దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా & మహీంద్రా బిఎస్ 6 కంప్లైంట్ కార్లపై డిస్కౌంట్లను ప్రకటించింది.  ఇందులో  వాహనాలపై నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్, ఇతర ఆఫర్లతో పాటు 3.06 లక్షల వరకు ఆకర్షణీయమైన డీల్స్ ఉన్నాయి.

ఈ డిస్కౌంట్ ఆఫర్ 31 జనవరి 2021 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే ఈ ఆఫర్లు, డీల్స్ దేశంలోని కొన్ని నగరాలు, ప్రాంతాలలో మార్పులు ఉండవచ్చు.

మహీంద్రా ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీపై 3.06 లక్షల వరకు  బెనెఫిట్స్ అందిస్తున్నారు. అలాగే బిఎస్ 6 అల్టురాస్ జి4పై  2.20 లక్షల వరకు నగదు తగ్గింపును,  50వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా అందిస్తున్నారు. 16వేల నుండి 20వేల వరకు కార్పొరేట్ డిస్కౌంట్, ఇతర బెనెఫిట్స్ కూడా ఉన్నాయి.

also read ఇండియాలోకి ఆస్టన్ మార్టిన్ స్పోర్ట్స్ లగ్జరీ కార్.. ధర, ఫీచర్స్ చూస్తే వావ్ అనాల్సిందే.. ...

మహీంద్రా స్కార్పియోపై  మొత్తం 39,502 డిస్కౌంట్ అందిస్తుండగా ఇందులో 10,002 క్యాష్ తగ్గింపు కూడా ఉంది, అలాగే 15వేల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్, 4.500 కార్పొరేట్ డిస్కౌంట్,  10వేల అదనపు డిస్కౌంట్ కూడా పొందావచ్చు.

మహీంద్రా కెయువి 100 ఎన్ఎక్స్ టి పై మొత్తం  62,055 డిస్కౌంట్ వస్తుంది, ఇందులో 38,055 వరకు నగదు తగ్గింపు, 20,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, 4,000 వరకు  కార్పొరేట్ డిస్కౌంట్ ఉంటుంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ 500 పై గరిష్టంగా రూ.59,000 బెనెఫిట్స్ పొందవచ్చు. ఇందులో 20,000 వరకు నగదు తగ్గింపు మరో రూ.20,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్, 9,000 వేల వరకు కార్పొరేట్ ఆఫర్,  10,000 వేల అదనపు ఆఫర్  ఉంటుంది.  మరాజో ఎంపివిపై 5,000 వరకు నగదు ఆఫర్, 15,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, 6,000 వేల వరకు కార్పొరేట్ ఆఫర్ అందిస్తున్నారు.

బిఎస్ 6 బొలెరో కొనాలనుకునే వినియోగదారులకు మొత్తం 24,000 వరకు బెనెఫిట్స్ పొందవచ్చు. ఇందులో 3,500 నగదు తగ్గింపు, 10,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్, 4,000 వేల కార్పొరేట్ ఆఫర్, 6,500 ఇతర ఆఫర్లు ఉన్నాయి.