భారతదేశంలోకి ఫ్రెంచ్ ఆటోమోబైల్ తయారీ సంస్థ ప్రవేశించనుంది. సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీ కోసం నిరీక్షణ  ముగియనుంది. ఫ్రెంచ్ సంస్థ  ఈ కారు లాంచ్ తేదీని ఆవిష్కరించింది. సిట్రాన్ సి5 ట్రయల్ ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభమైంది.

జీప్ కంపాస్, హ్యుందాయ్ టక్సన్, స్కోడా కరోక్ వంటి వాహనాలతో ఈ కారు పోటీపడుతుంది. సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ భారతదేశంలో మొట్టమొదటి మిడ్-సైజ్ ఎస్‌యూవీ కారుగా అవుతుంది. తమిళనాడులోని తిరువల్లూరు ప్లాంట్‌లో కంపెనీ ఈ కారుని నిర్మించనుంది.

ఫ్రెంచ్ ఆటోమోబైల్ తయారీ సంస్థ సిట్రోయెన్ తాజాగా ఒక కొత్త కారు సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ కొన్ని రోజుల క్రితం టెస్టింగ్ సమయంలో కనిపించింది. సిట్రోయెన్ సి5 తో పాటు కంపెనీ భారతదేశం కోసం కొత్త ఎంపివి బెర్లింగో కోసం కూడా పనిచేస్తోంది.

సిట్రాన్ సి5 ఎయిర్‌క్రాస్ ని కంపెనీ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనుంది. అంతర్జాతీయ మార్కెట్లో లభించే సి5 ముందు భాగంలో పెద్ద గ్రిల్, సన్నని ఆకారపు స్ప్లిట్ హెడ్‌ల్యాంప్‌లతో ఎల్‌ఈడీ డే టైమ్ రన్నింగ్ లైట్లు ఉంటాయి. అలాగే  గ్రాండ్ టైల్ లైట్లతో డ్యుయల్ ఎగ్జాస్ట్ టిప్స్, బ్లాక్ బంపర్‌లు ఉన్నాయి. సిట్రోయెన్  సి5 ఎస్‌యూవీ పొడవు 4,500 ఎంఎం.  

also read కొత్త ఏడాదిలో కొత్త కారు కొనేముందు ఈ వార్త చదవండి.. భారతదేశంలోని 10 సేఫ్టీ కార్లు ఇవే.. ...

సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ క్యాబిన్ గురించి చెప్పాలంటే దీనిలో స్ప్లిట్ ఎసి వెంట్స్ అందించారు. 12.3-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 8-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, ఆపిల్ కార్ ప్లే,  ఆండ్రాయిడ్ ఆటోలకు ఈ కారు సపోర్ట్ చేస్తుంది.

ఇంకా వైర్‌లెస్ ఛార్జింగ్‌తో పనోరమిక్ సన్‌రూఫ్, హీట్ సీట్లను పొందుతుంది. భద్రత విషయంలో దీనికి ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్‌ బ్రేకింగ్ తో ఇబిడి, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు లభిస్తాయి. పెట్రోల్, డీజిల్ వేరియంట్ ఆప్షన్లతో సిట్రాన్ సి5 ఎయిర్‌క్రాస్ లాంచ్ చేయవచ్చని భావిస్తున్నారు.

ఈ 5-సీట్ల ఎస్‌యూవీలో 20 కొత్త డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లతో పాటు హైవే డ్రైవర్ అసిస్ట్, లెవల్-టూ అటానమస్ డ్రైవింగ్ సిస్టమ్, 6 అడ్వాన్స్‌డ్ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఇవి కాకుండా ఆటో హైబీమ్ ఫీచర్, అటెన్షన్ అసిస్ట్, క్రాస్ ట్రాఫిక్ డిటెక్షన్, బ్లైండ్ స్పాట్ అసిస్ట్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి అనేక భద్రతా ఫీచర్లు కూడా స్మార్ట్ హెడ్‌ల్యాంప్స్‌తో అందించారు.

సిట్రాన్  సి5 ఎయిర్‌క్రాస్ 6-స్పీడ్ మాన్యువల్‌తో పాటు 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్ యూనిట్  ఆప్షన్ కూడా కంపెనీ అందిస్తుంది. విదేశాలలో విక్రయించే సిట్రాన్ సి5 ఎయిర్‌క్రాస్ నాలుగు ఇంజన్ ఆప్షన్లతో వస్తుంది.

1.5 లీటర్, 2.0 లీటర్ డీజిల్ ఇంజన్, 1.2 లీటర్, 1.6 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో కూడా భారత్‌లో లాంచ్ చేయవచ్చని భావిస్తున్నారు. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ .22 లక్షల నుంచి రూ .27 లక్షల మధ్య ఉంటుందని అంచనా.