కొత్త ఏడాదిలో కొత్త కారు కొనేముందు ఈ వార్త చదవండి.. భారతదేశంలోని 10 సేఫ్టీ కార్లు ఇవే..
న్యూ ఇయర్ సందర్భంగా మీరు కొత్త కారు కొనాలని చూస్తున్నారా.. అయితే మీ ఏ కారు ఎంత సురక్షితమైనదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ప్రపంచవ్యాప్తంగా కార్ సేఫ్టీ క్రాష్ టెస్ట్ కు ప్రసిద్ధి చెందిన గ్లోబల్ ఎన్‌సిఎపి దేశంలోని పలు కార్లపై క్రాష్ టెస్టులు నిర్వహించి దాని ఫలితాలను విడుదల చేసింది.
దేశంలోని అతిపెద్ద ఆటోమొబైల్ తయారీ సంస్థ మారుతి సుజుకి నుండి ఎస్-ప్రీసో జీరో సేఫ్టీ రేటింగ్ పొందిన తరువాత కార్ల భద్రత గురించి చాలా చర్చలు వెలుగులోకి వచ్చాయి. ఇది మాత్రమే కాదు టాటా మోటార్స్ చెందిన కార్లు భద్రత విషయంలో ఉన్నతమైనవి అవతరించాయి.
న్యూ ఇయర్ సందర్భంగా మీరు కొత్త కారు కొనాలని చూస్తున్నారా.. అయితే మీ ఏ కారు ఎంత సురక్షితమైనదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ప్రపంచవ్యాప్తంగా కార్ సేఫ్టీ క్రాష్ టెస్ట్ కు ప్రసిద్ధి చెందిన గ్లోబల్ ఎన్‌సిఎపి దేశంలోని పలు కార్లపై క్రాష్ టెస్టులు నిర్వహించి దాని ఫలితాలను విడుదల చేసింది.
భారతదేశంలో కొత్త కారును కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు సాధారణంగా కారు మైలేజ్, లుక్, ధరపై పూర్తి శ్రద్ధ చూపుతారు. కానీ మీరు మీ కుటుంబ భద్రతకు మీరు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారనే ప్రశ్న చాలా ముఖ్యమైనది. 2020 సంవత్సరంలో 10 సురక్షితమైన కార్లు ఏవో ఒక్కసారి చూద్దాం..
టాటా ఆల్ట్రోజ్ : గ్లోబల్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రాం (జిఎన్‌సిఎపి) క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ రేట్ పొందిన మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా చిన్న కారు టాటా ఆల్ట్రోజ్. టాటా అల్ట్రోజ్ ప్రయాణీకుల రక్షణలో 17 పాయింట్లలో 16.13 పాయింట్లను అందుకుంది. పిల్లల రక్షణలో టాటా ఆల్ట్రోజ్ 49లో 29 పాయింట్లు సాధించింది.
టాటా నెక్సాన్ : టాటా నెక్సాన్ మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా కాంపాక్ట్ ఎస్‌యూవీ (ఎస్‌యూవీ) కారు, దీనిని జిఎన్‌సిఎపి 5 స్టార్ రేట్ చేసింది. టాటా నెక్సాన్ భద్రత కోసం 17 పాయింట్లలో 16.06 పొందింది. ఈ కారులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు ఇచ్చారు.
also read వాహనదారులకు న్యూ ఇయర్ గుడ్ న్యూస్.. ఫాస్ట్‌టాగ్ గడువు పొడిగింపు.. ...
మహీంద్రా ఎక్స్‌యూవీ 300: గ్లోబల్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్‌లో మహీంద్రా ఎక్స్‌యువి 300 కాంపాక్ట్ ఎస్‌యూవీ 5 స్టార్ రేటింగ్‌ను పొందింది. మహీంద్రా ఎక్స్‌యువి 300 ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 5-స్టార్ రేటింగ్, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ విభాగంలో 4-స్టార్ రేటింగ్‌ను పొందింది. మహైంద్రా ఎక్స్‌యువి 300 భద్రతలో 17పాయింట్లలో 16.42 వచ్చింది. టాటా నెక్సాన్ తర్వాత ఈ రేటింగ్ పొందిన దేశంలో రెండవ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఇది.
