Asianet News TeluguAsianet News Telugu

డ్రైవర్ లేకుండా ఎగిరే కారు వచ్చేసిందొచ్చ్.. సి‌ఈ‌ఎస్ 2021లో ప్రవేశపెట్టిన జనరల్ మోటార్స్..

ఈ ఫ్లయింగ్ కారు ప్రత్యేకత ఏమిటంటే ఇది సెల్ఫ్ డ్రైవింగ్ వాహనం. అంటే ఇది డ్రైవర్ లేకుండా స్వయంగా ఎగురుతుంది, కిందకి వస్తుంది. 

self driving futuristic car  flying cadillac autonomous vehicles showcased  electric vehicles ces 2021
Author
Hyderabad, First Published Jan 13, 2021, 4:30 PM IST

జనరల్ మోటార్స్ మంగళవారం ఫ్యూచరిస్టిక్ ఫ్లయింగ్ కాడిలాక్ (కాడిలాక్) ను ప్రవేశపెట్టింది. ఈ ఫ్లయింగ్ కారు ప్రత్యేకత ఏమిటంటే ఇది సెల్ఫ్ డ్రైవింగ్ వాహనం. అంటే ఇది డ్రైవర్ లేకుండా స్వయంగా ఎగురుతుంది, కిందకి వస్తుంది. రోడ్ల పైన ఎగిరే ఈ కారు ప్రయాణీకులకు విమానంలో ప్రయాణించే అనుభూతిని ఇస్తుంది.  

ఫ్లయింగ్ కారు వేగం : కాడిలాక్ ఎగిరే కారులో ఒక్కరూ మాత్రమే ప్రయాణించగలరు. సాంకేతికంగా ఇది హెలికాప్టర్ లాగా భూమి నుండి నేరుగా  నిలువునా పైకి టేకాఫ్ అవుతుంది అలాగే ల్యాండింగ్ (VTOL) అవుతుంది. ఈ ఎగిరే వాహనం గంటకు 55 మైళ్ళు అంటే 88.5 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. 

ఈ వాహనం గురించి ?

ఇది పూర్తిగా సెల్ఫ్ ఆటోమేటెడ్, ఆల్-ఎలక్ట్రిక్ వాహనం. దీనిలో 90 కిలోవాట్ల మోటారు, జిఎం అల్టియం బ్యాటరీ ప్యాక్, నాలుగు జతల రోటర్లతో అల్ట్రా-లైట్ వెయిట్ బాడీని ఉపయోగించారు. ఫ్లయింగ్ కాడిలాక్‌ను చీఫ్ ఎగ్జిక్యూటివ్ మేరీ బారా వర్చువల్ ప్రెజెంటేషన్ ద్వారా పరిచయం చేశారు.

దీనితో పాటు ఫ్యామిలి-ఫ్రెండ్లీ  కాడిలాక్ ఎలక్ట్రిక్ షటిల్ కూడా ఉంది. ఎయిర్ టాక్సీల వంటి ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను కూడా కంపెనీ అన్వేషిస్తోందని మేరీ బారా గత సంవత్సరం నివేదించారు. 

also read ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో సంచలనం.. బెంగళూరులో టెస్లా ఆర్‌అండ్‌డి సెంటర్ ఏర్పాటు.. ...

మొదటిసారిగా ప్రపంచంలోని అతిపెద్ద టెక్నాలజీ కంపెనీలు కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ (సి‌ఈ‌ఎస్) షాపుల వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తున్నాయి. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా 1000 కంపెనీలు ఈ అతిపెద్ద ఈవెంట్ మ్యాచ్-మేడ్ డిజిటల్ వేదికలో కొత్త, వినూత్న ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి.

ఈ ఈవెంట్ జనవరి 11 నుండి 14 వరకు నడుస్తుంది. ఫిబ్రవరి 15 లోగా డిజిటల్ కంపెనీలు ఉత్పత్తుల గురించి సమాచారాన్ని అందిస్తుంది. 

సిఇఎస్‌లో చూపిన వీడియో ఆధారంగా అటానమస్ కాడిలాక్ షటిల్ "త్వరలో వస్తుంది". ఈ ఫ్లయింగ్ కాడిలాక్ డిజైన్ క్రూయిజ్ డిజైన్ నుండి ప్రేరణ పొందిన బాక్సీ సిల్హౌట్ లాంటిది. దీనికి ముందు, వెనుక స్లైడింగ్ డోర్స్, పనోరమిక్ గ్లాస్ రూఫ్ ఉంది, ఇది చాలా ఆకర్షణీయమైన రూపాన్ని ఇస్తుంది. 

క్యాబిన్లో ర్యాప్ అరౌండ్ లాంజ్ లాంటి సీటింగ్ అమరిక ఉంది. ఈ వాహనంలో బయోమెట్రిక్ సెన్సార్లు, వాయిస్ కంట్రోల్, హ్యాండ్ సిగ్నల్  సెన్సార్ ఫీచర్స్ అందించారు. జనరల్ మోటార్స్  ఫ్లయింగ్ కాడిలాక్ గురించి మరింత సమాచారం ఇవ్వడానికి నిరాకరించింది.

Follow Us:
Download App:
  • android
  • ios