హుండాయ్ వెన్యూ ప్రీ లాంచ్ బుకింగ్స్ ప్రారంభం

దక్షిణ కొరియా ఆటో మొబైల్ తయారీ దిగ్గజం హుండాయ్ మరో సరికొత్త కారును భారత మార్కెట్లోకి తీసుకొస్తోంది. హుండాయ్ వెన్యూను మే 21న భారత విపణిలోకి అధికారికంగా అడుగుపెట్టనుంది. 

Hyundai Venue bookings officially open

ముంబై: దక్షిణ కొరియా ఆటో మొబైల్ తయారీ దిగ్గజం హుండాయ్ మరో సరికొత్త కారును భారత మార్కెట్లోకి తీసుకొస్తోంది. హుండాయ్ వెన్యూను మే 21న భారత విపణిలోకి అధికారికంగా అడుగుపెట్టనుంది. 

ఇందుకు సంబంధించిన ప్రీలాంచ్ బుకింగ్స్‌ను కూడా ప్రారంభించింది. రూ. 21వేలు చెల్లించి హుండాయ్ కంపెనీ వెబ్‌సైట్‌లో వెన్యూ కారును బుక్ చేసుకోవచ్చు. భారత మార్కెట్లోకి ఈ కారుడు మొత్తం నాలుగు వేరియెంట్లు, ఏడు రంగుల్లో రానుంది. 

పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో కొనుగోలుదార్లకు ఈ కార్లు అందుబాటులో ఉన్నాయి. త్రీ సిలిండర్ 1.0 లీటర్ టర్బో ఛార్జ్‌డ్ ఇంజిన్ ఉంది. ఇది 118బీహెచ్‌పీ శక్తిని, 172 టార్క్‌ను విడుదల చేస్తుంది.

అంతేగాక, ఐ20లో వినియోగించే 1.2లీటర్ ఫోర్ సిలిండర్ కప్పా ఇంజిన్ 82బీహెచ్‌పీ శక్తిని, 114 ఎన్ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇక డీజిల్ వేరియంట్‌లో 1.4 లీటర్ సీఆర్‌డీఐ ఇంజిన్ 89 బీహెచ్‌పీ శక్తిని,  220 ఎన్ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. 

ఎలక్ట్రిక్ సన్ రూఫ్, క్రూయిజ్ కంట్రోల్, రియర్ ఏసీ గ్లోవ్ బాక్స్ వంటి ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి. ఇక ప్రత్యేకంగా బ్లూ లింక్ టెక్నాలజీని ఈ కారులో ఉపయోగించారు. ఈ టెక్నాలజీ వోడా‌ఫోన్ సిమ్ కార్డుతో డేటా, కనెక్టివిటీ సేవలు అందిస్తాయి. ఈ కార్ల ధరలు సుమారుగా రూ. 8-12లక్షల(ఎక్స్ షోరూం) మధ్య ఉండే అవకాశం ఉంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios