Asianet News TeluguAsianet News Telugu

కార్ లవర్స్ కోసం ఫోర్డ్ ఫ్రీస్టయిల్ ఫ్లెయిర్ కొత్త ఎడిషన్.. ధర ఎంతంటే ?

కొత్త ఫ్లెయిర్ ఎడిషన్ టాప్-స్పెసిఫికేషన్లతో అందిస్తున్నారు. స్పోర్టి  రెడ్, బ్లాక్ థీమ్‌ కలర్లతో కొత్త స్టైలింగ్ లో వస్తుంది. కొత్త మోడల్ పెట్రోల్, డీజిల్ ఆప్షన్ రెండింటిలోనూ అందుబాటులోకి వస్తుంది, వీటి ధర రూ.7.69 లక్షలు నుండి ప్రారంభమవుతుంది (ఎక్స్-షోరూమ్, ఢీల్లీ). 

Ford Freestyle Flair Edition Launched In India for festival season
Author
Hyderabad, First Published Aug 12, 2020, 7:38 PM IST

కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ ఇండియా ఈ పండుగ సీజన్ కోసం కొత్త స్పెషల్ ఎడిషన్ ఫోర్డ్  ఫ్రీస్టయిల్ ఫ్లెయిర్ కారును విడుదల చేసింది. కొత్త మోడల్ పెట్రోల్, డీజిల్ ఆప్షన్ రెండింటిలోనూ అందుబాటులోకి వస్తుంది, వీటి ధర రూ.7.69 లక్షలు నుండి ప్రారంభమవుతుంది (ఎక్స్-షోరూమ్, ఢీల్లీ). కొత్త ఫ్లెయిర్ ఎడిషన్ టాప్-స్పెసిఫికేషన్లతో అందిస్తున్నారు. స్పోర్టి  రెడ్, బ్లాక్ థీమ్‌ కలర్లతో కొత్త స్టైలింగ్ లో వస్తుంది.

కొత్త కారు గురించి ఫోర్డ్ ఇండియాలో మార్కెటింగ్, సేల్స్ & సర్వీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్ రైనా మాట్లాడుతూ, "ఫోర్డ్ ఫ్రీస్టయిల్ ఒక బెంచ్మార్క్ కాంపాక్ట్ యుటిలిటీ వాహనంగా నిలుస్తుంది, దీని డిజైన్, అత్యుత్తమమైన డ్రైవింగ్ కి ధన్యవాదాలు" అని అన్నారు.

కొత్త ఫ్రీస్టయిల్ ఫ్లెయిర్ చూడటానికి  ఆల్-బ్లాక్ గ్రిల్‌తో పాటు బ్లాక్ అండర్బాడీ క్లాడింగ్, ఫాక్స్ రెడ్ స్కిడ్ ప్లేట్‌లతో వస్తుంది. కారు వీల్స్, డోర్స్ గ్రాఫిక్ డిజైన్ కూడా ఉంది.

మరోవైపు క్యాబిన్ లో ఆల్-బ్లాక్ ఇంటీరియర్, రెడ్ కలర్ పొందింది.  బ్లాక్, బూడిద రంగులో సీటు కవర్లతో పాటు ఎరుపు రంగులో 'ఫ్లెయిర్' బ్యాడ్జింగ్ ఉంటుంది. ఫోర్డ్ ఫ్రీస్టైల్ ఫ్లెయిర్ వైట్ గోల్డ్, డైమండ్ వైట్, స్మోక్ గ్రే అనే మూడు రంగులలో లభిస్తుంది.

also read మహీంద్రా వాహనాల ఉత్పత్తి డౌన్.. 36 శాతం తగ్గిన సేల్స్.. ...

కొత్త ఫ్రీస్టైల్ ఫ్లెయిర్ ఫోర్డ్‌పాస్ సిస్టమ్‌తో వస్తుంది, ఇది ఫ్యాక్టరీతో అమర్చిన క్లౌడ్-కనెక్ట్ డివైజ్ తో ఇంధన లెవెల్, ప్రయాణించే దూరం, అన్నీ రియల్ టైమ్ ఫోర్డ్‌పాస్ స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా అందిస్తుంది.

ఇది మొదట ఎండీవర్‌ కార్లలో  పరిచయం చేసింది. ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోలతో పాటు ఫోర్డ్ సింక్ 3తో ​​టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇందులో ఉంది.

కారు ఇతర ఫీచర్లలో బ్యాక్ పార్కింగ్ కెమెరా, కీలెస్ ఎంట్రీ, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, ఆటోమేటిక్ వైపర్స్, రివర్స్ పార్కింగ్ కెమెరా, రిమోట్ సెంట్రల్ లాకింగ్, ఆటోమేటిక్ ఎయిర్ కండీషనర్, మొత్తం 4 పవర్ విండోస్ ఇంకా మరిన్నో ఫీచర్స్ ఉన్నాయి.

 మూడు-సిలిండర్ల 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో 95 బిహెచ్‌పి, 120 ఎన్ఎమ్ పీక్ టార్క్ అందిస్తుంది, దీనితో పాటు 99 బిహెచ్‌పి, 215 ఎన్ఎమ్ టార్క్ గల  1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో కూడా అందుబాటులో ఉంది. 

పెట్రోల్, డీజిల్  రెండు ఇంజన్లు బిఎస్ 6 కంప్లైంట్, ఐదు-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ స్టాండర్డ్ గా అందిస్తుంది. అలాగే, ఫిబ్రవరి 2021కి ముందు ఫోర్డ్ ఫ్రీస్టయిల్  ఏదైనా వేరియంట్‌ను బుక్ చేసే వినియోగదారులందరికీ జియోసావన్  ఒక సంవత్సరం ప్రీమియం సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios