న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుండాయ్‌.. దేశీయ మార్కెట్లోకి బీఎస్‌-6 ప్రమాణాలతో తయారైన ప్రీమియం సెడాన్‌ ఎలంట్రాను అందుబాటులోకి తీసుకు వచ్చింది.  డీజిల్‌ ఇంజిన్‌ కలిగిన ఈ కారు రెండు వేరియంట్లలో లభించనున్నది. 

వీటిలో ప్రారంభ మోడల్ కార్లయిన ఎస్ఎక్స్ (ఎంటీ) ధర రూ.18.70 లక్షలు పలుకుతుండగా, ఎస్ఎక్స్ (ఓ) ఏటీ వేరియంట్ కారు ధర రూ.20.65 లక్షలుగా ఉంది. 1.5 లీటర్ల ఇంజిన్‌ కలిగిన ఈ కారులో ఆరు స్పీడ్‌ ఆటోమేటిక్‌, మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ రకాన్ని ఎంచుకునే అవకాశం కస్టమర్లకు కల్పించింది. 

డీజిల్ వేరియంట్ ఎలంట్రా అప్ గ్రేడెడ్ మోడ్ కారులో యూ2 సీఆర్డీఐ బీఎస్-6 డీజిల్ ఇంజన్ అమర్చారు. ఇటీవల విడుదల చేసిన వెర్నా ఫేస్ లిఫ్ట్ వర్షన్ నుంచి తీసుకొచ్చారు. ఈ ఇంజిన్ 4000 ఆర్పీఎం వద్ద 113 బీహెచ్పీ శక్తి, 1500 ఆర్పీఎం వద్ద 250 ఎన్ఎం టార్చ్ విడుదల చేస్తుంది. 

also read కియా షోరూంలో తప్పిన ప్రమాదం..కొన్ని సెకండ్లలోనే కారు క్రాష్..

ఎస్ఎక్స్ ఎంటీలో 6 స్పీడ్ మాన్యూవ్ ట్రాన్సిమిషన్, ఎస్ఎక్స్ (ఓ) ఏటీలో సిక్స్ స్పీడ్ టార్చ్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ అమర్చరు. ఈ కారు మాత్రం పెట్రోల్ వేరియంట్ ను పోలి ఉంటుంది. ఫ్లూయిడిక్ 2.0 డిజైన్ లో స్వల్ప మార్పులు చేశారు. 

సరికొత్త కాస్కేడింగ్ గ్రిల్, సన్నటి గ్రిల్, ఎల్ఈడీ క్వాడ్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్, బంపర్, ట్రయాంగిల్ షేప్ లో ఫాగ్ ల్యంప్, 16 అంగుళాల అల్లాయ్ వీల్స్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్, పాకెట్ లైట్, క్యాబిన్ లో డ్యూయల్ టోన్ ఇంటీరియర్, సరికొత్త డాష్ బోర్డు తదితర మార్పులు చేశారు. 

గతేడాది అక్టోబర్ నెలలో విడుదల చేసిన హ్యుండాయ్‌ బీఎస్‌-6 పెట్రోల్‌ ఇంజిన్‌ కలిగిన ఎలంట్రా కారు రూ.17.6-19.55 లక్షలు పలుకుతోంది. పెట్రోల్ వేరియంట్ మోడళ్లలో ఎస్ఎక్స్ ఎంటీ, ఎస్ఎక్స్ ఏటీ, ఎస్ఎక్స్ (ఓ)ఏటీ రకాలు ఉన్నాయి.