కోలుకోని ఆటోమొబైల్ రంగం... మారుతి మినహా అన్నీ డౌన్...

బీఎస్-6 ప్రమాణాలతో రూపుదిద్దుకున్న వాహనాల విడుదలపై కేంద్రీకరిస్తున్న ఆటోమొబైల్ సంస్థలకు జనవరి విక్రయాల్లోనూ రిలీఫ్ కనిపించలేదు. మారుతి మినహా దాదాపు అన్ని సంస్థల విక్రయాలు, ఎగుమతులు పడిపోయాయి.
 

Auto sales remain in slow lane in January

న్యూఢిల్లీ: నూతన సంవత్సరంలోనూ ఆటోమొబైల్ పరిశ్రమ కోలుకునే సంకేతాలు కనిపించడం లేదు. జనవరిలో కొన్ని సంస్థలు మినహా మొత్తం వివిధ ఆటోమొబైల్ సంస్థల విక్రయాలు పడిపోతున్నాయి. దేశీయంగా ప్రయాణ వాహనాల తయారీ సంస్థ మారుతి సుజుకి విక్రయాలు స్వల్పంగా పెరిగాయి.

ఎగుమతులతోపాటు మారుతి విక్రయాలు కేవలం 1.6 శాతం ఎక్కువగా జరిగాయి. 2019 జనవరిలో 1,51,721 కార్లు విక్రయాలు పెరిగితే, ఈ ఏడాది 1,54,123 వాహనాల విక్రయాలు జరిగాయి. దేశీయంగా మారుతి సుజుకి విక్రయాలు 1.7 శాతం పెరిగాయి. గతేడాదితో పోలిస్తే దేశీయంగా 1,44,499 విక్రయాలు జరిగాయి. ఎగుమతులు 0.6 శాతం పెరిగి 2019లో 9,571 నుంచి 9,624 వాహనాలకు చేరాయి. 

also read కరోనా వైరస్ దెబ్బకు చైనా స్టాక్ మార్కెట్లు విలవిల

దక్షిణ కొరియా ఆటోమొబైల్ మేజర్ హ్యుండాయ్ ఇండియా ఎగుమతులతోపాటు విక్రయాలు 3.37 శాతం తగ్గుముఖం పట్టాయి. 2019 జనవరిలో 53,813 కార్లు అమ్ముడు పోగా, ఈ ఏడాది 52,002 కార్లకు పడిపోయాయి. దేశీయంగా సేల్స్ 8.3 శాతం తగ్గిపోయి 2019 జనవరితో పోలిస్తే 45,803 కార్ల నుంచి 42,002 కార్లకు పడిపోయాయి. కానీ హ్యుండాయ్ మోటార్స్ ఎగుమతుల్లో 24.8 శాతం పెరిగాయి. 2019 జనవరిలో 8010 వాహనాలు ఎగుమతి చేస్తే ఈ ఏడాది 10 వేలకు చేరాయి.

Auto sales remain in slow lane in January

టాటా మోటార్స్ ఎగుమతులతోపాటు సేల్స్ భారీగా తగ్గుముఖం పట్టాయి. 2019 జనవరిలో టాటా మోటార్స్ సేల్స్ 58,185 యూనిట్లు జరిగితే 2020 జనవరిలో అది 47,862 కార్లకు పడిపోయాయి. దేశీయ విక్రయాలు 18 శాతం తగ్గిపోయాయి. 2019 జనవరిలో 54,914 కార్లు అమ్ముడైతే ఈ ఏడాది 45,242 కార్లకు పడిపోయాయి. 

టాటా మోటార్స్ వాణిజ్య వాహనాల విక్రయాలు కూడా 16 శాతం పడిపోయాయి. 40,175 నుంచి 33,860 కార్లకు పతనం అయ్యాయి. ప్రయాణ కార్లు 22 శాతం తగ్గుముఖం పట్టాయి. 2019 జనవరిలో 17,826 కార్ల విక్రయాలు జరిగితే ఈ ఏడాది 13,984 యూనిట్లకు పడిపోయాయి. 

also read ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నా ఎల్ఐసీ ఉద్యోగ సంఘాలు...ఎందుకు..?

‘వాణిజ్య వాహనాల విక్రయాలు 15 శాతం తగ్గుముఖం పట్టాయి. రిటైల్ సేల్స్ వరుసగా ఏడో నెలలో పడిపోయాయి. ప్రస్తుతం మేమంతా బీఎస్-6 వాహనాల పరివర్తనకు దగ్గరయ్యాం‘ అని టాటా మోటార్స్ వాణిజ్య వాహనాల విభాగం అధ్యక్షుడు గిరిష్ వాగ్ చెప్పారు. 

మహీంద్రా అండ్ మహీంద్రా సేల్స్ ఆరు శాతం తగ్గిపోయాయి. 2019 జనవరిలో 55,722 కార్లు అమ్ముడు పోగా, ఈ ఏడాది జనవరిలో 52,546 కార్లు విక్రయించింది మహీంద్రా అండ్ మహీంద్రా. దేశీయంగా మహీంద్రా అండ్ మహీంద్రా సేల్స్ మూడు శాతం తగ్గి 52,500 నుంచి 50,785 వాహనాలకు పడిపోయాయి. ఎగుమతులు దారుణంగా 45 శాతం పడిపోయాయి. మహీంద్రా వాహనాల ఎగుమతులు 3222 నుంచి 1761 వాహనాలకు పతనమయ్యాయి. 

మహీంద్రా అండ్ మహీంద్రా సేల్స్ అండ్ మార్కెటింగ్ చీఫ్ విజయ్ రాం నక్రా స్పందిస్తూ జనవరి నెలలో వాహనాల విక్రయాలు పూర్తిగా పతనం అయ్యాయని చెప్పారు. తాము బీఎస్-6 ప్రమాణాలతో రూపొందించిన ఎక్స్‌యూవీ 300 మోడల్ కార్లను విపణిలో ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios