Asianet News TeluguAsianet News Telugu

ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నా ఎల్ఐసీ ఉద్యోగ సంఘాలు...ఎందుకు..?

వచ్చే ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ఎల్ఐసీ ప్రతిపాదిత ఐపీవోకు వెళుతుందని ఆర్థికశాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ తెలిపారు. ఇందుకోసం పలు చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. ముందుగా చట్ట సవరణ చేసి, ఎల్ఐసీ బోర్డు ఆమోదించాల్సి ఉందని చెప్పారు. అయితే ఎల్ఐసీ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి.

LIC IPO may come in 2nd half of FY21, says Finance Secretary
Author
Hyderabad, First Published Feb 3, 2020, 12:35 PM IST

ముంబై: భారత జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) వచ్చే ఆర్థిక సంవత్సరం 2020-21 ద్వితీయర్థంలో ఐపీవోకు వెళ్లనున్నదని ఆర్థిక కార్యదర్శి రాజీవ్ కుమార్ వెల్లడించారు. శనివారం పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సమయంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఎల్‌ఐపిలో ప్రభుత్వ వాటాలను విక్రయించనున్నామని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఐపీఓ (ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్) రానుందని తెలిపారు.

ఎల్‌ఐసి లిస్టింగ్ కోసం అనేక ప్రక్రియలు చేపట్టాల్సి ఉందని, కొన్ని చట్టపరమైన మార్పులు చేయాల్సి ఉందని ఆదివారం రాజీవ్ కుమార్ మీడియాకు చెప్పారు. సంబంధిత మంత్రిత్వశాఖతో సంప్రదింపులు జరపాల్సి ఉండడంతో పాటు లిస్టింగ్‌కు విధి విధానాలు తేవాల్సి ఉందని, ఇప్పటికే ప్రక్రియ ప్రారంభమైందని రాజీవ్ కుమార్ అన్నారు.

ఎల్‌ఐసి లిస్టింగ్ విషయంలో చాలా పారదర్శకంగా, ఈక్విటీ మార్కెట్‌కు అనుగుణంగా ఉంటుందని మీడియా సంస్థతో ఆయన అన్నారు.వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎల్‌ఐసీ లిస్టింగ్, ఐడిబిఐలో వాటాల విక్రయం ద్వారా రూ.90 వేల కోట్లు సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం లక్షంగా చేసుకుంది. 2020-21లో మొత్తం రూ.2.10 లక్షల కోట్లు సమీకరణ ప్రభుత్వం టార్గెట్‌. 

also read ఐటీ శ్లాబ్‌లపై కనిపించని క్లారిటీ...13 లక్షలు దాటితే...

ప్రస్తుతం ఎల్‌ఐసిలో ప్రభుత్వానికి 100 శాతం వాటా ఉండగా, ఈ ఎల్‌ఐసి ఇటీవల ఐడిబిఐ బ్యాంక్‌లో 46.5 శాతం వాటాను సొంతం చేసుకుంది. స్టాక్ ఎక్సేంజ్‌ల్లోకి కంపెనీల లిస్టింగ్ సంస్థలకు క్రమశిక్షణ కల్గిస్తుందని, ఫైనాన్షియల్ మార్కెట్లకు చేరువై, విలువ తెలుస్తుందని, దీంతో రిటైల్ ఇన్వెస్టర్ల సంపద సృష్టికి అవకాశం లభిస్తుందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో అన్నారు.

అందుకే ఎల్‌ఐసీలో కొంత భాగాన్ని విక్రయించేందుకు ప్రభుత్వం ఐపీఓకు వెళుతోందని సీతారామన్ తెలిపారు. ఎల్‌ఐసీ పట్ల మార్కెట్ వర్గాలు చాలా ఆసక్తితో ఉన్నారని, సౌదీ ఆరాంకో మాదిరిగా దశాబ్దంలో అతిపెద్ద ఐపీఓగా అవతరించనుందని అన్నారు. 60 ఏళ్ల ప్రభుత్వరంగ సంస్థ ఎల్‌ఐసీ దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ. ఈ సంస్థకు 70 శాతం మార్కెట్ వాటా ఉంది.

LIC IPO may come in 2nd half of FY21, says Finance Secretary

అనేక పాలసీలలో ఈ బీమా సంస్థకు 76.28 శాతం వాటా ఉండగా, మొదటి సంవత్సరం ప్రీమియంలో 71 శాతం వాటా ఉంది. ఎల్‌ఐసీ అనుబంధ సంస్థల్లో ఐడీబీఐ బ్యాంక్ ఉంది. గతేడాదిలో ఈ బ్యాంక్‌లో నియంత్రణ వాటాను ఎల్‌ఐసీ సొంతం చేసుకుంది.ఎల్‌ఐసీలో వాటా విక్రయ ప్రతిపాదన 2020-21 బడ్జెట్‌ ప్రసంగంలో నిర్మలా సీతారామన్‌ చేసిన అతిపెద్ద ప్రకటనగా చెప్పుకోవచ్చు. ఎల్‌ఐసీలో ఎంత వాటాను ఎప్పటి వరకు విక్రయించాలనుకుంటున్నది మాత్రం ఆమె వెల్లడించలేదు.

ఎల్‌ఐసీ చట్టం ద్వారా 1956లో ఎల్‌ఐసీ ఏర్పాటైంది. ఇందులో ప్రభుత్వానికి 100 శాతం వాటా ఉంది. ఇతర బీమా కంపెనీల మాదిరిగానే ఎల్‌ఐసీ కూడా భారతీయ బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) పరిధిలోకే వస్తుందిప్రస్తుతం ఎల్‌ఐసీ దేశీయ బీమా సంస్థల్లో అతిపెద్దది. 2019 ఏప్రిల్‌ నుంచి డిసెంబర్ వరకు ఎల్‌ఐసీ వసూలు చేసిన నూతన ప్రీమియం మొత్తం రూ.1.37 లక్షల కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చితే వృద్ధి 45.5 శాతం రికార్డైంది.

ప్రీమియం చెల్లింపుల పరంగా 2019 డిసెంబర్ నాటికి ఎల్‌ఐసీ మార్కెట్‌ వాటా 70.52 శాతంగా ఉంది. 2009 నుంచి 2019 వరకు పెట్టుబడుల ద్వారా వచ్చిన ఆదాయంలో 291 శాతం వృద్ధి నమోదైంది. 2018-19లో పెట్టుబడుల ద్వారా  రూ.2,21,573 కోట్ల ఆదాయం సమకూర్చుకుంది.  

also read ఫోటోలు లీక్:అమెజాన్ సి‌ఈ‌ఓ పై అతని గర్ల్ ఫ్రెండ్ సోదరుడి దావా...

2018-19లో ఎల్‌ఐసీ పెట్టుబడులు రూ.29.84 లక్షల కోట్లు. ఇందులో సెక్యూరిటీల వాటా రూ.28.3 లక్షల కోట్లు, రుణాల వాటా రూ.1.17 లక్షల కోట్లు (పాలసీ రుణాలు, మార్ట్‌గేజ్‌ రుణాలు సహా)గా ఉంది.2018-19లో ఈక్విటీ మార్కెట్లో ఎల్‌ఐసీ రూ.68,620 కోట్ల పెట్టుబడి పెట్టింది. 

2019-20 ప్రథమార్ధంలో ఈక్విటీ మార్కెట్లో ఎల్‌ఐసీ పెట్టుబడి సుమారు రూ.33,500 కోట్లుగా నమోదైంది. ఎల్‌ఐసీని పబ్లిక్‌ ఇష్యూకు తీసుకువెళ్లాలంటే ఎల్‌ఐసీ చట్టంలో ప్రభుత్వం సవరణలు చేయాల్సి ఉంటుంది. ఐపీఓకు పార్లమెంట్‌ అనుమతి అవసరం. ఆ తర్వాత ఎల్‌ఐసీ బోర్డు, ఐఆర్‌డీఏఐ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది.

ఎల్‌ఐసీ మొత్తం ఆస్తులు 2018-19లో అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే దాదాపు 9 శాతం పెరిగి రూ.36.11 లక్షల కోట్లకు చేరాయి. 2018-19లో మొత్తం ప్రీమియం ఆదాయం 6 శాతం పెరిగి రూ.3.37 లక్షల కోట్లకు చేరింది.మొత్తం ఆదాయం (పెట్టుబడులు సహా) 7 శాతం పెరిగి రూ.5.6 లక్షల కోట్లకు చేరుకుంది. క్లెయిమ్‌లు 26.6 శాతం పెరిగి రూ.2.5 లక్షల కోట్లకు చేరాయి. 2019 ఆర్థిక సంవత్సరంలో ఎన్‌పీఏల కోసం రూ.23,760 కోట్లు కేంద్రం కేటాయించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios