వాహన పత్రాల వాలిడిటీ మరోసారి పొడిగింపు..సెప్టెంబర్ 30 వరకు అవకాశం..
రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ చేసిన ఒక ట్వీట్‌లో, "రహదారి రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఈ ఏడాది సెప్టెంబర్ వరకు మోటారు వాహన పత్రాల వాలిడిటీ తేదీని మరో మూడు నెలలు అంటే సెప్టెంబర్ 30 వరకు పొడిగించినట్లు ప్రకటించారు.
న్యూ ఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వాలిడిటీ ముగిసిన అన్ని రవాణా పత్రాలు డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్ నేస్, పర్మిట్లు, రిజిస్ట్రేషన్ ఇంకా ఇతర సంబంధిత సర్టిఫికేట్ల చెల్లుబాటు సెప్టెంబర్ 30 వరకు మరోసారి పొడిగించింది.
రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ చేసిన ఒక ట్వీట్‌లో, "రహదారి రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఈ ఏడాది సెప్టెంబర్ వరకు మోటారు వాహన పత్రాల వాలిడిటీ తేదీని మరో మూడు నెలలు అంటే సెప్టెంబర్ 30 వరకు పొడిగించినట్లు ప్రకటించారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా మోటర్ వాహన పత్రాల వాలిడిటీని కేంద్రం పొడిగించడం ఇది వరుసగా రెండోసారి.
also read రవాణాశాఖ కీలక నిర్ణయం..బీఎస్-6 వాహనాలకు ఇక స్పెషల్ స్టిక్కర్..
కేంద్ర మంత్రి, శ్రీ నితిన్ గడ్కరీ మోటారు వాహనాల వాలిడిటీ తేదీని అన్ని రాష్ట్రాలు, యుటిలు పొడిగించాలని ప్రకటించారు. ఫిట్ నేస్, పర్మిట్ (అన్ని రకాల), డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లాక్ డౌన్ కారణంగా వాలిడిటీ పొడిగిస్తున్నట్లు తెలిపింది.
ఫిబ్రవరి 1తో గడువు ముగియనున్న అన్నీ వాహన సర్టిఫికేట్లకు లాక్ డౌన్ కారణంగా కొత్తవి మంజూరు చేయలేమని తెలిపింది. ఇందుకుకోసం సెప్టెంబర్ 30, నాటికి వాటి వాలిడిటీ పరిగణించాలీ అని అన్నీ రాష్ట్రాలకు తెలిపింది.
అంతకుముందు మార్చిలో, ప్రభుత్వం అటువంటి పత్రాల వాలిడిటీని మొదటిసారిగా జూన్ 30 వరకు పొడిగించింది.