న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుండాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంటీఎల్) కంపాక్ట్ శ్రేణి మోడల్ శాంట్రో 2019 ఎడిషన్ కారును విపణిలోకి విడుదల చేసింది. బుధవారం మార్కెట్లో అడుగు పెట్టిన ఈ కారు ధర రూ.5.75 లక్షలుగా నిర్ణయించారు. అదే సమయంలో ఈ మోడల్ కారు లిమిటెడ్ ఎడిషన్ మాత్రమేనని సంస్థ తేల్చి చెప్పింది.

స్పోర్ట్స్ ఎంటీ, స్పోర్ట్స్ ఏఎంటీ అనే రెండు వేరియంట్లలో శాంట్రో కారు లభించనున్నది. స్పోర్ట్స్ ఎంటీ ధర రూ.5,16,890గా, స్పోర్ట్స్ ఎఎంటీ కారు ధర రూ.5,74,890గా నిర్ణయించారు. 

also read కిరోసిన్... ఆల్కహాల్... తో నడిచే హైబ్రిడ్ కారు

మార్కెట్లోకి విడుదల సందర్భంగా హెచ్ఎంటీఎల్ భారత్ సేల్స్ విభాగం అధిపతి వికాస్ జైన్ మాట్లాడుతూ.. ‘అధునాతన ఫీచర్లు, స్టైలిష్ డిజైన్‌తో ఈ వార్షిక ఎడిషన్ కారును మార్కెట్లోకి విడుదల చేశాం. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా దీన్ని తీర్చిదిద్దాం. ఇప్పటివరకు శాంట్రో గడించిన ఖ్యాతి, పేరు ప్రతిష్ఠలను ఈ మోడల్ కారు మరింత పెంచుతుంది’ అని తెలిపారు.

సగటు భారతీయుల అవసరాలు, ఆకాంక్షలు, అభిరుచులను ద్రుష్టిలో పెట్టుకుని తాజా శాంట్రో మోడల్ కారును రూపొందించినట్లు హ్యుండాయ్ మోటార్స్ ఓ ప్రకటనలో తెలిపింది. 2014లో గత వర్షన్ల ఉత్పత్తిని నిలిపివేసిన హ్యుండాయ్ మోటార్స్.. 2018 అక్టోబర్ నెలలో శాంట్రోను ప్రవేశపెట్టింది. గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు హ్యుండాయ్ మోటార్స్.. 75,944 యూనిట్ల శాంట్రో కార్లను విక్రయించింది.

also read బీఎస్-6....వల్లే ఆటో సేల్స్ డౌన్... కారణం ?

శాంట్రో కారు ఆక్వా టీల్, పొలార్ వైట్ రంగుల్లో లభించనున్నది. గన్ మెటల్ గ్రే వీల్ కవర్స్, బ్లాక్ ఓఆర్వీఎంస్ అండ్ డోర్ హ్యాండిల్స్, గ్లాసీ బ్లాక్ రూఫ్ రెయిల్స్, బాడీ సైడ్ మౌల్డింగ్, రేర్ క్రోమ్ గార్నిష్‌తోపాటు యానివర్సరీ ఎంబ్లం ఉంటుంది. మొత్తం బ్లాక్ కలర్ క్యాబిన్ కలిగిన న్యూ సీట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. 

1.1 లీటర్ల 4-సిలిండర్, 12-వాల్వ్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 69 పీఎస్, 99 ఎన్ఎం టార్చిని విడుదల చేస్తుంది. అలాగే 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ కలిగి ఉంటుంది.