హోండా కార్స్ లో లోపాలు.. 65,651 కార్లను వెనక్కి...

ఫ్యూయల్ పంపుల్లో సాంకేతిక లోపం వల్ల 65,651 కార్లను రీ కాల్ చేస్తున్నట్లు హోండా కార్స్ వెల్లడించింది. ఈ నెల 20వ తేదీ నుంచి కస్టమర్లు డీలర్లతో అప్పాయింట్ మెంట్లు తీసుకుని వాటిని మార్చుకోవాలని సూచించింది. 
 

Honda Cars India recalls 65,651 cars due to faulty fuel pumps

న్యూఢిల్లీ: ఫ్యూయల్ పంపులో లోపాల కారణంగా 65,651 యూనిట్లను వెనక్కి తీసుకున్నట్టు హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌సీఐఎల్) తెలిపింది. వెనక్కి తీసుకున్న కార్లలో అమేజ్, సిటీ, జాజ్ వంటి మోడళ్లు ఉన్నట్టు పేర్కొంది. వెనక్కి తీసుకున్న కార్లలోని ఫ్యూయల్ పంపులను స్వచ్ఛందంగా రీప్లేస్ చేస్తామని వివరించింది.

రెండేళ్ల క్రితం 2018లో తయారైన ఈ కార్లలో ఏర్పాటు చేసిన ఇంధన పంపుల్లో ఇంపెల్లర్లు లోప భూయిష్టంగా ఉన్నాయని, ఫలితంగా కాల క్రమేణా ఇంజిన్ ఆగిపోవడమో, స్టార్ట్ కాకపోవడమో జరగవచ్చని హోండా కార్స్ కంపెనీ తెలిపింది.

హెచ్‌సీఐఎల్ వెనక్కి తీసుకున్న వాటిలో 32,498 యూనిట్ల అమేజ్, 16,434 యూనిట్ల సిటీ, 7,500 యూనిట్ల జాజ్, 7,057 యూనిట్ల డబ్ల్యూఆర్-వీ, 1,622 యూనిట్ల బీఆర్-వీ, 360 యూనిట్ల బ్రియో, 180 యూనిట్ల సీఆర్-వీ ఉన్నట్టు హోండా కార్స్ వివరించింది. ఈ నెల 20వ తేదీ నుంచి దశల వారీగా కార్ల యజమానులు కాల్ చేయొచ్చునని హోండా కార్స్ తెలిపింది. 

also read కరోనా ‘కష్ట కాలం’:బయటికి వెళ్తే ప్రజారవాణా కంటే సొంత వాహనమే బెస్ట్..

కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించడం, భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ తక్కువ మంది సిబ్బందితో కార్యకలాపాలు నిర్వహిస్తుండటంతో వినియోగ దారులు డీలర్ల వద్ద అప్పాయింట్‌మెంట్లు తీసుకున్న తర్వాత రావాలని హోండా కార్స్ పేర్కొన్నది. 

వైరస్ అటాక్ తర్వాత అమెరికా, విదేశాల్లో ఉత్పత్తి ప్రారంభించినట్లు హోండా మోటార్స్ కార్స్ శుక్రవారం తెలిపింది. నార్త్ అమెరికా ఉత్పాదక యూనిట్లలో పనులు ప్రారంభించిన నెల లోపే సైబర్ దాడి జరిగింది. మార్చి నెలాఖరులో కరోనా వైరస్ వల్ల అమెరికా, కెనడాల్లో ప్రొడక్షన్ యూనిట్లలో ఉత్పత్తి నిలిపివేశామని వెల్లడించింది.  

గురువారం రాత్రి అమెరికాలోని ఓహియోలోని మెయిన్ ప్లాంట్‌లో సీఆర్వీ ఎస్‌యూవీ క్రాస్ఓవర్, అకార్డ్ సెడాన్ ఉత్పత్తి ప్రారంభించినట్లు తెలిపింది. దీనివల్ల వినియోగదారుల వ్యక్తిగత సమాచారంపై ప్రభావితం కాలేదని వ్యాఖ్యానించింది. టర్కీ, బ్రెజిల్‌ల్లోని మోటారు సైకిళ్ల ప్లాంట్లు బ్యాకప్ తీసుకుని పని చేస్తున్నాయని తెలిపింది. ఉత్తర అమెరికాలో ఆర్థిక లావాదేవీలపై ప్రభావం ఉన్నదని హోండా కార్స్ వెల్లడించింది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios