Asianet News TeluguAsianet News Telugu

కియా మోటార్స్ నుండి మరో రెండు కొత్త మోడల్ కార్లు....

ఈ ఏడాది మరో రెండు కొత్త మోడళ్లు విపణిలోకి తీసుకురానున్నట్లు కియా మోటార్స్ తెలిపింది. ఈ ఏడాది చివరికల్లా కంపాక్ట్ ఎస్‌యూవీ మోడల్ కారును ఆవిష్కరిస్తామని పేర్కొంది. రెండేళ్లలో అనంతపూర్ ఉత్పాదక యూనిట్ పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. 

Kia Motors plans to achieve full capacity utilisation with new models
Author
Hyderabad, First Published Jan 20, 2020, 1:23 PM IST

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో ఏర్పాటు చేసిన ప్లాంట్‌ పూర్తి స్థాయి ఉత్పత్తి సామర్థ్యాన్ని 2022 మార్చి నాటికి వినియోగించుకోవాలని కియా మోటార్స్‌ లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందుకోసం ప్రణాళిక ప్రకారం కొత్త మోడళ్లను విడుదల చేయాలనుకుంటోంది. ప్రస్తుతం కియా మోటార్స్‌.. సెల్టోస్‌ మోడల్‌ను విక్రయిస్తున్న విషయం తెలిసిందే.

కియా మోటార్స్ ఈ ఏడాదిలో మరో రెండు కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకురానున్నది. ఇందులో భాగంగా త్వరలో జరిగే ఆటో ఎక్స్‌పోలో లగ్జరీ మల్టీపర్పస్‌ వెహికిల్‌ కార్నివాల్‌ను విడుదల చేయనుంది. ఆ తర్వాత ఏడాది చివరికల్లా కాంపాక్ట్‌ ఎస్‌యూవీని తీసుకురానుంది. 

also read అమ్మకాలలో హ్యుండాయ్​ మోటార్స్ టాప్...ప్యాసింజర్ కార్లు కాస్త బెటర్...

వచ్చే ఏడాదిలో కూడా రెండు కొత్త మోడళ్లను విడుదల చేయనుంది. ‘‘ప్రతి ఆరు నెలలకు ఒక కొత్త మోడల్‌ను మార్కెట్లోకి తెస్తాం. ప్లాంట్‌ స్థాపిత ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోవాలన్నదే మా మొదటి లక్ష్యం’’ అని కియా మోటార్స్‌ ఇండియా హెడ్‌ (మార్కెటింగ్‌, సేల్స్‌) మనోహర్‌ భట్‌ తెలిపారు. 

2022 లక్ష్యం చేరుకోవాలంటే నాలుగైదు మోడళ్ల అవసరం ఉంటుందని కియా మోటార్స్‌ ఇండియా హెడ్‌ (మార్కెటింగ్‌, సేల్స్‌) మనోహర్‌ భట్‌ అన్నారు. కియా ప్లాంట్‌ స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం మూడు షిఫ్ట్‌ల ప్రాతిపదికన ఏడాదికి 3 లక్షల యూనిట్లుగా ఉంది. 

Kia Motors plans to achieve full capacity utilisation with new models

ప్రస్తుతం రెండు షిఫ్ట్‌ల్లో ప్లాంట్‌ నడుస్తోంది. ఇదిలా ఉంటే.. కార్నివాల్‌తో కొత్త సెగ్మెంట్‌ను సృష్టించనున్నట్టు కంపెనీ చెబుతోంది. భారత్‌లో కంపెనీకి ఇదే ఫ్లాగ్‌షిప్‌ మోడల్‌ కానుంది. ప్రస్తుతానికి ఇలాంటి కారు దేశీయ మార్కెట్లోనే లేదని భట్‌ తెలిపారు. దేశంలోని సంపన్న కస్టమర్ల అవసరాలకు తగినట్టుగా ఇది ఉంటుందన్నారు. 

2.2 లీటర్‌ డీజిల్‌ ఇంజన్‌ కలిగిన కార్నివాల్‌ లీటరుకు 13.9 కిలో మీటర్ల మైలేజీ ఇస్తుందని తెలిపారు. బీఎస్‌-6 ప్రమాణాలకు అనుగుణంగా ఇది ఉంటుంది. కాగా 160 నగరాల్లో 265 డీలర్‌షిప్‌లను కియా మోటార్స్‌ కలిగి ఉంది. ఈ ప్రాంతాల్లో తన స్థానాన్ని బలపరచుకోవడంపై కియా మోటార్స్ దృష్టిసారిస్తోంది.

also read గిన్నిస్ వరల్డ్ రికార్డులోకి హ్యుందాయ్ కారు... 

ఇదిలా ఉంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల (ఏప్రిల్‌-డిసెంబర్) కాలంలో మన దేశం నుంచి ప్యాసింజర్‌ వాహనాల ఎగుమతులు 5.89 శాతం వృద్ధి చెంది 5,40,384 యూనిట్లకు చేరుకున్నాయి. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో ఎగుమతులు 5,10,305 యూనిట్లుగా ఉన్నాయి.

మొత్తం ఎగుమతుల్లో కార్ల ఎగుమతులు 4,04,552 యూనిట్లు, యుటిలిటీ వాహన ఎగుమతులు 1,33,511 యూనిట్లుగా ఉన్నట్టు భారత ఆటోమొబైల్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ సంఘం (సియామ్‌) వెల్లడించింది. ఇదేకాలంలో వ్యాన్ల ఎగుమతులు మాత్రం 17.4 శాతం తగ్గి 2,321 యూనిట్లకు చేరాయి. ఎగుమతుల్లో హ్యుండయ్‌ మొదటి స్థానంలో ఉండగా.. ఫోర్డ్‌ ఇండియా, మారుతీ సుజుకీ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios