Asianet News TeluguAsianet News Telugu

భారత మార్కెట్లోకి ఆడి ‘క్యూ7, ఏ4’ లైఫ్‌స్టైల్ కార్లు: స్పెషల్ ఫీచర్స్

జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘ఆడి’ భారత మార్కెట్లోకి క్యూ7 ఎస్ యూవీ, ఏ4 సెడాన్ కార్లను ప్రవేశపెట్టింది. వినియోగదారుల ఆకాంక్షలకు అనుగుణంగా అధునాతన ఫీచర్లను చేర్చామని అడి ఇండియా అధిపతి రహిల్ అన్సారీ చెప్పారు.
 

Audi launches new editions of Q7 SUV, A4 sedan in India
Author
New Delhi, First Published Apr 25, 2019, 3:16 PM IST

న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘ఆడి’ తాజాగా భారత మార్కెట్లోకి ఎస్‌యూవీ క్యూ7, సెడాన్‌ ఏ4 మోడళ్లలో ‘లైఫ్‌ స్టైయిల్‌’ పేరుతో నూతన వేరియంట్లను ప్రవేశపెట్టింది. ఆడి క్యూ7 లైఫ్‌ స్టైయిల్‌ ఎడిషన్‌ ధర రూ. 75.82 లక్షలు కాగా, ఏ4 లైఫ్‌ స్టైయిల్‌ ఎడిషన్‌ ధర రూ. 43.09 లక్షలుగా నిర్ణయించింది.

ఈ సందర్భంగా ఆడి ఇండియా హెడ్‌ రహిల్‌ అన్సారి మాట్లాడుతూ ‘ఏ6 మోడల్‌కు లైఫ్‌ స్టైయిల్‌ పేరుతో కొత్త వేరియంట్‌ను విడుదల చేశాక మా వినియోగదారుల నుంచి మంచి స్పందన వచ్చింది. నూతన వేరియంట్లకు బలమైన డిమాండ్‌ దక్కింది. ఈ ప్రేరణతో తాజాగా మరో రెండు నూతన వేరియంట్లను విడుదలచేశాం’ అని అన్నారు.   

ఈ స్పెషల్ ఎడిషన్ కార్లలో ఆపిల్ అండ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో అందుబాటులో ఉండే ఫ్రీ స్మార్ట్ ఫోన్ యాప్ ‘ఆర్ఎస్ఈ రిమోట్’తో ట్విన్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ ఫీచర్ ఏర్పాటు చేశారు. 16 జీబీ ఇంటర్నల్ సామర్థ్యంతోపాటు 1200x800 (హెచ్డీ -రెడీ) కెపాసిటీ గల  10- ఇంచ్ స్క్రీన్ లభిస్తోంది. 

ఈ రెండు కార్లలోనూ ఎల్ఈడీ ఎంట్రీ లైట్స్ అమర్చారు. క్యూ7లో ఖ్వాట్రో, ఏ4లో ఆడి లోగోతో కూడిన ఎల్ఈడీ లైట్లు అందుబాటులో ఉన్నాయి. రెండు కార్ల బోర్డులపై యాంటీ స్లిప్ స్ట్రిప్స్, రూప్ బార్స్, రూఫ్ మౌంటెడ్ స్కై, లగేజ్ బాక్స్ అదనంగా ఏర్పాటు చేశారు. ప్రతి బాక్స్‌లోనూ 150 కిలోల సామర్థ్యం గల బ్యాగేజీ ఉంటుంది. 

ఇంకా ఎస్‌ప్రెస్సో మొబిల్ ఖాఫీ మిషన్‌ను క్యూ 7 లైఫ్ స్టయిల్‌ కారులో చేర్చారు. అదనంగా ఆడీ కూల్ బాక్స్ ఫీచర్ లభిస్తోంది. ఎ4 లైఫ్ స్టయిల్ కారులో ఎల్ఈడీ టైల్ లైట్స్, హై క్వాలిటీ స్టెయిన్ లెస్ స్టీల్ పెడల్ కవర్లు కూడా అమర్చారు. ఈ రెండు కార్లలో పూర్తిగా ఇన్నోవేటివ్ యాస్సెస్సరీస్ వినియోగదారుల ఆకాంక్షల మేరకు అమర్చామని ఆడి ఇండియా హెడ్‌ రహిల్‌ అన్సారి తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios