విపణిలోకి జేఎల్ఆర్ రేంజ్ రోవర్ స్పోర్ట్: ధర, ఫీచర్స్ ఇవే..

ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ‘టాటా మోటార్స్’ అనుబంధ జాగ్వార్ లాండ్ రోవర్ (జేఎల్ఆర్) విపణిలోకి లేటెస్ట్ పెట్రోల్ వేరియంట్ ‘రేంజ్ రోవర్ ‘స్పోర్ట్’ కారును విపణిలోకి ఆవిష్కరించింది. దీని ధరను రూ.86.71 లక్షలుగా నిర్ణయించారు. 

JLR launches updated petrol Range Rover Sport at Rs 86.71 lakh

న్యూఢిల్లీ: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ‘టాటా మోటార్స్’ అనుబంధ జాగ్వార్ లాండ్ రోవర్ (జేఎల్ఆర్) విపణిలోకి లేటెస్ట్ పెట్రోల్ వేరియంట్ ‘రేంజ్ రోవర్ ‘స్పోర్ట్’ కారును విపణిలోకి ఆవిష్కరించింది. దీని ధరను రూ.86.71 లక్షలుగా నిర్ణయించారు. 

అత్యాధునిక జేఎల్ఆర్ ‘స్పోర్ట్’ కారు ఎస్, ఈ, ఎస్ఇ, హెచ్ఎస్ఇ ట్రిమ్‌ల్లో లభిస్తుంది.  ఇందులో ట్విన్ స్క్రోల్ టర్బో చార్జర్‌తో కలిసి 2.0 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ అనుసంధానం చేశారు. ట్విన్ స్క్రోల్ టర్బో చార్జర్‌‌కు 221 కిలోవాట్లు, 400 ఎన్ఎం పీక్ టార్చ్ సామర్థ్యం ఉంటుంది. 

జేఎల్ఆర్ ఇండియా ప్రెసిడెంట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రోహిత్ సూరి ఈ మేరకు ఒక ప్రకటన చేస్తూ.. భారతదేశంలోని లాండ్ రోవర్ పోర్ట్ పోలియోలో ఇంటిగ్రల్ డ్రైవింగ్ డిమాండ్ వల్లే రేంజ్ రోవర్ ‘స్పోర్ట్’ కారు సక్సెస్ సాధించింది. తాజాగా మార్కెట్‌లో ఆవిష్కరించిన 2.0 లీటర్ల పెట్రోల్ డెరివేటివ్ ఆకర్షణీయమైన ఎక్సైటింగ్ ధరకు ఆస్పిరేషనల్ ఫ్లాగ్ షిప్ మోడల్ కారుగా నిలుస్తుందన్నారు. 

జాగ్వార్ లాండ్ రోవర్.. ‘రేంజ్ రోవర్ స్పోర్ట్’లో వివిధ ఫీచర్లు జత చేశారు త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్, క్యాబిన్ ఎయిర్ ఐసోనేషన్ తదితర ఫీచర్లు జత కలిశాయి. భారతదేశ వ్యాప్తంగా జేఎల్ఆర్ సంస్థకు గల ఔట్ లెట్లలో ‘స్పోర్ట్’ కారు అందుబాటులో ఉంటుంది. 

అంతే కాదు రేంజ్ రోవర్ స్పోర్ట్ కారు.. తన సంప్రదాయ ప్రత్యర్థి కార్లు బీఎండబ్ల్యూ ఎక్స్5, ఆడి క్యూ7, త్వరలో అప్ డేట్ అయి మార్కెట్లోకి రానున్న మెర్సిడెజ్ బెంజ్ ‘జీఎల్ఈ’, వోల్వో ఎక్స్ సీ 90 మోడల్ కార్లకు గట్టి పోటీ ఇవ్వనున్నది. 

రేంజ్ రోవర్ స్పోర్ట్ 7.3 సెకన్లలో 100 కి.మీ స్పీడందుకోవడంతోపాటు గరిష్ఠంగా గంటకు 201 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలరు. రోవర్ వేలార్, డిస్కవరీ స్పోర్ట్ కార్లలో ఏర్పాటు చేసిన ఇంజిన్‌నే ఇందులో అమర్చారు. 

గతేడాది మార్కెట్లోకి విడుదల చేసిన మోడల్ ‘స్పోర్ట్’ కారును ఎల్ఈడీ లైటింగ్, స్లీకర్ మెష్ -టైప్ ఫ్రంట్ గ్రిల్లె, న్యూ బంపర్స్ ఫ్రంట్, రేర్ అండ్ రీఫ్రెష్డ్ ఇంటీరియర్, 10 -ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ‘టచర్ ప్రో డ్యూ’ అమర్చారు. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి రాడార్ బేస్ సేఫ్టీ, లేన్ డిపార్చర్ వార్నింగ్ అండ్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ తదితర సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios