లాక్ డౌన్ ఎఫెక్ట్: సెకండ్ హ్యాండ్ కార్లకు పెరుగుతున్న డిమాండ్...

కరోనా ‘లాక్ డౌన్’ వ్యక్తిగత వాహనాల వినియోగానికి ప్రాధాన్యం పెంచింది. ప్రాణాంతక కొవిడ్-19తో ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నందున వ్యక్తిగత వాహనాల కోసం డిమాండ్ ఎక్కువైందని కార్స్ 24 సర్వేలో తేలింది.

42 Percent of Indians Will Buy A Family Car, Likely A Pre-owned After Lockdown

న్యూఢిల్లీ:  కరోనాను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ ముగుస్తున్న తరుణంలో సెకెండ్‌ హ్యాండ్‌ కార్లకు మంచి డిమాండ్‌ వస్తోందని యూజ్డ్‌ కార్లను అమ్మే ప్లాట్‌ఫామ్‌ కార్స్‌ 24 పేర్కొంది. లాక్‌డౌన్‌ ముందుతో పోలిస్తే వీటి ధరలు తగ్గడం కూడా దీనికొక కారణమని తెలిపింది.

ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ఒక్కరూ రాజీ పడేందుకు సిద్ధంగా లేరని కార్స్ 24 సర్వేలో తేలింది. లాక్ డౌన్ ముగిస్తే ప్రజా రవాణా సర్వీసులైన బస్సులు, మెట్రో రైళ్లలో ప్రయాణించడానికి ఇష్ట పడటంలేదు. తమ భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే సొంత వాహనం కోసం ప్రాధాన్యం ఇస్తున్నారు.

మారుతీ  స్విఫ్ట్‌, హ్యుండాయ్ శాంట్రో జింగ్‌, హ్యుండాయ్‌ గ్రాండ్‌ ఐ 10, హోండా సిటీ, మారుతీ స్విఫ్ట్‌ డిజైర్‌‌ వంటి ఐదు మోడళ్లకు కస్టమర్ల నుంచి డిమాండ్‌ ఎక్కువగా ఉందని  కార్స్ 24 చెప్పింది. సొంత కారు ఉండడంపై కార్స్‌24 ‌ ఓ కస్టమర్‌ సర్వే చేసింది. లాక్‌డౌన్‌ ముగిశాక సొంతంగా కారు కొనుక్కోవాలని 40–45 శాతం కస్టమర్లు చెప్పారని పేర్కొంది. 

కరోనా నేపథ్యంలో సేఫ్టీ కోసం సొంత వెహికల్‌ ఉండడం మంచిదని కస్టమర్లు భావిస్తున్నారని కార్స్‌24 ఫౌండర్‌‌ గజేంద్ర జంగిడ్‌ అన్నారు. లాక్‌డౌన్‌కి ముందు కారు కొనాలనుకునే కస్టమర్ల ఆలోచనలోనూ మార్పులొస్తున్నాయని అన్నారు. వీరిలో 23 శాతం మంది కొత్త కారుకి బదులు సెకెండ్‌ హ్యాండ్‌ కారు కొనడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొన్నారు. 

also read టెస్లా సరికొత్త రికార్డు..ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆటో కంపెనీగా..

లాక్‌డౌన్‌తో కస్టమర్ల ఆదాయం పడిపోవడం కూడా ఇందుకు కారణమని కార్స్ 24 ఫౌండర్ గజేంద్ర జంగిడ్ పేర్కొన్నారు. కార్స్‌24 వెబ్‌సైట్‌లో సెల్లర్‌‌ సైడ్‌ కంటే బయ్యర్‌‌ సైడ్‌ నుంచే ట్రాఫిక్‌ ఎక్కువగా ఉందని గజేంద్ర చెప్పారు. 

సెకెండ్‌ హ్యాండ్‌ కార్లకు డిమాండ్‌ పెరుగుతోందని, ఇది లాక్‌డౌన్‌ ముందు స్థాయికి చేరుకుంటోందని గజేంద్ర జంగిడ్ అన్నారు.  వెబ్‌సైట్‌లో బయ్యర్‌‌ సైడ్‌ నుంచి నెలకు 20 లక్షల నుంచి 25 లక్షల విజిట్స్‌ వస్తున్నాయని అన్నారు. 

సెకెండ్‌ హ్యాండ్‌ కార్ల ధరలు తగ్గడం కూడా వీటి డిమాండ్‌ పెరగడానికి కారణంగా ఉందని గజేంద్ర జంగిడ్ చెప్పారు. గతంలో సగటున రూ. 2.6 లక్షలు ఉన్న కారు, ప్రస్తుతం రూ.2.25 లక్షలకు తగ్గిందన్నారు. కరోనా దెబ్బతో ప్రస్తుతం సొంత వెహికల్‌ ఉండడం ఒక అవసరంగా మారిందని అభిప్రాయపడ్డారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios