ఇండియాలోకి ఆస్టన్ మార్టిన్ స్పోర్ట్స్ లగ్జరీ కార్.. ధర, ఫీచర్స్ చూస్తే వావ్ అనాల్సిందే..
ఆస్టన్ మార్టిన్ మొట్టమొదటిసారి డిబిఎక్స్ ఎస్‌యూవీ కారును భారతీయ మార్కెట్లోకి లాంచ్ చేసింది. ప్రత్యేకత ఏమిటంటే ఈ ఏడాది 2021 సంవత్సరంలో కేవలం 11 ఆస్టన్ మార్టిన్ డిబిఎక్స్ ఎస్‌యువి కార్లను మాత్రమే విక్రయించాలని కంపెనీ నిర్ణయించింది.
యూకే ప్రముఖ లగ్జరీ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ మొట్టమొదటిసారి డిబిఎక్స్ ఎస్‌యూవీ కారును భారతీయ మార్కెట్లోకి లాంచ్ చేసింది. ప్రత్యేకత ఏమిటంటే ఈ ఏడాది 2021 సంవత్సరంలో కేవలం 11 ఆస్టన్ మార్టిన్ డిబిఎక్స్ ఎస్‌యువి కార్లను మాత్రమే విక్రయించాలని కంపెనీ నిర్ణయించింది. సూపర్ ఎస్‌యూవీ కార్లు లంబోర్ఘిని ఉరుస్, ఆడి ఆర్‌ఎస్ క్యూ 8లతో ఆస్టన్ మార్టిన్ డిబిఎక్స్ పోటీగా నిలుస్తుంది.
ఇంజిన్, స్పీడ్
ఆస్టన్ మార్టిన్ డిబిఎక్స్ 4-లీటర్, ట్విన్-టర్బో వి8 ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ మెర్సిడెస్-ఎఎమ్‌జి నుండి తీసుకోబడింది, 550 పిఎస్ శక్తిని 700 ఎన్ఎమ్ టార్క్ను వద్ద ఉత్పత్తి చేస్తుంది. దీని ఇంజిన్ చాలా శక్తివంతమైనది, ఈ ఎస్‌యూవీ కేవలం 4.5 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.
ఈ ఎస్‌యూవీ కార్ టాప్ స్పీడ్ గంటకు 291 కి.మీ. 9-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉంటుంది. దీని ఇంజన్ ప్రత్యేక ఫీచర్ ఏమిటంటే దీనిలో సిలిండర్ యాక్టివేషన్ టెక్నాలజీని ఉంది.
ఆస్టన్ మార్టిన్ డిబిఎక్స్ కారు ముందు భాగంలో పెద్ద గ్రిల్, కారు లోపల చాలా ఆకర్షణీయమైన ఇంటెరియర్. ఈ ఎస్‌యూవీ కార్ బరువు 5వేల పౌండ్లకు పైగా ఉంటుంది, అంటే బెంట్లీ కాంటినెంటల్ జిటి కారు కంటే తక్కువ.
కారు వెనుక భాగంలో బంపర్లతో అమర్చిన ట్విన్-ఎగ్జాస్ట్ సిస్టమ్, ఎల్‌ఈడీ టైల్లైట్స్, సిగ్నేచర్ డక్‌టైల్ లాంటి బూట్ క్యాప్ స్పాయిలర్ కారు రూపాన్ని మరింత పెంచుతాయి.
also read డ్రైవర్ లేకుండా ఎగిరే కారు వచ్చేసిందొచ్చ్.. సిఈఎస్ 2021లో ప్రవేశపెట్టిన జనరల్ మోటార్స్.. ...
ఫీచర్స్
కారు లోపలి గురించి చెప్పపలంటే సీట్లు పూర్తిగా లెదర్ తో అందించారు. క్యాబిన్ సెంటర్ కన్సోల్‌లో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, డ్రైవర్ ముందు భాగంలో 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్, ఇది సూపర్ పదునైన గ్రాఫిక్ స్పోర్టి లేఅవుట్‌తో వస్తుంది. ఆపిల్ కార్ ప్లే స్టాండర్డ్ గా కారులో లభిస్తుంది.
దీనిలో డ్రైవింగ్ మోడ్‌ల నుండి నావిగేషన్ వరకు ప్రతి చిన్న సమాచారం మొత్తం అందుబాటులో ఉంటుంది. అలాగే, 360-డిగ్రీ కెమెరా సిస్టమ్, యాంబియంట్ లైటింగ్ సిస్టమ్ కూడా కారులో స్టాండర్డ్ గా అందించారు.
ఈ లైటింగ్ సిస్టమ్ ద్వారా 64 వేర్వేరు రంగులను మార్చుకోవచ్చు. ఈ కారులో బెస్ట్ మ్యూజిక్ అనుభవం కోసం 14-స్పీకర్లు (13 స్పీకర్లు , 1 సబ్ వూఫర్) ఉన్నాయి. వెనకాల 632-లీటర్ బూట్ స్పేస్ ఉంది. దీనితో పాటు వెనుక సీటును కారులో ఎక్కువ స్థలం కోసం 40:20:40 నిష్పత్తిలో విభజించవచ్చు.
ధర
ఆస్టన్ మార్టిన్ డిబిఎక్స్ ఎస్‌యూవి భారతదేశంలో ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ.3.82 కోట్లతో లాంచ్ చేశారు. కంపెనీ ఇప్పటికే ఈ కారును అంతర్జాతీయ మార్కెట్లో విక్రయిస్తోంది. కారులో చాలా ఫీచర్లు స్టాండర్డ్ గా ఇచ్చారు. కానీ కొనుగోలుదారులు వారి సౌలభ్యం, ఇష్టానుసారం ఈ కారును కస్టమైజ్ చేసుకోవచ్చు.