కారు కొనటం మనలో చాలా మందికి చాలా ప్రత్యేకమైన క్షణం, కారు యజమానులను  వారి పాత కార్లతో పోల్చితే కొత్త వాహనాలనే మరింత జాగ్రత్తగా ఉంటారనేది వాస్తవం. డీలర్షిప్ వద్ద నుంచి ఒక సరికొత్త కారును  మీ చేతితో డెలివరీ అందుకున్న సమయంలో దురదృష్టవశాత్తు ఆ కొత్త కారుకి ఏదైనా జరిగితే  ఆ క్షణం కారు యజమానికి ఒక పీడకలగా ఎప్పటికీ మిగిలిపోతుంది. కియా కార్నివాల్ కారు ప్రస్తుతం ప్రీమియం, ప్రెస్టీజ్, లిమోసిన్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది, వీటి ధరలు వరుసగా 24.95 లక్షల ప్రారంభధరతో  రూ. 28.95 లక్షలు, రూ.33.95 లక్షలు (ఎక్స్-షోరూమ్).


తాజాగా ఇలాంటి సంఘటనే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. డీలర్షిప్ సిబ్బంది నుండి కీయ మోటార్స్ కార్నివాల్ కారుని డెలివరీ అందుకున్నకా కొన్ని సెకండ్ల వ్యవధిలోనే అది గోడకి తగిలి  క్రాష్ అయ్యింది. అయితే కారు డెలివరిని అందుకున్నాక షో రూం సిబ్బంధి ఆ కారు యజమానికి అందులోని  కంట్రోల్స్, స్విచ్ల గురించి వివరంగా తెలిపాడు. కొత్త కారు డెలివరీ అందుకునేటప్పుడు ఆ క్షణాలను ఎప్పటికీ గుర్తుండడానికి రికార్డింగ్ కూడా చేసుకుంటాం.    

also read మారుతీ ఉద్యోగులకు సోకిన కరోనా వైరస్..వారి ఆచూకీ కోసం పోలీసుల గాలింపు.. ...

అయితే, పరిస్థితి కొన్ని సెకన్లలోనే అక్కడ అందరూ షాకయ్యేలా మారిపోయింది. కార్నివాల్‌ను షోరూం నుండి బయటికి తీసే ముందు యజమాని చాలా ఉత్సాహంగా  తన పాదాన్ని యాక్సిలరేటర్‌పై పెట్టాడు. ఫలితంగా కొత్త క్లియర్ వైట్ కియా కార్నివాల్ ఒకేసారి నేరుగా వెళ్ళి ఎదురుగా ఉన్న కాంక్రీట్ గోడకు ఢీ కొట్టింది. దీంతో కారు ముందు భాగం తీవ్రంగా డ్యామేజ్ అయింది ఇందులోని ముందు వైపు ఉన్న ఎయిర్‌బ్యాగులు కూడా తేరుచుకున్నాయి.

అదృష్టవశాత్తూ  ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. కాని యజమాని తన కొత్త కారులో మొదటి డ్రైవ్ అతను ఊహించిన దానికంటే ఘోరంగా మారింది. 
కొత్త వాహనం డెలివరీ చేసేటప్పుడు ఇలాంటి  సంఘటనలు జరగకుండా  అనుభవజ్ఞులైన డ్రైవర్‌ మీతో ఉండటం చాలా మంచింది. క్రొత్త వాహనం డెలివరీ చేసేటప్పుడు మీతో పాటు అనుభవం గల డ్రైవర్‌ను తీసుకెళ్లాలని కీయ మోటర్స్ కోరుతున్నాము, తద్వారా వారు మిమ్మల్ని సురక్షితంగా ఇంటికి కూడా తీసుకు వేళతారు.