మారుతి సుజుకి విటారా బ్రెజ్జా : మారుతి సుజుకి విటారా బ్రెజ్జా దేశంలో అతిపెద్ద ఆటోమొబైల్ తయారీ సంస్థ యొక్క సురక్షితమైన కారు. అంతేకాదు మారుతి యొక్క అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో విటారా బ్రెజ్జా కూడా ఒకటి. ఈ కారు క్రాష్ టెస్ట్ లో 4 స్టార్ రేటింగ్‌ను పొందింది. భద్రతలో ఈ కారు 17 పాయింట్లలో 12.51 పాయింట్లను పొందింది. ఈ కారు అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 4-స్టార్ రేటింగ్, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ విభాగంలో 2-స్టార్ రేటింగ్‌ను పొందింది.
మహీంద్రా మరాజో: ఎంపివి విభాగంలో మహీంద్రా మరాజో దేశం యొక్క సురక్షితమైన ఎంపివి. అలాగే భారతదేశంలో తయారైన మొట్టమొదటి ఎంపివి (మల్టీ పర్పస్ వెహికల్) ఇది. గ్లోబల్ ఎన్‌సిఎపిలో మహీంద్రా మరాజో 4-స్టార్ రేటింగ్‌ను పొందింది. రక్షణలో దీనికి 4 స్టార్స్ వచ్చాయి. పిల్లల రక్షణలో 2 స్టార్ రేటింగ్‌ను పొందింది. మొత్తం 17 పాయింట్లలో 12.85 స్కోరు చేసింది. పిల్లల రక్షణలో 49 పాయింట్లలో 22.22 స్కోరు చేసింది.
టాటా టియాగో అండ్ టైగర్ ఫేస్‌లిఫ్ట్ : టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్‌కు గ్లోబల్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్ లో ఆక్యుపెన్సీకి 4 స్టార్లు, చైల్డ్ ఆక్యుపెన్సీకి 3 స్టార్లు లభించాయి. అడల్ట్ ఆక్యుపెన్సీ లో ఈ కారు 17లో 12.52 స్కోరు చేసింది. పిల్లల ఆక్యుపెన్సీకి 49లో 34.15 పాయింట్లు వచ్చాయి.
ఇక గ్లోబల్ ఎన్‌సిఎపి క్రాష్ పరీక్షలో టాటా టైగర్ ఫేస్‌లిఫ్ట్‌కు అడల్ట్ ఆక్యుపెన్సీకి 4 స్టార్లు, చైల్డ్ ఆక్యుపెన్సీకి 3 స్టార్లు లభించాయి. అడల్ట్ ఆక్యుపెన్సీ కోసం ఈ కారు 17లో 12.52 స్కోరు చేసింది. పిల్లల ఆక్యుపెన్సీకి 49లో 34.15 పాయింట్లు పొందింది.
వోక్స్వ్యాగన్ పోలో: వోక్స్వ్యాగన్ పోలో గ్లోబల్ ఎన్‌సిఎపి 4 స్టార్ రేట్ చేసింది. ఇది అడల్ట్ రక్షణ కోసం 4 స్టార్లు పొందగా, పిల్లల రక్షణ కోసం 3 స్టార్ల రేటింగ్‌ను పొందింది. ఇది అడల్ట్ రక్షణ కోసం 17లో 12.54, పిల్లల రక్షణ కోసం 49లో 29.91 అందుకుంది.
మహీంద్రా థార్ 2020 : మహీంద్రా అత్యంత ప్రజాదరణ పొందిన కొత్త మహీంద్రా థార్ 2020 గ్లోబల్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్‌లో అద్భుతమైన రేటింగ్స్ పొందింది. కొత్త మహీంద్రా థార్ 4 స్టార్ రేటింగ్ లభించింది. గ్లోబల్ ఎన్‌సిఎపి ప్రకారం, కొత్త థార్ డ్రైవర్, ప్రయాణీకుల తల, మెడకు మంచి రక్షణను అందిస్తుంది. డ్రైవర్ ఛాతీ, ప్రయాణీకుల చూపుకి తగిన రక్షణ లభించింది.
మహీంద్రా స్కార్పియో: గ్లోబల్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్ లో మహీంద్రా స్కార్పియోకి 4 స్టార్ రేటింగ్ లభించింది.