న్యూఢిల్లీ: భారత్‌లోని ఆటోమొబైల్ డీలర్లను ప్రస్తుతం బీఎస్‌‌-4 ఫోబియా వెంటాడుతోంది. వీరు ఈ నెలాఖరులోగా తమ దగ్గర ఉన్న బీఎస్‌‌-4 స్టాక్‌ వాహనాలను విక్రయించాల్సి ఉంటుంది. ఏప్రిల్‌‌ ఒకటో తేదీ నుంచి బీఎస్‌‌-4 వాహనాలకు రిజిస్ట్రేషన్‌‌ జరగదు. అంటే, ఇంకా 20 రోజుల టైమ్‌‌ మాత్రమే మిగిలి ఉంది. 

also read ముకేశ్ అంబానీకి షాక్ : ఒక్క రోజే వేల కోట్ల నష్టం...కారణం ?

అంతేకాదు, కరోనా దెబ్బతో కస్టమర్లు ఇటీవల షోరూమ్‌‌లకు రావడం తగ్గించేశారు. దీంతో ఈ నెల చివరిలోపు తమ దగ్గర గల బీఎస్‌‌-4 వాహనాల నిల్వలను విక్రయించలేమేమోనని ఆటో మొబైల్స్‌‌ డీలర్లు వాపోతున్నారు.  వీటికి తోడు బ్యాంకులు కూడా బీఎస్‌‌-4 వాహనాలకు ఫైనాన్స్‌‌ ఇవ్వలేమని నోటీసులు జారీ చేస్తున్నాయంటున్నారు.

గత నెలాఖరు వరకు పరిస్థితి అదుపులోనే ఉందని ఫెడరేషన్‌‌ ఆఫ్‌‌ ఆటోమొబైల్‌‌ డీలర్స్‌‌ అసోషియేషన్‌‌(ఫాడా) తెలిపింది. కానీ మార్చి మొదటి వారంలో పరిస్థితులలో మార్పొచ్చిందని పేర్కొంది. 

బీఎస్‌‌-4 వాహనాలకు రిజిస్ట్రేషన్లకు వివిధ రాష్ట్రాల ట్రాన్స్‌‌పోర్ట్‌‌ డిపార్ట్‌‌మెంట్లు తమ సొంత డెడ్‌‌లైన్స్‌‌ను విధిస్తుండటంతో డీలర్లు బెంబేలెత్తుతున్నట్లు వెల్లడించింది. ఒకేసారి పలు సమస్యలు డీలర్లను చుట్టుముట్టాయని, దీంతో తమ దగ్గర ఉన్న బీఎస్‌‌ 4 వాహనాలను అమ్మలేమని  భయపడుతున్నారని పేర్కొంది.

దీనిపై వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర రోడ్డు ట్రాన్స్‌‌పోర్ట్‌‌, హైవే మంత్రిత్వ శాఖతో మాట్లాడామని ఫాడా ప్రెసిడెంట్‌‌ ఆశిష్‌‌ హర్షరాజ్‌‌ కాలే అన్నారు. కానీ ఇప్పటికే డీలర్లలో నమ్మకం పడిపోయిందన్నారు.  బీఎస్‌‌ - 4 వెహికల్స్‌‌కు ఫైనాన్స్‌‌ను అందించడంపై  కూడా బ్యాంకులతో మాట్లాడామని తెలిపారు.

also read కరోనా ఎఫెక్ట్: అరేబియా సముద్రంలో యుద్ధం... భారీగా తగ్గనున్న చమురు ధరలు

పంజాబ్‌‌, వెస్ట్‌‌బెంగాల్‌‌, చత్తీస్‌గఢ్‌ వంటి రాష్ట్రాల నుంచి మాకు మద్ధతు లభిస్తోందని ఫాడా ప్రెసిడెంట్‌‌ ఆశిష్‌‌ హర్షరాజ్‌‌ కాలే అన్నారు. ఈ నెల చివరి వారాంతం‌లోనూ రిజిస్ట్రేషన్‌‌  పూర్తి చేయడానికి చూస్తామని ఈ రాష్ట్రాలు హమీ ఇచ్చాయన్నారు. 

టూ వీలర్‌‌ డీలర్లు ఎక్కువగా నష్టపోతారని, వీరి దగ్గర 20–30 రోజుల నిల్వలు ఇంకా మిగిలిపోయాయని ఫాడా ప్రెసిడెంట్‌‌ ఆశిష్‌‌ హర్షరాజ్‌‌ కాలే తెలిపారు. వీరితో పోల్చుకుంటే ప్యాసెంజర్‌‌‌‌, కమర్షియల్‌‌ వెహికల్‌‌ డీలర్లు కొంచెం మంచి పొజిషన్‌‌లోనే ఉన్నారని కాలే అన్నారు.  

డెడ్‌‌ లైన్‌‌లోపు పాత నిల్వలను అమ్ముకోలేకపోతే డీలర్లు భారీగా నష్టపోతారని ఫాడా ప్రెసిడెంట్‌‌ ఆశిష్‌‌ హర్షరాజ్‌‌ కాలే తెలిపారు. దీనిని నుంచి ఎలా బయటపడాలో ఒరిజినల్‌‌ ఎక్విప్‌‌మెంట్‌‌ మాన్యుఫ్యాక్చరర్లతో ‌‌(ఓఈఎం) చర్చిస్తామన్నారు.