జర్మనీకి లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్‌ బెంజ్‌ ఇండియన్ మార్కెట్లో తొలి ఎలక్ట్రిక్‌ కారును ప్రవేశపెట్టింది. ఈ కారు మొదటి దశలో ఢీల్లీ, బెంగళూరు, ముంబై, పూణే, చెన్నై హైదరాబాద్ నగరాల్లో లభిస్తుంది. ఈ‌క్యూ‌సి అనేది మెర్సిడెస్ బెంజ్ కొత్త మోడల్.

దేశంలోని లగ్జరీ కార్ ల్యాండ్‌స్కేప్‌లో మొదటి ఎలక్ట్రిక్ వాహనంగా నిలిచింది.బ్యాటరీ ప్యాక్‌పై ఎనిమిది సంవత్సరాల వారంటీతో వస్తుంది. "ఇది ఒక ప్రారంభం మాత్రమే, లగ్జరీ ఎలక్ట్రిక్ వాహనాల కోసం భారత మార్కెట్ సిద్ధంగా ఉందని మేము భావిస్తున్నాము" అని మెర్సిడెస్ బెంజ్ ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ సంతోష్ అయ్యర్ అన్నారు.

ఎస్‌యూ‌విలాగా కాకుండా ఈ‌క్యూ‌సి ఫ్లోర్-మౌంటెడ్ 80kWH లిథియం-అయాన్ బ్యాటరీ ఉంది, 408 hp శక్తిని, 765 Nm టార్క్ను ఉత్పత్తి చేయగలదు. ఈ గ్రీనర్ పవర్‌ట్రెయిన్ ఎస్‌యూవీ 0-100 కి.మీ స్పీడ్ కేవలం 5.1 సెకన్లలో అందుకుంటుంది.

also read లేటెస్ట్ బ్లూటూత్‌ కనెక్టివిటీ ఫీచర్‌తో సుజుకీ కొత్త స్కూటర్లు.. ...

దీని టాప్ స్పీడ్  వచ్చేసి గంటకు 180 కి.మీ.  కారు సింగిల్‌ చార్జ్‌తో 445-471 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. మెర్సిడెస్ బెంజ్ ప్రకారం సాధారణ ఛార్జర్ యూనిట్‌ను ఉపయోగించి సుమారు 10 గంటల్లో ఈ కారుని పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు, డి‌సి ఫాస్ట్ ఛార్జర్ తో ఛార్జింగ్ చేస్తే  ఛార్జింగ్ సమయాన్ని 90 నిమిషాలకు తగ్గిస్తుంది.

విలాసవంతమైన డ్రైవింగ్ అనుభవానికి పేరుగాంచిన మెర్సిడెస్ బెంజ్ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా లగ్జరీ కార్ల విభాగంలో ప్రాముఖ్యత ఉంది. ఈ కారులో 12.3-అంగుళాల డ్యూయల్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, లేటెస్ట్ జనరేషన్ MBUX సిస్టమ్ ఉన్నాయి.

కేవలం తొలి 50 కార్ల ధర మాత్రం రూ.99.30 లక్షలుగా నిర్ణయించిన సంస్థ ఆ తర్వాత విక్రయించే కార్ల ధర మాత్రం అధికంగా ఉంటుందని తెలిపింది.