క్రిస్టియానో రోనాల్డో చేతికి ప్రపంచంలోనే అ్యంత ఖరీదైన కారు!

దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రోనాల్డో ఇప్పటి వరకు తయారైన కార్లలో అత్యంత ఖరీదైన కారు బుగట్టి లా వాయిషీ నాయిర్‌ను సొంతం చేసుకుంటున్నట్లు సమాచారం. ఇంత ఖరీదైన కారును ఇప్పటివరకు ఏ సంస్థా తయారు చేయలేదని తెలుస్తోంది. 

Cristiano Ronaldo Buys World's Most Expensive Car, Worth 11 Million Euros: Report

రోమ్: దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రోనాల్డో ఇప్పటి వరకు తయారైన కార్లలో అత్యంత ఖరీదైన కారు బుగట్టి లా వాయిషీ నాయిర్‌ను సొంతం చేసుకుంటున్నట్లు సమాచారం. ఇంత ఖరీదైన కారును ఇప్పటివరకు ఏ సంస్థా తయారు చేయలేదని తెలుస్తోంది.

స్పానీష్ స్పోర్ట్స్ డైలీ మార్కా కథనం ప్రకారం.. ఈ విషయంపై స్పందించేందుకు బుగట్టి నిరాకరించింది. ఆ కారు యజమాని ఎవరు అనే విషయంపై స్పష్టతనివ్వలేదు. ఇటాలియన్ సిరీ ఏ జెయింట్స్ జువెంచస్ ఫుట్ బాల్ క్లబ్ తరపున ఆడిన పోర్చుగీసు ఆటగాడు అని మాత్రం  వెల్లడించింది.

ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ మాజీ ఛైర్మన్ ఫెర్నినాండ్ పిచ్ ఈ కారును దక్కించుకుంటున్నారనే వార్తలు కూడా వచ్చాయి. కాగా, డెయిలీ మెయిల్ కథనం ప్రకారం.. ఈ విలాసవంతమైన కారును రోనాల్డో 11 మిలియన్ యూరో(9.49 మిలియన్ పౌండ్) ఇచ్చి కొనుగోలు చేస్తారు. 

 కాగా, ఈ కాస్ట్లీకారును తొలిసారి 2019 జెనీవా మోటార్ షోలో ప్రదర్శనకు పెట్టారు. ఒక వేళ రొనాల్డో ఈ కారును కొనుగోలు చేసినా.. ఆయన నడపాలంటే 2021 వరకు ఆగాల్సిందే. ఎందుకంటే ప్రొటోటైప్ లాంటి అంశాలపై కంపెనీకి స్పష్టత రాలేదు. 

క్రిస్టియానో రొనాల్డో గ్యారేజీలో ఇప్పటికే ఒక మెర్సిడజ్ సీ క్లాస్ స్పోర్ట్ కాప్, రోల్స్ రాయీస్ ఫాంటమ్, ఉజిన్ ఫెరారీ 599 జీటీవో, ఒక లాంబోర్గిని, ఎవెంటడార్ ఎల్పీ 700-4, ఆస్టన్ మార్టిన్ డీబీ9, మెక్‌లారెన్ ఎంపీ4 12సీ, బెంట్లీ కాంటినెంటల్ జీటీసీ స్పీడ్.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios