ గా మారింది. కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తరలిపోతుందనే వార్త కథనాన్ని రాయిటర్స్ ప్రచురించడం వల్ల ఇప్పుడు అది చర్చనీయాంశంగా మారింది.

 కియా మోటార్స్ ఉత్పత్తి యూనిట్లో రెండు షిఫ్టులను నిర్వహిస్తున్న సంస్థ, ఈ సంవత్సరం రెండవ భాగంలో ఉత్పాదక సామర్థ్యాన్ని సంవత్సరానికి 300,000 యూనిట్లను  తయారుచేయడానికి చూస్తున్నట్లు కియా మోటార్స్ ఇండియా మార్కెటింగ్ అండ్ సేల్స్ హెడ్ మనోహర్ భట్ ఎకనామిక్ టైమ్స్ పత్రికకు చెప్పారు .

also read అదరగొడుతున్న పియాజియో రెండు కొత్త స్కూటర్లు...

కొరియా దేశానికి చెందిన కియా మోటార్స్ ఈ ఏడాది చివర్లో భారతదేశంలో కాంపాక్ట్ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాన్ని ప్రారంభించాలని చూస్తుంది. అంతకంటే ముందు ఆంధ్రప్రదేశ్ ప్లాంట్లో ఉత్పత్తి  సామర్థ్యాన్ని పెంచుకోవాలని చూస్తోంది.

ఉత్పత్తి యూనిట్లో రెండు షిఫ్టులను నిర్వహిస్తున్న సంస్థ, ఈ సంవత్సరం రెండవ భాగంలో ఉత్పాదక సామర్థ్యాన్ని సంవత్సరానికి 300,000 యూనిట్లకు పెంచడానికి మూడవ షిఫ్ట్  ప్రారంభించాలని చూస్తున్నట్లు కియా మోటార్స్ ఇండియా మార్కెటింగ్ అండ్ సేల్స్ హెడ్ మనోహర్ భట్ ఇటికి చెప్పారు.

దేశంలో వాహన తయారీ కంపెనీలు గత కొంతకాలంగా బలహీనమైన డిమాండ్‌తో పోరాడుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి తొమ్మిది నెలల్లో ప్రయాణీకుల వాహనాల ఉత్పత్తి 13.5% తగ్గి 2.58 మిలియన్ యూనిట్లకు చేరుకుంది.

also read మారుతి సుజుకి నుండి కొత్త హైబ్రిడ్ కారు లాంచ్

"రెండు షిఫ్టులతో కీయ మోటర్స్ సామర్థ్యం సంవత్సరానికి 200,000 యూనిట్లు కాగా అది నెలకు 12,000 నుండి 16,000 యూనిట్ల మధ్య ఉంది. మేము కొత్త  మోడల్‌కి తయారీ సమయంలో వాహనా యూనిట్ల సామర్థ్యం పెరుగుదలని మీరు చూడవచ్చు, అప్పుడు చెప్పినట్టుగా సంవత్సరానికి 300,000 యూనిట్ల ఉత్పత్తి స్థాయికి చేరుకుంటాము."” అని భట్ చెప్పారు. 

ఉత్పత్తిని పెంచడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు ఇప్పటికే మా దగ్గర ఉన్నాయని, మూడవ షిఫ్ట్ రన్  చేయడానికి కంపెనీ ఎక్కువ మంది సిబ్బందిని నియమించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.కియా మోటార్ షోలో క్యూవైఐ అనే కాన్సెప్ట్‌ను ప్రదర్శిస్తోంది. మారుతి సుజుకి  విటారా బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, మహీంద్రా టియువి 300 వంటి వాటితో సబ్ -4 ఎమ్ వాహనం మార్కెట్లో పోటీ పడనుంది. ఈ ఏడాది పండుగ సీజన్‌కు ముందే ఈ వాహనం లాంచ్ కానుంది అని అన్నారు.