బజాజ్ ఆటో , ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ విలీనం... మార్కెట్లోకి కొత్త బైకులు...

దేశీయ ఆటో దిగ్గజ సంస్థల్లో ఒక్కటైన బజాజ్ ఆటోమొబైల్, బ్రిటన్ ఆటో మేజర్ ట్రయంఫ్‌తో జత కట్టనున్నది. రెండు సంస్థలు సంయుక్తంగా మిడ్ రేంజి మోటారు సైకిళ్లను ఉత్పత్తి చేయనున్నాయి. అంతేకాదు తమ మార్కెట్లతో పరస్పరం లబ్ధి పొందనున్నాయి ట్రయంఫ్, బజాజ్ ఆటో.
 

Bajaj, Triumph To Announce Alliance This Month

న్యూఢిల్లీ: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థ బజాజ్ ఆటో, బ్రిటిష్ మోటారు సైకిల్ బ్రాండ్ ‘ట్రయంఫ్ మోటార్ సైకిల్స్` విలీనం కానున్నాయి. ఈ మేరకు ఈ నెల 24వ తేదీన రెండు మోటారు సైకిళ్ల బ్రాండ్ అలయెన్స్‌పై లాంఛనంగా ప్రకటన చేయనున్నాయి. 2017లో మిడ్ సైజ్ మోటారు సైకిళ్లను నిర్మించేందుకు చేతులు కలుపాలని నిర్ణయించిన ఈ రెండు సంస్థలు ఇంకా ఓ ఒప్పందానికి రాలేదు.

అయితే ఈ నెల 24వ తేదీన చేసే ప్రకటనలో నూతన శ్రేణి మిడ్ రేంజ్ మోటారు సైకిళ్ల ఉత్పత్తి విషయమై రెండు సంస్థలు నాన్-ఈక్విటీ పార్టనర్ షిప్ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు బ్రాండ్లు సంయుక్తంగా ఏయే మోటారు సైకిళ్లను అభివృద్ధి చేస్తాయన్న సంగతిని వెల్లడించలేదు.

also read అందుబాటులోకి ‘క్యూ’ ఫ్యామిలీ.. భారత విపణిలోకి ఆడి క్యూ8

సంయుక్త ఒప్పందం ఖరారైతే గానీ వివరాలు వెల్లడి కావు.  ట్రయంఫ్ సంస్థ ప్రొటోటైప్ మోటారు సైకిళ్ల విషయమై ప్రారంభ దశలో పరీక్షలు నిర్వహిస్తున్నది. కానీ విపణిలోకి విడుదల చేసే మోడళ్ల సంగతి మాత్రం ఇంకా వెల్లడి కాలేదు.బజాజ్, ట్రయంఫ్ సంస్థల మధ్య భాగస్వామ్య ఒప్పందం వివరాలు, 300-500 సీసీ సామర్థ్యం గల నూతన శ్రేణి మోటారు సైకిళ్ల అభివృద్ధి, విపణిలోకి విడుదల చేయడానికి టైం లైన్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

అయితే ఇప్పటివరకైతే ట్రయంఫ్ వద్ద ఒక్క సింగిల్ మోడల్ కూడా సిద్ధంగా లేదు. గతేడాది చివరిలో బజాజ్ ఆటోమొబైల్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్.. బ్రిటన్‌లోని ట్రయంఫ్ హెడ్ క్వార్టర్ గల హింక్లేకు వెళ్లినట్లు సమాచారం. మిడ్ సైజ్ మోటారు సైకిళ్లను 2020 ప్రారంభంలో రెండు సంస్థలు వెలువరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Bajaj, Triumph To Announce Alliance This Month

బజాజ్, ట్రయంఫ్ సంస్థల మధ్య నాన్-ఈక్విటీ ఒప్పందం కుదిరినా ఇది రాయల్ బేస్డ్‌గా ఉంటుందని సమాచారం. దీని ప్రకారం రెండు సంస్థల మేథో సంపత్తి హక్కులు వాటి వద్దే కొనసాగుతాయి. రెండు సంస్థలు సంయుక్తంగా మల్టీపుల్ మిడ్ సైజ్ మోటారు సైకిళ్లు సింగిల్ ఇంజిన్ ఫ్లాట్ ఫాంపై 300-500 సీసీ సెగ్మెంట్‌లో ఉత్పత్తి చేస్తారు. 

also read ఈ-స్కూటర్‌గా బజాజ్ ‘చేతక్‌' రీ ఎంట్రీ.. ఒక్క చార్జింగ్‌తో 95కి.మీ మైలేజ్

ట్రయంఫ్ మోటారు సైకిళ్లన్నీహింక్లేలో డిజైన్ చేసి అభివృద్ధి చేస్తారు. కానీ పుణె నగర శివారుల్లోని చకాన్‌లో గల బజాజ్ ఆటో ఉత్పాదక యూనిట్ లో వాటిని ఉత్పత్తి చేస్తారు. భారతదేశంలో ట్రయంఫ్ బైకులు మార్కెట్ చేసుకున్నా.. వివిధ దేశాల మార్కెట్లలో బజాజ్ ఆటో శక్తి సామర్థ్యాల నుంచి లబ్ధి పొందనున్నది. 

బజాజ్ ఆటో దేశంలోనే అతిపెద్ద మోటారు సైకిళ్ల ఎగుమతి దారు. ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆగ్నేయాసియా దేశాలకు బజాజ్ ఆటో మోటారు సైకిళ్లను ఎగుమతి చేస్తున్నది. దీనివల్ల ట్రయంఫ్‌కు కూడా లబ్ధి చేకూరనున్నది.  అంతర్జాతీయంగా తమ ఫుట్ ప్రింట్ పెంచుకునేందుకు బజాజ్ ఆటో, ట్రంఫ్ వ్యూహాత్మకంగా తీసుకున్న విలీన నిర్ణయం ముఖ్యమైన మైలురాయి కానున్నది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios