మహీంద్రా అండ్ మహీంద్రా 2020 జూలైలో ప్యాసింజర్ వెహికల్ విభాగంలో ఉత్పత్తి 10,678 యూనిట్లతో 39.96 శాతం క్షీణించింది. గత ఏడాది ఇదే నెలలో 17,785 యూనిట్లు ఉత్పత్తి చేసింది.

బొలెరో పవర్ ప్లస్ (సబ్ ఫోర్ మీటర్ బొలెరో) గత ఏడాది 3775 యూనిట్లతో పోలిస్తే ప్రస్తుతం 3079 యూనిట్ల ఉత్పత్తి చేసింది, అంటే 18.43% శాతం క్షీణించింది. అదే నెలలో థార్, టియువి 300, టియువి 300 ప్లస్, బొలెరో ప్లస్, మహీంద్రా అల్టురాస్ జి4 ఒక్క యూనిట్‌ను కూడా కంపెనీ తయారు చేయలేదు. ఇతర మోడళ్ల ఉత్పత్తి కూడా గత నెలలో తగ్గిపోయింది.

మహీంద్రా కెయువి 100 273 యూనిట్లను తయారు చేసింది, గత ఏడాది ఇదే నెలలో 752 యూనిట్లు తయారు చేసింది సుమారు 63.69 శాతం క్షీణించింది. గత ఏడాది ఇదే నెలలో ఎక్స్‌యూవీ 300 5410 యూనిట్లతో పోలిస్తే ఇప్పుడు 2461 యూనిట్లతో  54.51 శాతం క్షీణించింది.

also read ఆటోమొబైల్ సేల్స్‌లో భారీ రికవరీ.. జులైలో 30% పెరిగిన వాహన విక్రయాలు.. ...

స్కార్పియో వాహనాల తయారీ కూడా 3019 యూనిట్లతో 2.19 శాతం స్వల్పంగా తగ్గింది, గత ఏడాది ఇదే నెలలో 3102 యూనిట్లను ఉత్పత్తి చేసింది. ఎక్స్‌యూ‌వి 500 కూడా 669 యూనిట్ల ఉత్పత్తిలో 44.15 శాతం క్షీణించింది, ఏడాది క్రితం ఇదే నెలలో  1198 యూనిట్లను తయారు చేసింది.

ఏదేమైనా గ్రామీణ మార్కెట్లలో డిమాండ్ ఉన్న బొలెరో వాహనాల ఉత్పత్తిని మహీంద్రా సంస్థ వేగవంతం చేసింది. మహీంద్రా గత నెలలో 1126 యూనిట్ల బొలెరోను తయారు చేసింది, గత ఏడాది ఇదే నెలలో కేవలం 6 యూనిట్లను మాత్రమే తయారు చేసింది.

సేల్స్  విషయానికొస్తే 2020 జూలైలో మహీంద్రా 25,678 యూనిట్లను విక్రయించింది, గత ఏడాది ఇదే నెలలో 40,142 యూనిట్లు విక్రయించగా, ఈ సంవత్సరంలో 36 శాతం క్షీణించాయి.