మార్కెట్లోకి అత్యాధునిక ఫీచర్లతో సరికొత్త హోండా అమేజ్
వాహన తయారీ దిగ్గజం హోండా కార్స్ ఇండియా లిమిటెడ్(హెచ్‌సీఐఎల్) మంగళవారం తన సరికొత్త కారును మార్కెట్లోకి విడుదల చేసింది. తన వాహన శ్రేణిలోని కాంపాక్ట్ సెడాన్ అమేజ్ అప్ గ్రేడ్ చేసి మార్కెట్లో ప్రవేశపెట్టింది.
న్యూఢిల్లీ: వాహన తయారీ దిగ్గజం హోండా కార్స్ ఇండియా లిమిటెడ్(హెచ్‌సీఐఎల్) మంగళవారం తన సరికొత్త కారును మార్కెట్లోకి విడుదల చేసింది. తన వాహన శ్రేణిలోని కాంపాక్ట్ సెడాన్ అమేజ్ అప్ గ్రేడ్ చేసి మార్కెట్లో ప్రవేశపెట్టింది.
ఈ వీఎక్స్ సీవీటీ ఆటోమేటిక్ హోండా అమేజ్ పెట్రోల్, డీజిల్ వేరియెంట్లలో ఇది లభిస్తోంది. పెట్రోల్ వేరియంట్ ధర రూ. 8.56లక్షలు కాగా, డీజిల్ వేరియంట్ ధర రూ. 9.56లక్షలు(ఎక్స్ షోరూం, ఢిల్లీ)గా ఉంది.
రెండోతరం హోండా అమేజ్ సరికొత్త రికార్డు సృష్టించిందని హెచ్‌సీఐఎల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, డైరెక్టర్ సేల్స్ అండ్ మార్కెటింగ్ రాజేశ్ గోయల్ తెలిపారు. తమ వినియోగదారుల్లో 20శాతం మంది అమేజ్ సీవీటీనే వినియోగిస్తున్నారని చెప్పారు.
తాజాగా దానికి సరికొత్త హంగులు జోడించి సీవీటీని తీసుకొచ్చామని ఆయన వివరించారు. దీని ద్వారా అత్యాధుసౌకర్యాలను వినియోగదారుడికి అందించడంతోపాటు ఎంపిక అవకాశాలను మరింత పెంచామని రాజేశ్ గోయల్ వివరించారు.
హోండా అమేజ్ వీఎక్స్ సీవీటి వేరియంట్ 7అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటేన్మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లేతో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, ఆండ్రాయిడ్ ఆటో, ఇన్‌బిల్ట్ సెటిలైట్ లింక్డ్ టర్న్ బై టర్న్ నావిగేషన్, ఐఆర్ రిమోట్ కంట్రోల్, స్టీరింగ్ మౌంటెడ్ వాయిస్ కంట్రోల్ స్విచ్చెస్, గైడ్‌లైన్స్‌తో కూడిన రియర్ పార్కింగ్ కెమెరా లాంటి అదనపు ఫీచర్లతో వస్తోంది.