లేటెస్ట్ బ్లూటూత్‌ కనెక్టివిటీ ఫీచర్‌తో సుజుకీ కొత్త స్కూటర్లు..

సుజుకి యాక్సెస్ 125, బర్గ్‌మన్ స్ట్రీట్ 125 స్కూటర్లను ఫెస్టివల్ సీజన్ కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రెండు స్కూటర్లలో కొత్త టెక్నాలజి ప్రవేశపెట్టినట్లు తెలిపింది. కొత్త టెక్నాలజి ఏంటంటే రెండు స్కూటర్లలో ఇప్పుడు మీ ఫోన్‌ బ్లూటూత్ ద్వారా కనెక్టివిటీ చేసుకోవచ్చు.  

Suzuki India Launches access 125, burgman sreet 125 with New Bluetooth Connected Scooter Display-sak

సుజుకి బ్రాండ్ ఇండియాలో రెండు కొత్త సుజుకి మోడళ్లను లాంచ్ చేసింది. సుజుకి యాక్సెస్ 125, బర్గ్‌మన్ స్ట్రీట్ 125 స్కూటర్లను ఫెస్టివల్ సీజన్ కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రెండు స్కూటర్లలో కొత్త టెక్నాలజి ప్రవేశపెట్టినట్లు తెలిపింది. కొత్త టెక్నాలజి ఏంటంటే రెండు స్కూటర్లలో ఇప్పుడు మీ ఫోన్‌ బ్లూటూత్ ద్వారా కనెక్టివిటీ చేసుకోవచ్చు.  

ఈ కొత్త ఫీచర్ పూర్తి ప్రయోజనాన్ని పొందడానికి మీరు సుజుకి రైడ్ కనెక్ట్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ అండ్రాయిడ్ ఫోన్‌ల కోసం మాత్రమే అందుబాటులో ఉంది. ఈ స్కూటర్లకు కొత్త డిస్ ప్లే టర్న్-బై-టర్న్ నావిగేషన్‌, అలాగే రియల్ టైమ్‌లో పనిచేసే డిస్టన్స్ కాలిక్యులేటర్ అంచనా సమయాన్ని అందిస్తుంది.

నావిగేషన్‌తో పాటు, మీరు స్కూటర్ పై ప్రయాణించేటప్పుడు మీకు స్మార్ట్ ఫోన్ సమాచారం తెలియజేయడానికి మీ ఫోన్ నుండి ఇన్-డాష్ డిస్ప్లేకి పలు రకాల ఇండికేషన్స్  పంపగలదు.

also read   మొట్టమొదటి అటానమస్ ప్రీమియం ఎస్‌యూవీ ఎం‌జి గ్లోస్టర్ లాంచ్.. ...

కాలర్ ఐడి, మిస్డ్ కాల్స్, ఇన్‌కమింగ్, ఎస్‌ఎంఎస్, వాట్సాప్ మెసేజెస్ వంటివి మీ ఇన్-డాష్ డిస్ప్లేలో చూపిస్తుంది, అందువల్ల మీరు ఏవైనా ముఖ్యమైన కాల్స్, మెసేజెస్ చూసుకోవడానికి సహాయపడుతుంది. మీ ఫోన్ బ్యాటరీ ఛార్జ్ స్టేటస్ కూడా చూపిస్తుంది.

మీరు మీ స్కూటర్ ని ఎక్కడ పార్క్ చేశారో గుర్తుంచుకోవడంలో ఇబ్బంది ఉందా? సుజుకి రైడ్ కనెక్ట్ యాప్ ఇందుకు సహాయపడుతుంది. “లాస్ట్ పార్క్డ్ లొకేషన్” అని పిలువబడే కొత్త ఫీచర్ ఇందులో ఉంది. మీ ఫోన్‌లో యాప్ తెరిచి, మీకు ఎక్కడ పార్క్ చేశారో గుర్తులేనప్పుడు మీ స్కూటర్ ను కనుగొనడంలో సహాయపడటానికి దాన్ని ఉపయోగించవచ్చు.  

సుజుకి యాక్సెస్ 125, బర్గ్‌మన్ స్ట్రీట్ 125 కు కొత్త ఎల్‌ఇడి పొజిషన్ లైట్లు, అలాగే రెండు కొత్త కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. బర్గ్‌మన్ స్ట్రీట్ 125 ధర రూ.84,600 (సుమారు $ 1,154). యాక్సెస్ 125 మీ డిస్క్ లేదా డ్రమ్ బ్రేక్‌లతో లభిస్తుంది.

అలాగే ధర కూడా డిస్క్ లేదా డ్రమ్ బ్రేక్‌ల రెండు ఆప్షన్స్ మధ్య మారుతూ ఉంటుంది. డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 78,600 (సుమారు $ 1,073), డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 77,700 ($ 1,060). సుజుకి అందించిన అన్ని లిస్టెడ్ ధరలు ఎక్స్-షోరూమ్ ఢీల్లీ.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios