ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ (ఎఫ్‌సిఎ) కొత్త జెనరేషన్ జీప్ రాంగ్లర్‌ను ఇండియాలో విడుదల చేసింది. దీని ధర 63.94 లక్షల రూపాయలు. 5 డోర్లు, ఫోర్-వీల్ డ్రైవ్ వాహనం భారతదేశంలోని పది జీప్ డెస్టినేషన్ స్టోర్లలో విక్రయించుతున్నట్లు   ఎఫ్‌సి‌ఏ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.

also read ఇండియాలో వోక్స్ వేగన్ కొత్త ఎస్‌యూ‌వి కార్ లాంచ్... ధర ఎంతంటే ?

ఫియట్ క్రిస్లర్ కొత్త జీప్ రాంగ్లర్‌ గురించి ఎఫ్‌సిఎ ఇండియా ప్రెసిడెంట్ మేనేజింగ్ డైరెక్టర్ కెవిన్ ఫ్లిన్ మాట్లాడుతూ "మా పోర్ట్‌ఫోలియోలో ఐకానిక్ రాంగ్లర్  ఒక అద్భుతమైన వాహనం అని అన్నారు. కొత్త జెనరేషన్ జీప్ రాంగ్లర్ ఇంతకు ముందు వెర్షన్ లో అందించే 3.4-లీటర్ వి-6 ఇంజిన్‌కు బదులుగా 4-సిలిండర్, 2-లీటర్ టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌ ఇందులో అమర్చారు.

అంతేకాకుండా కొత్త వెర్షన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. పాత మోడల్ రాంగ్లర్‌లో ఉన్న 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ స్థానంలో దీనిని అమర్చినట్లు సంస్థ తెలిపింది. ఇది ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో  బిల్ట్ ఇన్, పించ్ నుండి జూమ్ నావిగేషన్ ఫీచర్‌తో 8.4-అంగుళాల టచ్‌స్క్రీన్‌ను దీనిలో ఉంది.

also read ‘ఎక్స్1’ పేరుతో విపణిలోకి బీఎండబ్ల్యూ కొత్త కారు.. ధరెంతంటే?

ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, బ్రేక్ అసిస్ట్, ఆల్-స్పీడ్ ట్రాక్షన్ కంట్రోల్, అడ్వాన్స్‌డ్ మల్టీ-స్టేజ్ ఎయిర్‌బ్యాగ్స్, సప్లిమెంటరీ ఫ్రంట్ సీట్ మౌంటెడ్ సైడ్ ఎయిర్‌బ్యాగ్స్ వంటి భద్రతా లక్షణాలతో కొత్త జీప్ రాంగ్లర్ వస్తుంది.